
2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. విశ్లేషకులు అంచనాలను బీట్ చేస్తూ నికర లాభాలను నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో టీవీఎస్ మోటార్ నికర లాభం 15 శాతం ఎగసి రూ. 178 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం పుంజుకుని రూ. 4664 కోట్లకు చేరింది. ఇబిటా 25 శాతం జంప్‌చేసి రూ. 376 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో టీవీఎస్ మోటార్ షేరు 3 శాతం పెరిగి రూ. 555 వద్ద ముగిసింది.
తమ లేటెస్ట్ వాహనాలను మంచి ఆదరణ లభించిందని కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ఫలితంగా క్యూ3 పోలిస్తే క్యూ4లో మంచి లాభాలనార్జించినట్టు పేర్కొంది.