
సాక్షి, ముంబై: బ్యాంకు ఆఫ్ ఇండియా క్యూ4 ఫలితాల్లో మరోసారి చతికిలబడింది. విశ్లేషకులు అంచనాలను దరిదాపుల్లోకి కూడా రాలేక భారీ నష్టాలను చవి చూసింది. గత ఏడాది నష్టాలకు కొనసాగింపుగా మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో రూ.3969 కోట్ల భారీ నికర నష్టాలను నమోదు చేసింది. గత ఏడాది1045కోట్ల రూపాయల నష్టాలను సాధించింది. కాగా 1187కోట్ల రూపాయల నష్టాలను రిపోర్ట్ చేసే అవకాశం ఉందని ఎనలిస్టులు అంచనా వేశారు. బ్యాడ్ లోన్ల బెడద బ్యాంక్ ఆఫ్ ఇండియాను భారీగా దెబ్బ తీసింది. స్థూల ఎన్‌పీఏలు మార్చి చివరి నాటికి 16.58 శాతంగా నమోదయ్యాయి, అంతకు ముందు త్రైమాసికంలో 16.93శాతంగా ఉండగా , ఏడాది క్రితం ఇది 13.22శాతంగా ఉన్నాయి. బ్యాడ్ లోన్ల కేటాయింపులు 41 శాతం పెరిగి రూ .6,674 కోట్లకు చేరుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment