బ్యాంకు సేవలు భేష్‌ | bank services are good says set sri ceo | Sakshi
Sakshi News home page

బ్యాంకు సేవలు భేష్‌

Published Sat, Sep 17 2016 11:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

మాట్లాడుతున్న చీఫ్‌ మేనేజర్‌ సత్యసాగర్‌

మాట్లాడుతున్న చీఫ్‌ మేనేజర్‌ సత్యసాగర్‌

శ్రీకాకుళం అర్బన్‌: సామాన్యుడికి కూడా బ్యాంకు సేవలు అందుబాటులోకి తేవడం అభినందనీయమని సెట్‌శ్రీ సీఈవో వీవీఆర్‌ఎస్‌ మూర్తి అన్నారు. శ్రీకాకుళం అంబేడ్కర్‌ కూడలి వద్దనున్న ఇండియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో శనివారం మెగా హోమ్‌లోన్‌ మేళా నిర్వహించారు. బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఖాతాదారులను కోరారు. ఇండియన్‌ బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ ఎం.సత్యసాగర్‌ మాట్లాడుతూ బ్యాంకు పథకాలు, రుణాల వివరాలను వెల్లడించారు. క్రెడాయ్‌ సంస్థ ప్రతినిధి గురుగుబెల్లి రాజు మాట్లాడుతూ బ్యాంకులు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని సామాన్య ఖాతాదారులకు సులభతర సేవలు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇండియన్‌ బ్యాంకు శాఖ తరఫున 42 మంది లబ్ధిదారులకు రూ.8.28 కోట్ల రుణాలు అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ కార్యాలయ సీనియర్‌ మేనేజర్‌ రమేష్‌ చంద్ర, బ్యాంకు అధికారులు ఎం.శ్రీనివాసరావు, సాంబమూర్తి, ధనుంజయ, నాగభూషణ్, వెంకటేశ్వరరావు, ప్రియదర్శిని, శాస్త్రి, భాషా, ప్రభాకర్, రమేష్, శంకరరావు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement