సాక్షి, విశాఖపట్నం: బ్యాంకు రుణం ఎగవేత వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంక్ ఈవేలం పద్దతిలో ఆస్తులను వేలం వేయనుంది. వేలం వేయనున్న ఆస్తుల్లో బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని గంటాకు చెందిన ప్లాట్ ఉంది. వేలంలో ఆస్తులు కొనుగోలు చేయడానికి ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
కాగా, గంటాకు చెందిన ప్రత్యూష కంపెనీ, ఇండియన్ బ్యాంక్ నుంచి రూ.141.68 కోట్ల లోన్ తీసుకుంది. అసలు, వడ్డీ కలిపి రూ.220.66 కోట్లకు రుణం చేరింది. రుణం మొత్తం ఎగవేయడంతో ఇప్పటికే ఆస్తులు స్వాధీనం చేసుకుంది. గంటాతో పాటు ప్రత్యూష కంపెనీ డైరెక్టర్ల ఆస్తులను కూడా ఇండిన్ బ్యాంక్ వేలానికి సిద్ధం చేసింది./
Comments
Please login to add a commentAdd a comment