
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.452 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం రూ.405 కోట్లతో పోల్చితే 11 శాతం వృద్ధి సాధించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది. గత క్యూ2లో రూ.4,579 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,874 కోట్లకు పెరిగింది. మొండి బకాయిలు తగ్గడంతో బ్యాంక్ రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 7.28 శాతం నుంచి 6.67 శాతానికి, నికర మొండి బకాయిలు 4.62 శాతం నుంచి 3.41 శాతానికి తగ్గాయి.
షేర్ ఆల్‌టైమ్ హై...
ఆర్థిక ఫలితాలు వెలువడిన అనంతరం బీఎస్‌ఈలో ఈ షేర్ 9.3 శాతం ఎగసి రూ.379.50కు దూసుకుపోయింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.384ను తాకింది. గత శుక్రవారం రూ.347 వద్ద ముగిసిన ఈ షేర్ సోమవారం ఇంట్రాడేలో రూ.348, రూ.384 కనిష్ట, గరిష్ట స్థాయిలను తాకింది. చివరకు 9 శాతం లాభంతో రూ.377 వద్ద ముగిసింది. ఈ షేర్ ఏడాది కనిష్ట స్థాయి రూ.190గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment