సాక్షి: ముంబై: ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు 2019 మార్చి 31తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నష్టాల షాక్ తగిలింది. విశ్లేషకుల అంచనాలను అందుకోలేని బ్యాంకు ఆర్థిక ఫలితాలు నిరాశపర్చాయి. బ్యాంకులాభం 5 శాతం తగ్గి 969 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ. 1,020 కోట్లగా ఉంది. ఈ క్వార్టర్లో 2,129 కోట్ల లాభం ఉండొచ్చని విశ్లేషకుల అంచనా వేశారు.
మొత్తం ఖర్చులు 18.1 పెరిగి 14,680 కోట్లకు చేరుకున్నాయి. నాల్గవ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 27శాతం పెరిగిం రూ.7620 కోట్లుగా నమోదైంది. ఇతర ఆదాయం రూ.3261 కోట్లుగా నమోదు. అలాగే గత త్రైమాసికంతో పోలిస్తే మార్జిన్లు 3.40 శాతం నుంచి 3.72 శాతాని చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment