క్షీణించిన మారుతి లాభాలు | Maruti Suzuki Q4 profit falls 5 Percent | Sakshi
Sakshi News home page

క్షీణించిన మారుతి లాభాలు

Published Thu, Apr 25 2019 2:57 PM | Last Updated on Thu, Apr 25 2019 3:01 PM

 Maruti Suzuki Q4 profit falls 5 Percent - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా క్యూ4 ఫలితాల్లో నిరాశపర్చింది. విశ్లేషకులు అంచనావేసినట్టుగా  మార్చి 30తో ముగిసిన  త్రైమాసిక ఫలితాల్లో 5శాతం (4.6 శాతం)పడిపోయాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలు  0.7 శాతం క్షీణించాయి.

ఈ త్రైమాసికంలో నికర లాభం రూ .1,795.6 కోట్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో రూ .1,882.1 కోట్లు.స్టాండలోన్‌ ఆదాయం 1 శాతం పుంచుకుని 21,459. కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో 25 శాతం తక్కువగా రూ. 2263 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించింది. కాగా.. ఇబిటా మార్జిన్లు 14.22 శాతం నుంచి 10.55 శాతానికి బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో మారుతీ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 1.8 శాతం నష్టంతో రూ. 6880 వద్ద ట్రేడవుతోంది. 

ప్రతికూల విదేశీ మారక ద్రవ్యం, వస్తువుల ధరలు, లాభాలను ప్రభావితం చేశాయని  ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీ పేర్కొంది.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి 80 రూపాయల డివిడెండ్ ను చెల్లించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement