సీపీ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత.. హరీష్‌ రావుతో సహా బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌ | Arekapudi Gandhi Padi Kaushik Reddy Row Updates | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి..19 మందిపై కేసు నమోదు

Published Thu, Sep 12 2024 8:19 AM | Last Updated on Thu, Sep 12 2024 7:03 PM

Arekapudi Gandhi Padi Kaushik Reddy Row Updates

హైదరాబాద్‌,  సాక్షి: పీఏసీ కమిటీ చైర్మన్‌గా శేర్‌లింగంపల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడంతో మొదలైన విమర్శల పర్వం.. ఇవాళ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పరస్పర సవాల్‌-ప్రతిసవాల్‌ ఎపిసోడ్‌లో అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లనివ్వకుండా పాడి కౌశిక్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. అయితే కౌశిక్‌ రెడ్డి ఇంటికే అరికెపూడి వెళ్లడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. 

అరికెపూడి వర్గీయులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ఈ క్రమంలో.. అరికెపూడి అనుచరులు కౌశిక్‌ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు. కౌశిక్‌ రెడ్డి వర్గీయులు ప్రతిఘటనకు దిగడంతో.. ఇరువర్గాలు కుర్చీలతో బాహాబాహీకి దిగాయి.  అక్కడితో ఆగకుండా అరికెపూడి వర్గీయులు రాళ్లు, టమాటాలను కౌశిక్‌రెడ్డి ఇంటిపైకి విసిరారు. ఈ దాడిలో ఇంటి అద్దాలు పగిలిపోయాయి.

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • సైబరాబాద్‌ సీపీ ఆఫీస్‌ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌
  • హరీష్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ నేతలను అరెస్ట్‌ చేసిన పోలీసులు
  • రెండు గంటలుగా సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇంటిపై దాడి ఘటనలో కేసు నమోదు

  • 19 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు

  • RS ప్రవీణ్ కుమార్‌తోపాటు హరీష్‌ రావుకు ఎఫ్‌ఐఆర్‌ కాపీ చూపించిన పోలీసులు

  • సైబరాబాద్ సీపీ ఆఫీస్ నుంచి వెళ్లిపోవాలని కోరిన పోలీసులు

  • హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంపై అభ్యంతరం

  • సీపీ ఆఫీస్‌ వద్ద కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

ఒక వీధి రౌడీలాగి ఇంటికి వస్తా అని రెచ్చగొట్టాడు: అరికెపూడి గాంధీ

  • విద్వేషా రెచ్చగొట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. ఆ సభ్యుడిని తక్షణమే సస్పెండ్‌ చేయాలి
  • ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టిన కౌశిక్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలి

 

  • పదేళ్లలో ఇలాంటి ఘటనలు జరగలేదు: హరీష్‌ రావు
  • త్వరలో రాహుల్‌ గాంధీ నివాసం వద్ద ధర్నా చేస్తాం
  • గాంధీతోపాటు కాంగ్రెస్‌ గుండాలను అరెస్ట్‌ చేయాలి
  • అరెస్ట్‌ చేయకుంటే కోర్టుకు వెళ్తాం
  • ఘటన పై వెంటనే డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష వేయాలి 

సైబరాబాద్‌ సీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత

  • బీఆర్‌ఎస్‌ నేతలను ఆఫీస్‌లోకి అనుమంతించని పోలీసులు
  • పోలీసులతో బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం
  • కౌశిక్‌ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేసేదాకా సీపీ ఆఫీస్‌లోనే ఉంటామన్న బీఆర్‌ఎస్‌ నేతలు
  • సీపీ ఆఫీస్‌ ముందు బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

కౌశిక్‌పై   దాడి  చేసిన  వారిని  అరెస్ట్ చేయాలని  కోరుతూ ఫిర్యాదు  చేసిన  బీఆర్‌ఎస్‌ నేతలు

  • ముగ్గురు ఎమ్మెల్యేలకు అనుమతి
  • సీపీ లేకపోవడంతో జాయింట్‌ సీపీ జోయెల్‌ డెవిస్‌కు ఫిర్యాదు చేసిన బీఆర్‌ఎస్‌
  • అరికపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టాలి: హరీష్‌ రావు
  • ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతాం: హరీష్‌ రావు

కౌశిక్‌ రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు

  • ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేను కోరిన పోలీసులు
  • దాడి చేయడానికి వచ్చిన వాళ్లను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించిన కౌశిక్‌ రెడ్డి
  • డీసీపీ, ఏసీపీలను సస్పెండ్‌ చేసిన తరువాతే ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే వెల్లడి

పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? కేటీఆర్‌

  • శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మద్దతుదారులు.. కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లి దాడులకు పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది.
  •  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రంగా ఖండించారు.
  • పట్టపగలే ఎమ్మెల్యేపై హత్యాయత్నామా? ఎటు పోతోంది మన రాష్ట్రం?.
  •  ఫ్యాక్షన్, రౌడీ రాజకీయాలకు తెలంగాణను అడ్డాగా మార్చేస్తుంటే బాధేస్తోంది. 
  • కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందంలో ఉంచి అరికెపూడి గాంధీ గుండాలతో దాడి చేయిస్తారా?
  • ఇది కచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయించిన దాడే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
  •  ఇలాంటి  ఉడుత ఊపుల దాడులకు బెదిరేది లేదు. ఇంతకు మించిన ప్రతిఘటన తప్పదు.


ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకుని.. సిద్దిపేట నుండి కౌశిక్ రెడ్డి నివాసానికి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అరెస్ట్‌
పరిస్థితి చేజారుతున్న క్రమంలో..  ఎమ్మెల్యే అరికెపూడిని, నలుగురు కార్పొరేటర్ల పోలీసులు అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి పీఎస్‌కు తరలించారు.   

సాక్షితో మాదాపూర్‌ డీసీపీ

  • కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత
  • అరికెపూడి గాంధీ వర్గం రాకతో వేడెక్కిన పరిస్థితి
  • కౌశిక్‌ రెడ్డి ఇంటిపైకి రాళ్లు విసిరిన దుండగలు
  • అరికెపూడిని, ఇరువర్గాల అనుచరుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్‌ అయ్యింది: మాదాపూర్‌ డీసీపీ
  • చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం: మాదాపూర్‌ డీసీపీ
  • గాంధీ ఆయన అనుచరులపై చర్యలుంటాయి: మాదాపూర్‌ డీసీపీ
  • నేరం చేశారు కాబట్టే చర్యలు తీసుకుంటాం: మాదాపూర్‌ డీసీపీ


నా ఇంటికి వస్తానని కౌశిక్‌ రెడ్డి రాలేదు: అరికెపూడి గాంధీ 
అందుకే నేనేచ్చా: అరికెపూడి గాంధీ
నాకు దమ్ముంది ఉంది కాబట్టే వచ్చా: అరికెపూడి గాంధీ
కౌశిక్‌ రెడ్డికి దమ్ముంటే బయటకు రావాలి: అరికెపూడి గాంధీ

నన్ను హత్య చేయాలని చూశారు: పాడి కౌశిక్‌ రెడ్డి

గుండాలు వచ్చి దాడి చేయడం కరెక్టేనా: పాడి కౌశిక్ రెడ్డి

ముందస్తు ప్లాన్‌తో వచ్చి దాడి చేశారు: పాడి కౌశిక్‌ రెడ్డి

తెలంగాణ లా అండ్‌ ఆర్డర్‌ ఉందా? లేదా?: పాడి కౌశిక్ రెడ్డి

ఒక ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేకపోతే ఎలా?: పాడి కౌశిక్ రెడ్డి

పోలీసులు ఏం చేస్తున్నారు?: పాడి కౌశిక్ రెడ్డి

దాడికి ప్రతిదాడి ఉంటుంది: పాడి కౌశిక్‌ రెడ్డి

 

 

భారీ కాన్వాయ్‌తో కౌశిక్‌రెడ్డి నివాసానికి అరికెపూడి

  • కొండాపూర్‌లోని కౌశిక్‌ రెడ్డి నివాసానికి చేరుకున్న అరికెపూడి గాంధీ
  • కౌశిక్‌రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లేందుకు అరికెపూడి అనుచరుల యత్నం

     


అరికెపూడి రాకపై పాడి కౌశిక్ రెడ్డి

  • అరికెపూడి  గాంధీని నా  ఇంటికి ఆహ్వానిస్తున్న
  • కండువా కప్పి  భోజనం  పెట్టి  తెలంగాణ  భవన్ కి తీసుకెళ్తా
  • సాయంత్రం కెసిఆర్  దగ్గరికి తీసుకెళ్తా
  • పోలీసులు నా ఇంటి  గేట్ వద్ద  ఆపితే .. స్వయంగా  గేట్ వద్దకి  వెళ్లి  పోలీసులకు చెప్పి  మరి  లోపలికి తీసుకెళ్తా

 

కౌశిక్‌ రెడ్డి ఇంటికి బయల్దేరిన అరికెపూడి గాంధీ

  • నేడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా
  • నేను స్థానికుడిని కాదని చెప్పడానికి కౌశిక్‌ ఎవడు?
  • ఎవరు అడ్డుకున్నా కౌశిక్‌ ఇంటికి వెళ్తా!
  • నియోజకవర్గం కోసమే సీఎం రేవంత్‌ను కలిశా

 

మా ఎమ్మెల్యే ఇంటికి నేను పోతే తప్పేంటి?: పాడి కౌశిక్‌ రెడ్డి

  • 11గం. గాంధీగారి ఇంటికి వెళ్తానని చెప్పా
  • ఉదయం నుంచే నా ఇంటి ముందు కంచెలేసి పోలీసులు మోహరించారు
  • నన్ను వెళ్లకుండా ప్రివెంటివ్‌ అరెస్ట్‌ చేశారు
  • కాంగ్రెస్‌లో చేరలేదని మీరే(అరికెపూడి) అన్నారు కదా!
  • అప్పుడు నేను మీ ఇంటికి వస్తా అంటే ఎందుకు భయం? ఎందుకంత ఉలిక్కిపాటు?
  • తన్నుకుందాం అని నేను అనలేదు కదా?
  • ఎవరు బ్రోకర్‌?
  • గాంధీలాగా.. పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా?. ఒక బీఫామ్‌ మీద గెలిచిన పార్టీ అండగా ఉండేటోడు బ్రోకరా?
  • గాంధీ.. నేను వయసులో ఉన్నా.. నేను రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్కో
  • రేపు బీఆర్‌ఎస్‌ ఉనన్న కార్యకర్తలంతా గాంధీ ఇంటికి వెళ్దాం
  • అక్కడే బ్రేక్‌ఫాస్ట్‌ తిందా.. లంచ్‌ చేస్తాం
  • గాంధీగారిని తీసుకుని తెలంగాణ భవన్‌కు తీసుకెళ్తాం
  • అక్కడి నుంచి కేసీఆర్‌ దగ్గరకు వెళ్తాం
  • గ్రేటర్‌ పరిధిలోని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా ఈ కార్యక్రమానికి రావాలని కోరుతున్నా
  • ఆయన బీఆర్‌ఎస్‌లో ఉంటే కేసీఆర్‌ దగ్గరకు వెళ్లడానికి ఎందుకు భయం
  • బీఆర్ఎ‌స్‌ కాదట..  పంచాయితీ నాతోనేనట!
  • భూతగాదాలు, అన్నదమ్ముల పంచాయితీ ఉందా?
  • నీ స్వార్థం కోసమే పార్టీ మారారు
  • యావత్‌ తెలంగాణ సమాజం ఇదంతా చూస్తోంది.
  • దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికకు వెళ్లు
  • రేపు కచ్చితంగా గాంధీ ఇంటికి వెళ్లి తీరతాం
  • గాంధీ మా ఇంటికి వస్తానంటే వెల్‌కమ్‌.. సాదరణంగా కండువా కప్పి ఇంట్లోకి తీసుకెళ్తా
  • హుజురాబాద్‌లో ఈటలలాంటివాడిని ఓడించి గెలిచన వాడిని నేను
  • అలాంటి నాపై కోవర్టు అంటూ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం
  • రేపు వస్తాం.. కలిసి తెలంగాణ భవన్‌, కేసీఆర్‌ దగ్గరకు పోదాం
  • గాంధీగారికి ఇదే ఆహ్వానం
  • లేదు తన్నుకుందాం అంటే ఐ యామ్‌ రెడీ
  • తన్నుకోవడం ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు
  • ఆయనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు  వస్తే మాకూ సంతోషమే కదా!

 

కౌశిక్‌రెడ్డికి సినిమా చూపిస్తా: అరికెపూడి

  • నా ఇంటి ముందు కుర్చీ వేసుకుని కూర్చున్నా.
  • పది నిమిషాల్లో రాకపోతే నేనే కౌశిక్‌ ఇంటికి వెళ్తా.
  • కౌశిక్‌ రెడ్డి ఓ బ్రోకర్.. నాపై సవాల్‌ చేస్తా. నా దగ్గరకు వస్తాడని ఎదురు చూస్తా. ఆయన రాకపోతే నేనే ఆయన ఇంటికి వెళ్తా
  • ఓ దుర్మార్గుడు నా ఇంటి మీద జెండా ఎగరేస్తానంటే ఊరుకుంటానా?
  • 12 గం. నేనే కౌశిక్‌ ఇంటికి వెళ్తా
  • కౌశిక్‌ రెడ్డి లాంటి దుర్మార్గుడ్ని కేసీఆర్‌ పదేళ్లపాటు పక్కన పెట్టుకున్నారు
  • గతంలో కౌశిక్‌రెడ్డి కోవర్టుగా పని చేశాడు
  • కౌశిక్‌ రెడ్డి వల్లే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు దూరం అవుతున్నారు
  • ఇజ్జత్‌ లేనివాళ్ల సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు
  • నేను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేని అని అసెంబ్లీలో స్పీకర్‌ ప్రకటించారు
  • కౌశిక్‌ లాంటోడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు
  • కేసీఆర్‌కే నా సమాధానం చెబుతా

అంతకు ముందు ఉదయం కూడా ఆయన మాట్లాడుతూ.. ‘‘నువ్వు మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. నా ఇంటికి పోలీసుల బందోబస్తు అవసరం లేదు. ఎవరి దమ్ము ఏంటో తేల్చుకుందాం’’ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతిసవాల్‌ విసిరారు. 

మరోవైపు.. అరికెపూడి ఇంటికి వెళ్లి మరీ కండువా కప్పుతానన్న పాడి కౌశిక్‌ రెడ్డి కామెంట్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. కౌశిక్‌డ్డి ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. 

పీఏసీ కమిటీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ‘‘గాంధీ ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లోనే ఉన్నానని చెప్పాలి. గురువారం అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.  ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నాడు కాబట్టి రేపు అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి BRS పార్టీ కండువా కప్పుతా.. ఇద్దరం కలిసి మీ ఇంటి మీద జెండా ఎగరేసి, BRS భవన్ లో ప్రెస్ మీట్ పెడదాం’’ అని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే దీనికి అరికెపూడి గాంధీ అంతేతీవ్రంగా ప్రతిస్పందించారు.

 

 

ఇదీ చదవండి: చీర, గాజులు వర్సెస్‌ చెప్పులు!!
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement