
ఇండియన్ బ్యాంక్.. మొబైల్ యాప్
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్‌పే’ పేరుతో ఒక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది...
ప్రభుత్వ రంగంలోని ఇండియన్ బ్యాంక్ ‘ఇండ్‌పే’ పేరుతో ఒక మొబైల్ యాప్‌ను ఆవిష్కరించింది. కస్టమర్లు ఎక్కడి నుంచైనా బ్యాంక్ అకౌంట్లను నిర్వహించుకునేందుకు వీలుగా ఈ మొబైల్ అప్లికేషన్ సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. విండోస్, ఐఓఎస్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఇండ్‌పే అప్లికేషన్‌ను నిర్వహించుకోవచ్చు. ఈక్విటీలు, మినీ స్టేట్‌మెంట్లు పొందడం, ఇతర అకౌంట్‌కు నిధుల బదలాయింపు వంటి సేవలను పొందే వీలున్న ఈ యాప్‌ను బ్యాంక్ ఎండీ సీఈఓ ఎంకే జైన్ ఆవిష్కరించిన్నట్లు ప్రకటన తెలిపింది.