బజాజ్‌కు చెందిన ప్రీమియం బైకుల విక్రయ సంస్థ కేటీఎం తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్ధాల ధరలు పెరుగడంతో ధరలను పెంచాల్సి వచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో కేటీఎం, హుస్కావర్ణ బైకులు రూ.10 వేల వరకు ప్రియం కానున్నాయి. వివిధ మోడళ్ళను బట్టి ధరల పెరుగుదలలో మార్పులు ఉంటాయి. దీంట్లో కేటీఎం బైకులు రూ.8,812, హుస్కవర్ణ బైకులు రూ.9,730 వరకు పెరగనున్నాయి.
కేటీఎం, హుస్కావర్ణ బైక్ ధరలు:
- కేటీఎం 125 డ్యూక్: రూ.1,60,319
- కేటీఎం 200 డ్యూక్: రూ.1,83,328
- కేటీఎం 390 డ్యూక్: రూ.2,75,925
- కేటీఎం ఆర్‌సీ 125 : రూ.1,70,214
- కేటీఎం ఆర్‌సీ 390: రూ.2,65,897
- కేటీఎం 250 ఏడివి: రూ.2,54,483
- కేటీఎం 390 ఏడివి: రూ.3,16,601
- హుస్కవర్ణ స్వర్ట్ పిలెన్: రూ.1,99,296
- హుస్కవర్ణ విట్ పిలెన్: రూ.1,98,669
Comments
Please login to add a commentAdd a comment