సీపీ ఆఫీసు వద్ద టెన్షన్‌.. పోలీసులకు కౌశిక్‌ రెడ్డి వార్నింగ్‌ | BRS MLA Padi Kaushik Reddy Warning To Police | Sakshi
Sakshi News home page

సీపీ ఆఫీసు వద్ద టెన్షన్‌.. పోలీసులకు కౌశిక్‌ రెడ్డి వార్నింగ్‌

Published Thu, Sep 12 2024 5:57 PM | Last Updated on Thu, Sep 12 2024 6:40 PM

BRS MLA Padi Kaushik Reddy Warning To Police

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, అరికెపూడి గాంధీల ఎపిసోడ్‌ రాజకీయంగా ఘర్షణలకు దారి తీసింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరికెపూడి గాంధీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరోవైపు.. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలంటూ కౌశిక్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ సీపీ ఆఫీసు వద్ద కౌశిక్‌ రెడ్డి, పోలీసులకు మధ్య వాదన జరిగింది.

సైబరాబాద్ సీపీ ఆఫీస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొండాపూర్‌లోని పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఫిర్యాదు చేసేందుకు హరీష్‌ రావుతో కలిసి కౌశిక్‌ రెడ్డి.. సీపీ ఆఫీస్‌కు వెళ్లారు. అదే సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీపీ ఆఫీసు వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో దాడులు చేసిన వారిని అరెస్ట్‌ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు, కౌశిక్‌ రెడ్డి మధ్య వాదనలు జరిగాయి. పాడి కౌశిరెడ్డి.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన పోలీసులపైకి వెలెత్తి చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వెంటనే కలుగుజేసుకున్న హరీశ్ రావు.. పాడి కౌశిక్ రెడ్డికి సముదాయించి పక్కకు పంపించారు. అనంతరం ఆయన పోలీసులతో మాట్లాడారు. దీంతో సీపీ ఆఫీసు వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

  

అనంతరం, సీపీ ఆఫీసు వద్ద హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎఫ్‌ఐఆర్‌ కాపీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటాం. అరికెపూడి గాంధీ అనుచరులపై హత్యాయత్నం కేసు పెట్టాలి. దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలి. అరెస్ట్‌ చేయకుంటే కోర్టుకు వెళ్తాం. ఈ ఘటనపై డీజీపీ ఉన్నత స్థాయి విచారణ జరపాలి. ఢిల్లీలో  రాహుల్‌ గాంధీ ఇంటి వద్ద ధర్నా చేస్తాం. నార్సింగి పీఎస్‌లో గూండాలకు బిర్యానీలు పెడుతున్నారు. సీఎం డైరెక్షన్‌లోనే పోలీసులు పనిచేస్తున్నారు. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు సీపీ ఆఫీసు వద్ద ఆందోళనలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: త్వరలో మరిన్ని చేరికలు.. టీపీసీసీ చీఫ్‌ కామెంట్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement