న్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) మార్చితో ముగిసిన త్రైమాసికంలో మోస్తరు పనితీరు నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 10 శాతం వృద్ధితో రూ.3,620 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.3,293 కోట్లుగా ఉండడం గమనించాలి. ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.49,116 కోట్ల నుంచి రూ.53,366 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో షేరుకు రూ.22 చొప్పున డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,92,997 కోట్ల విలువ చేసే ఆర్డర్లను సంపాదించినట్టు సంస్థ తెలిసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం.
Comments
Please login to add a commentAdd a comment