సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై దాడిని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ‘‘ఎమ్మెల్యే అని చూడకుండా పోలీసులు దాడి చేశారు. ప్రశ్నిస్తే దాడి చేయడం ఇందిరమ్మ రాజ్యమా?.’’ అంటూ ఆయన మండిపడ్డారు.
పెద్దల మెప్పు కోసం పోలీసులు ఓవరాక్షన్ చేస్తే మేం వచ్చాక మిత్తితో సహా చెల్లిస్తామంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. కౌశిక్‌రెడ్డి అంటే రేవంత్‌కు భయం పట్టుకుందని.. తాటాకు చప్పుళ్లకు బీఆర్‌ఎస్ భయపడదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో దళితబంధు కోసం ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేపట్టిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్‌రెడ్డి, నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ క్రమంలో కౌశిక్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దరఖాస్తుదారులతో కలిసి ధర్నా కోసం అంబేద్కర్ చౌక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, దరఖాస్తుదారులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment