భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థల్లో ఒకటైన 'అదానీ పవర్ లిమిటెడ్' (Adani Power Ltd) 2023 ఆర్థిక సంవత్సరం (FY23) క్యూ4లో భారీ లాభాలను ఆర్జించింది. నికర లాభం 12.9 శాతం పెరిగి రూ. 5242.48 కోట్లకు చేరింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కంపెనీ ఆదాయం పెరగటానికి మెరుగైన టారిఫ్ రియలైజేషన్, హయ్యర్ వన్ టైమ్ రికగ్నైజేషన్ వంటివి మాత్రమే కాకుండా అధిక బొగ్గు దిగుమతి కూడా కారణమని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. FY23లో అదానీ పవర్ నికర లాభం రూ.10,726 కోట్లకు పెరిగింది. అయితే అంతకు ముందు సంవత్సరం ఈ ఆదాయం రూ. 4,911.5 కోట్లు కావడం గమనార్హం. ఆంటే మునుపటికంటే ఈ సారి ఆదాయం రెండు రెట్లు కంటే ఎక్కువని స్పష్టమవుతోంది.
ఇక త్రైమాసికం వారీగా పరిశీలిస్తే.. నాల్గవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 10,795 కోట్లు కాగా, అంతకు ముందు సంవత్సరం త్రైమాసికంలో ఈ ఆదాయం రూ. 13,308 కోట్లు. FY22లో కంటే FY23 ఆదాయం 35.8 శాతం పెరిగి రూ. 43,041 కోట్లకు చేరింది.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కోసం భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్ దాని ఆర్ధిక వృద్ధికి మాత్రమే కాకుండా తరువాత దశకు స్ప్రింగ్‌బోర్డ్‌గా పనిచేస్తుందని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ చైర్మన్ 'గౌతమ్ ఆదానీ' అన్నారు. అంతే కాకుండా దేశం మౌలిక సదుపాయాల సమ్మేళనంగా నిలబడటానికి అదానీ గ్రూప్ స్థిరంగా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా? కొత్త రూల్స్ వచ్చేశాయ్.. చూసారా!)
ఎర్నింగ్ బిఫోర్ ఇంట్రస్ట్, టాక్స్, డిప్రెషియేట్ అండ్ అమోర్టైజేషన్ (EBITDA) ముందు కంపెనీ ఆదాయం (FY22లో) రూ. 13,789 కోట్లు నుంచి రూ. 14,312 కోట్లు పెరిగింది. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 12.1 శాతం పెరిగి, గ్యాస్ ఉత్పత్తి కూడా క్యూ4లో స్వల్పంగా మెరుగుపడింది. మొత్తం మీద ఆదానీ కంపెనీ భారీ లాభాలతో ముందుకు దూసుకెళుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment