సాక్షి, ముంబై: కోటక్ మహీంద్ర బ్యాంకు 2018-19 సంవత్సరంలోని క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చి 31తో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో రూ.1408కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 25.24 శాతం లాభాలు పుంజుకున్నాయి. ఆదాయం కూడా 19శాతం ఎగిసి రూ.7672కోట్లను సాధించింది.
మరోవైపు ప్రతీ ఈక్వీటీ షేరుకు 80పైసల డివిడెండ్‌ను చెల్లించేందుకు బ్యాంకు బోర్డు ప్రతిపాదించింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కోటక్ బ్యాంకు షేరు స్వల్పంగా లాభపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment