హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ కంపెనీ జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చి త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో రూ.129 కోట్ల నష్టం చవిచూసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.723 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. టర్నోవర్ రూ.1,698 కోట్ల నుంచి రూ.1,387 కోట్లకు వచ్చి చేరింది. మొత్తం వ్యయాలు రూ.1,361 కోట్ల నుంచి రూ.1,537 కోట్లకు ఎగశాయి. క్రితం ముగింపుతో పోలిస్తే జీఎంఆర్ ఇన్‌ఫ్రా షేరు ధర బీఎస్‌ఈలో మంగళవారం 4.59 శాతం ఎగసి రూ.36.45 వద్ద స్థిరపడింది.
చదవండి: ఎల్‌ఐసీ లిస్టింగ్.. ప్చ్!
Comments
Please login to add a commentAdd a comment