కేటీఎం డ్యూక్‌ బైక్‌ల్లో బీఎస్‌–ఫోర్‌ రకాలు | KTM launches three new BS-IV variants--Duke, 390, 250 & 200 | Sakshi
Sakshi News home page

కేటీఎం డ్యూక్‌ బైక్‌ల్లో బీఎస్‌–ఫోర్‌ రకాలు

Published Fri, Feb 24 2017 1:39 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

కేటీఎం డ్యూక్‌ బైక్‌ల్లో బీఎస్‌–ఫోర్‌ రకాలు

కేటీఎం డ్యూక్‌ బైక్‌ల్లో బీఎస్‌–ఫోర్‌ రకాలు

డ్యూక్‌ 390 బైక్‌ ధర రూ.2,25,730
డ్యూక్‌ 250 బైక్‌ ధర రూ.1,73,000
డ్యూక్‌ 200 బైక్‌ ధర రూ.1,43,500

ముంబై: ఆస్ట్రియన్‌ స్పోర్ట్స్‌ బైక్‌ బ్రాండ్‌ కేటీఎం... డ్యూక్‌ మోడళ్లలో భారత్‌ స్టేజ్‌ ఫోర్‌(బీఎస్‌–ఫోర్‌) వేరియంట్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేటీఎం బ్రాండ్‌లో బజాజ్‌ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. డ్యూక్‌ 390,  డ్యూక్‌ 250,   డ్యూక్‌ 200 మోడళ్లలో ఈ బీఎస్‌–ఫోర్‌ వేరియంట్లను ప్రవేశపెడుతున్నామని ప్రోబైకింగ్‌ (బజాజ్‌ ఆటో స్పోర్ట్స్‌ బైక్స్‌ డివిజన్‌)  ప్రెసిడెంట్‌ అమిత్‌ నంది చెప్పారు.  అయితే వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు.

డ్యూక్‌ 390 బైక్‌ ధర రూ.2,25,730 అని,  డ్యూక్‌ 250 బైక్‌ ధర రూ.1,73,000 అని, డ్యూక్‌ 200 బైక్‌ ధర రూ.1,43,500 (అన్ని ధరలూ ఎక్స్‌ షోరూమ్, న్యూఢిల్లీ)అని వివరించారు. డ్యూక్‌ 200 బైక్‌ ఇప్పటికే డీలర్ల వద్ద లభ్యమవుతోందని, మరో రెండు వారాల్లో మిగిలిన బైక్‌లు మార్కెట్లోకి వస్తాయని పేర్కొన్నారు.  ప్రస్తుతం 325గా ఉన్న షోరూమ్‌ల సంఖ్యను విస్తరించనున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement