
ముంబై: కోవిడ్–19పై యుద్ధంలో భాగంగా కేంద్రప్రభుత్వం ఆదివారం లాక్‌డౌన్ 4.0ను ప్రకటించింది. మే 31 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ అంశాలకు తోడు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా ఈవారం మార్కెట్ గమనం ఉండనుందని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ సిద్థార్ధఖేమ్కా విశ్లేషించారు. మంగళవారం జపాన్ పారిశ్రామికోత్పత్తి వెల్లడికానుండగా.. గురువారం అమెరికా తయారీ, సేవల రంగాల పీఎంఐ వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ పరిణామాలు మార్కెట్‌ను నడిపించనున్నాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు.
ఈవారంలోనే 80 కంపెనీల ఫలితాలు..
భారతి ఎయిర్‌టెల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, యూపీఎల్, బాష్, అల్ట్రాటెక్ సిమెంట్, అవెన్యూ సూపర్‌మార్ట్స్ (డి–మార్ట్), జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, కోల్‌గేట్ పామోలివ్, బజాజ్ ఫిన్‌సర్వ్, అపోలో టైర్స్, టొరంట్ పవర్ ఫలితాలు ఈవారంలోనే వెల్లడికానున్నాయి. ఫార్మా రంగంలో డాక్టర్ రెడ్డీస్, అలెంబిక్ ఫార్మా, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మా, ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక బ్యాంకింగ్ రంగంలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్, డీసీబీ బ్యాంక్ ఫలితాలు వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment