2022 KTM 890 Duke R Revealed, Details Inside - Sakshi
Sakshi News home page

కేటీఎమ్‌ నుంచి మరో కిర్రాక్‌ బైక్‌..!

Published Wed, Feb 9 2022 6:40 PM | Last Updated on Wed, Feb 9 2022 7:10 PM

2022 KTM 890 Duke R: Details Explained - Sakshi

ఆస్ట్రియన్‌ మోటార్‌సైకిల్‌ తయారీదారు కేటీఎం 2022 గాను కొత్త ‘KTM  890 Duke R’ బైక్‌ను ఆవిష్కరించింది.  ఈ మిడిల్ వెయిట్ రోడ్‌స్టర్ కొత్త వేరియంట్‌లో స్టాండర్డ్ మోడల్‌కు అనేక స్టైలింగ్, మెకానికల్ అప్‌గ్రేడ్స్‌తో రానుంది. 890 డ్యూక్ ఆర్‌ భారత్‌లో లాంచ్ అయ్యే వివరాలు ఇంకా అందుబాటులో లేవు. 


 

స్టైలింగ్ అప్‌గ్రేడ్‌ లూక్స్‌తో..!
న్యూ KTM  890 Duke R స్టాండర్డ్ 890 డ్యూక్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఈ బైక్‌లో  రైడర్-ఓన్లీ సెటప్‌తో రానుంది.  పిలియన్ సీటు వెనుక కౌల్ ద్వారా భర్తీ చేశారు. ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్ అసెంబ్లీ పూర్తిగా తొలగించారు. KTM  890 Duke R  వేరియంట్ బైక్‌లో కూడా KTM RC16 GP రేసర్,  1290 సూపర్ డ్యూక్ R పై ఉపయోగించిన పెయింట్‌ను పోలి ఉండే కొత్త, అట్లాంటిక్ బ్లూ కలర్‌తో రానుంది. పెయింట్ బాడీవర్క్ అంతటా ఆరెంజ్ గ్రాఫిక్స్‌తో వచ్చింది. అన్ని KTM 'R' మోడల్స్‌ మాదిరిగానే KTM  890 Duke R కూడా, సిగ్నేచర్ ఆరెంజ్ ఫ్రేమ్, అల్లాయ్ వీల్స్‌ను అమర్చారు. 



 

ఇంజిన్‌ విషయానికి వస్తే..!
KTM  890 Duke R అద్భుతమైన పనితీరుతో ఇంజిన్‌ రానుంది. 890 డ్యూక్ Rలో 889cc సమాంతర-ట్విన్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ 121bhp గరిష్ట శక్తిని,  99Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ప్రైమరీ స్లిప్పర్ క్లచ్ మెకానిజంను పొందుతుంది. 



 

మరిన్నీ ఫీచర్స్‌..!
సిక్స్-యాక్సిస్ లీన్ యాంగిల్ సెన్సార్‌తో పనిచేసే ఎలక్ట్రానిక్ రైడర్లో ఏబీఎస్‌, కార్నరింగ్ ఏబీఎస్‌,  కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. 890 డ్యూక్ R రెయిన్, స్ట్రీట్, స్పోర్ట్  మూడు రైడ్ మోడ్‌లతో  స్టాండర్డ్‌గా వస్తుంది. సర్దుబాటు చేయగల ట్రాక్షన్ కంట్రోల్ స్లిప్, యాంటీ-వీలీ ఆన్/ఆఫ్, ఎక్స్‌ట్రా థ్రోటెల్ కంట్రోల్ సెట్టింగ్‌లతో రానుంది. ఇక బేస్ మోడల్ మాదిరిగానే, పూర్తి-LED లైటింగ్‌ను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. ఇది స్ప్లిట్-స్టైల్ LED హెడ్‌లైట్‌తో పాటు ముందు భాగంలో LED DRLలు, సొగసైన LED టర్న్ ఇండికేటర్‌లు,  వెనుక-స్టాక్‌-మౌంటెడ్ LED టైల్‌లైట్‌ని కలిగి ఉంటుంది. కాక్‌పిట్ పరిసర కాంతిపై ఆధారపడిన అడాప్టివ్ ఇల్యూమినేషన్‌తో కూడిన రిచ్ TFT డిస్‌ప్లేతో రానుంది.
 

చదవండి: కిలోమీటర్‌కు కేవలం 14 పైసల ఖర్చు..! తక్కువ ధరలో మరో ఎలక్ట్రిక్‌ బైక్‌..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement