KTM Duke Electric Motorcycle Launch Confirmed Details Inside - Sakshi
Sakshi News home page

KTM: మార్కెట్‌లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!

Published Thu, Feb 10 2022 4:22 PM | Last Updated on Thu, Feb 10 2022 6:23 PM

KTM Duke Electric Motorcycle Launch Confirmed - Sakshi

ప్రముఖ ఆస్ట్రియన్‌ మోటార్‌సైకిల్‌ తయారీ సంస్థ కేటీఎమ్ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది. ఈ బైక్‌లో 10kW పవర్ గల మోటార్, 5.5kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుందని కూడా వెల్లడించింది. ఈ బైక్ నమూనాకు కేటీఎమ్ 125 డ్యూక్ లాగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టోర్క్ క్రాటోస్ ఆర్ (4కెడబ్ల్యుహెచ్), సింపుల్ వన్ (4.8కెడబ్ల్యుహెచ్), ఓలా ఎస్1 ప్రో(3.97కెడబ్ల్యుహెచ్) వంటి వాహనాలతో పోలిస్తే ఈ-డ్యూక్ ఫిక్సిడ్ బ్యాటరీ సామర్థ్యం అధికంగా ఉంది. కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్ విడుదల తేదీని కంపెనీ ఇంకా పేర్కొనలేదు.

బజాజ్, కేటిఎమ్ కలిసి ఎలక్ట్రిక్ వాహనలను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ భాగస్వామ్యంలో 3కెడబ్ల్యు నుంచి 10కెడబ్ల్యు వరకు అవుట్ పుట్ గల ద్విచక్ర వాహనాలను లాంచ్ చేయాలని చూస్తున్నట్లు తెలిపాయి. ఈ ఒప్పందంలో భాగంగా కేవలం ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ-డ్యూక్ ఎలక్ట్రిక్ బైక్ ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ సుమారు రూ.200 కిమీ పైగానే ఉండే అవకాశం ఉంది. కేటీఎమ్ 2022 ఏడాదిలో కొత్త ‘KTM  890 Duke R’ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ కొత్త వేరియంట్‌లో స్టాండర్డ్ మోడల్‌కు అనేక స్టైలింగ్, మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. 890 డ్యూక్ ఆర్‌ భారత్‌లో లాంచ్ అయ్యే వివరాలు ఇంకా అందుబాటులో లేవు. 

(చదవండి: ఫాస్ట్ ట్యాగ్ చరిత్రలో రికార్డు స్థాయి వసూళ్లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement