న్యూఢిల్లీ: మొండిబాకీలుగా మారిన మూడు పద్దుల్లో మోసాలపై రిజర్వ్ బ్యాంక్‌కు ఫిర్యాదు చేసినట్లు ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఈ ఖాతాల ద్వారా రూ. 266 కోట్ల మేర మోసం జరిగినట్లు పేర్కొంది. ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా వీటిని ఫ్రాడ్ ఖాతాలుగా ప్రకటించినట్లు బ్యాంక్ తెలిపింది.
ఎంపీ బోర్డర్ చెక్‌పోస్ట్ డెవలప్‌మెంట్ (బాకీ రూ. 167 కోట్లు), పుణె షోలాపూర్ రోడ్ డెవలప్‌మెంట్ (రూ. 73 కోట్లు), సోనాక్ (రూ. 27 కోట్లు) వీటిలో ఉన్నాయి. ఈ మూడు కేసుల్లోనూ నిధుల మళ్లింపు రూపంలో మోసం జరిగినట్లు బ్యాంకు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment