
హైదరాబాద్: స్వయం సహాయక సంఘాలకు మరింత చేరువయ్యేందుకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ‘మెగా ఎస్‌హెచ్‌జీ అవుట్‌రీస్ క్యాంప్’ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రపదేశ్‌కు రూ.870 కోట్లు, తెలంగాణాకు రూ.140 కోట్ల ఎస్‌హెచ్‌జీ రుణాలు పంపిణీ చేసింది. అలాగే చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు అదనంగా రూ.47.28 కోట్ల రుణాలు కేటాయించింది.
స్వయం సేవా సంఘాల ఆర్థిక సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఇండియన్ బ్యాంక్ గణనీయమైన కృషి చేస్తుందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమ్రాన్ అమిన్ సిద్ధిఖీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సెర్ప్ డైరెక్టర్ వై నరసింహా రెడ్డితో పాటు ఇతర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment