సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలోని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం(సెప్టెంబర్15) పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. డీసీపీ, ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు గాంధీ నివాసం వద్ద మోహరించారు. గాంధీ నివాసానికి రావాలని బీఆర్‌ఎస్ నాయకులు పార్టీ శ్రేణులకు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.
గాంధీ ఇంటి వద్ద దాదాపు 300 మంది ఫోర్స్ ను అందుబాటులో ఉంచారు. బీఆర్‌ఎస్ నాయకులు ఒక్కసారిగా రావొచ్చని ఇంటెలిజెన్స్ సమాచారం మేరకే భద్రత పెంచినట్లు తెలుస్తోంది. గాంధీ నివాసం పరిసరాల్లో గత నాలుగు రోజులుగా పోలీసుల ఆంక్షలతో కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు. గాంధీకి ఇంటి వెళ్లే దారిలో మొత్తం మూడు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో సవాళ్లు, ప్రతిసవాళ్ల తర్వాత గాంధీ అనుచరులతో కలిసి కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి యత్నించిన విషయం తెలిసిందే. తర్వాత బీఆర్‌ఎస్ నేతలు గాంధీ ఇంట్లో భేటీ అవుతామని ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. దీంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్టు అనిపించినప్పటికీ తాజాగా బీఆర్‌ఎస్ నాయకులు మళ్లీ గాంధీ ఇంటికి రావొచ్చనే సమాచారంతో పోలీసులు మళ్లీ అప్రమత్తమయ్యారు.
ఇదీ చదవండి.. ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment