ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణమేళా
- ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకూ
హైదరాబాద్: ఇండియన్ బ్యాంక్ గృహ, వాహన రుణ మేళాను భారీ స్థాయిలో నిర్వహిస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డిల్లోని మొత్తం 46 బ్రాంచ్‌ల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 11 వరకూ భారీ రుణ మేళాను నిర్వహిస్తున్నామని ఇండియన్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గృహ రుణాలను 9.65 శాతం వడ్డీరేటుకే ఆఫర్ చేస్తున్నామని, ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలుండవని పేర్కొంది. వాహన రుణాలను 10 శాతం రేటుకే ఇస్తున్నామని తెలిపింది. ఖాతాదారులందరు ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరింది. దేశావ్యాప్తంగా 2,521 బ్రాంచీలను నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకూ రూ.3 లక్షల కోట్ల వ్యాపారాన్ని నిర్వహించామని ఇండియన్ బ్యాంక్ తెలిపింది.