BS-Four
-
కేటీఎం డ్యూక్ బైక్‌ల్లో బీఎస్–ఫోర్ రకాలు
⇒ డ్యూక్ 390 బైక్ ధర రూ.2,25,730 ⇒ డ్యూక్ 250 బైక్ ధర రూ.1,73,000 ⇒ డ్యూక్ 200 బైక్ ధర రూ.1,43,500 ముంబై: ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ బ్రాండ్ కేటీఎం... డ్యూక్ మోడళ్లలో భారత్ స్టేజ్ ఫోర్(బీఎస్–ఫోర్) వేరియంట్స్‌ను మార్కెట్లో విడుదల చేసింది. కేటీఎం బ్రాండ్‌లో బజాజ్ ఆటో కంపెనీకి 49 శాతం వాటా ఉంది. డ్యూక్ 390, డ్యూక్ 250, డ్యూక్ 200 మోడళ్లలో ఈ బీఎస్–ఫోర్ వేరియంట్లను ప్రవేశపెడుతున్నామని ప్రోబైకింగ్ (బజాజ్ ఆటో స్పోర్ట్స్ బైక్స్ డివిజన్) ప్రెసిడెంట్ అమిత్ నంది చెప్పారు. అయితే వీటి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. డ్యూక్ 390 బైక్ ధర రూ.2,25,730 అని, డ్యూక్ 250 బైక్ ధర రూ.1,73,000 అని, డ్యూక్ 200 బైక్ ధర రూ.1,43,500 (అన్ని ధరలూ ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని వివరించారు. డ్యూక్ 200 బైక్ ఇప్పటికే డీలర్ల వద్ద లభ్యమవుతోందని, మరో రెండు వారాల్లో మిగిలిన బైక్‌లు మార్కెట్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 325గా ఉన్న షోరూమ్‌ల సంఖ్యను విస్తరించనున్నట్లు వివరించారు. -
బజాజ్ ఆటో.. బీఎస్–ఫోర్ పల్సర్
ధర రూ.1.33 లక్షల వరకూ న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ బీఎస్–ఫోర్(భారత్ స్టేజ్ ఫోర్) పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉండే రెండు పల్సర్ బైక్ మోడళ్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఆర్ఎస్ 200, ఎన్ఎస్200 పేర్లతో అందిస్తున్న ఈ మోడళ్ల ధరలు రూ.1.33 లక్షల వరకూ (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని బజాజ్ ఆటో తెలిపింది. పల్సర్ ఆర్ఎస్200 మోడల్ ఏబీఎస్(యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌తో, ఏబీఎస్ ఫీచర్ లేకుండానూ లభిస్తుందని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ మోటార్ సైకిల్ బిజినెస్ ఎరిక్ వాస్ తెలిపారు. ఏబీఎస్ ఫీచర్ ఉన్న బైక్ ధర రూ.1.33 లక్షలని, ఏబీఎస్ ఫీచర్ లేని బైక్ ధర రూ.1.22 లక్షలని పేర్కొన్నారు. ఇక పల్సర్ ఎన్ఎస్200 మోడల్ ధరలు రూ.96,453 నుంచి మొదలవుతాయని తెలిపారు. ఆర్ఎస్200 బైక్‌లో ఏబీఎస్, ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్, పెరిమీటర్ ఫ్రేమ్, ట్విన్ ప్రాజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తదితర అత్యున్నత సాంకేతిక ఫీచర్లున్నాయని వివరించారు.