నాలుగు పీఎస్‌యూ బ్యాంకులకు కొత్త చీఫ్‌లు...
ఆంధ్రాబ్యాంక్, ఇండియన్ బ్యాంక్ చీఫ్‌లుగా ఇప్పటికే బాధ్యతల స్వీకారం
న్యూఢిల్లీ: ఆంధ్రాబ్యాంక్‌సహా నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వం మేనేజింగ్ డెరైక్టర్లను నియమించింది. వివరాల్లోకి వెళితే...
ఆంధ్రాబ్యాంక్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రాబ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్‌గా సురేష్ ఎన్ పటేల్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ ఆయన ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎండీగా పనిచేశారు. ఇప్పటికే ఆయన బాధ్యతలు స్వీకరించారు.యూకో బ్యాంక్: దేనా బ్యాంక్ ఈడీ ఆర్‌కే టాకూర్ ఇకపై కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ ఎండీగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కార్పొరేషన్ బ్యాంక్: ఈ బ్యాంక్ ఎండీగా జేకే గార్గ్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌ఆర్ బన్సల్ జనవరిలో పదవీ విరమణ చేస్తారు.
ఇండియన్ బ్యాంక్: ప్రస్తుతం బ్యాంక్ ఈడీగా పనిచేస్తున్న మహేశ్ కుమార్ జైన్ ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. బాధ్యతలు స్వీకరించే నాటి నుంచీ మూడేళ్లు లేదా పదవీ విరమణ లేదా తదుపరి ఉత్తర్వుల వరకూ (ఏది ముందయితే అది) ఆయన ఈ బాధ్యతలు నిర్వహిస్తారని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. నవంబర్ 2వ తేదీన ఆయన బ్యాంక్ ఎండీగా బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొంది.