profit jumps Results
-
ఫెడరల్ బ్యాంక్ లాభం జూమ్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 64 శాతం జంప్‌చేసి రూ. 601 కోట్లను తాకింది. మొండి రుణాలకు కేటాయింపులు తగ్గడం ఇందుకు సహకరించింది. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 367 కోట్లు మాత్రమే ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం పుంజుకుని రూ. 1,605 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 3.22 శాతానికి చేరాయి. అయితే ఇతర ఆదాయం 30 శాతం క్షీణించి రూ. 453 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఫీజు ఆదాయం రూ. 255 కోట్ల నుంచి రూ. 441 కోట్లకు ఎగసింది. మొత్తం ప్రొవిజన్లు సగానికి తగ్గి రూ. 373 కోట్లకు పరిమితమయ్యాయి. తాజా స్లిప్పేజెస్ రూ. 444 కోట్లుకాగా.. స్థూల మొండిబకాయిలు 3.5 శాతం నుంచి 2.69 శాతానికి తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్) 14.57 శాతంగా నమోదైంది. జేఎస్పీఎల్ లాభం హైజంప్ ప్రైవేట్ రంగ దిగ్గజం జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్పీఎల్) ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 2,771 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 14.2 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,643 కోట్ల నుంచి రూ. 13,069 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,234 కోట్ల నుంచి రూ. 10,567 కోట్లకు పెరిగాయి. కాగా.. క్యూ1లో స్టీల్ ఉత్పత్తి స్వల్పంగా తగ్గి 1.99 మిలియన్ టన్నులకు పరిమితంకాగా.. అమ్మకాలు 1.61 ఎంటీ నుంచి 1.74 ఎంటీకి బలపడ్డాయి. పెల్లెట్ ఉత్పత్తి 2.16 ఎంటీ నుంచి 1.92 ఎంటీకి వెనకడుగు వేసింది. వీటి విక్రయాలు భారీగా క్షీణించి 0.03 ఎంటీకి చేరినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో జేఎస్పీఎల్ షేరు 4.5 శాతం పతనమై రూ. 345 వద్ద ముగిసింది. -
ఫలితాల్లో అదరగొట్టిన కోటక్ మహీంద్ర
సాక్షి, ముంబై: కోటక్ మహీంద్ర బ్యాంకు 2018-19 సంవత్సరంలోని క్యూ4 ఫలితాల్లో అదరగొట్టింది. మార్చి 31తో ముగిసిన నాలుగవ త్రైమాసికంలో రూ.1408కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే 25.24 శాతం లాభాలు పుంజుకున్నాయి. ఆదాయం కూడా 19శాతం ఎగిసి రూ.7672కోట్లను సాధించింది. మరోవైపు ప్రతీ ఈక్వీటీ షేరుకు 80పైసల డివిడెండ్‌ను చెల్లించేందుకు బ్యాంకు బోర్డు ప్రతిపాదించింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలో కోటక్ బ్యాంకు షేరు స్వల్పంగా లాభపడుతోంది. -
లాభాల్లో దూసుకుపోయిన లెనోవో
ప్రపంచంలో అతిపెద్ద వ్యక్తిగత కంప్యూటర్ (పీసీ) మేకర్, చైనాకు చెందిన లెనోవా గ్రూప్ లిమిటెడ్ ఫలితాల్లో అదరగొట్టింది. గురువారం ప్రకటించిన మొదటి త్రైమాసికంలో భారీ నికర లాభాలను ఆర్జించింది. ప్రధానంగా పీసీ అమ్మకాల్లో మ్మకాలు గోరువెచ్చని మార్కెట్ అంచనాలు ఓడించింది. బీజింగ్-ఆధారిత లెనోవా 64 శాతం నికర లాభాలను నమోదు చేసింది. గత ఏడాది క్రితం ఇదే కాలంలో 105 మిలియన్ డాలర్లతో పోలిస్తే జూన్ తో ముగిసిన త్రైమాసికంలో 173 మిలియన్ డాలర్లకు కు పెరిగింది. అయితే ఆదాయంలో 6 శాతం క్షీణతతో 10.5 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. పీసీ మార్కెట్ కారణంగా ఎనలిస్టులు ఊహించిన దాని కంటే కాస్త మెరుగ్గా ఉన్నామని సంస్థ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాంగ్ యువాన్ జింగ్ తెలిపారు. చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తమకు పోటీ చాలా ఆసక్తిగా ఉందని కానీ, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా డిమాండ్ తగ్గిందని స్టాక్ మార్కెట్ ఫైలింగ్ లో తెలిపారు. కాగా ట్రెండ్ ఫోర్స్ అంచనాల ప్రకారం, లెనోవా ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 4.5 శాతం వాటాను కలిగి ఉంది. ఏప్రిల్-జూన్ మాసంలో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ 24 శాతం, ఆపిల్15 శాతం షేర్ ను సొంతం చేసకున్నాయి.