SHG Loans
-
ఎస్‌హెచ్‌జీలకు ఇండియన్ బ్యాంక్ రుణాలు
హైదరాబాద్: స్వయం సహాయక సంఘాలకు మరింత చేరువయ్యేందుకు ఇండియన్ బ్యాంక్ బుధవారం ‘మెగా ఎస్‌హెచ్‌జీ అవుట్రీస్ క్యాంప్’ నిర్వహించింది. ఇందులో భాగంగా ఆంధ్రపదేశ్‌కు రూ.870 కోట్లు, తెలంగాణాకు రూ.140 కోట్ల ఎస్‌హెచ్‌జీ రుణాలు పంపిణీ చేసింది. అలాగే చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహించేందుకు అదనంగా రూ.47.28 కోట్ల రుణాలు కేటాయించింది. స్వయం సేవా సంఘాల ఆర్థిక సామర్థ్యాలు మెరుగుపరిచేందుకు ఇండియన్ బ్యాంక్ గణనీయమైన కృషి చేస్తుందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమ్రాన్ అమిన్ సిద్ధిఖీ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సెర్ప్ డైరెక్టర్ వై నరసింహా రెడ్డితో పాటు ఇతర అధికార ప్రతినిధులు పాల్గొన్నారు. -
జగనన్న సర్కార్ అండతో పెరిగిన పరపతి
ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, ఎవ్వరూ బ్యాంకులకు కంతులు చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మహిళలు మోసపోయారు. అప్పటి వరకు సక్రమంగా కంతులు చెల్లించిన వారు ఒక్కసారిగా డీఫాల్టర్లుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ముందు వరకు బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాలకు సంబంధించిన మొత్తాన్ని ‘వైఎస్సార్ ఆసరా’ కింద విడతల వారీగా సంఘాలకు చెల్లించింది. ప్రభుత్వ చేయూత ద్వారా మహిళలు అప్పులు తీర్చేశారు. బ్యాంకులతో కొత్తగా రుణాలు ఇప్పించడంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. సంఘాల సభ్యులు సక్రమంగా కంతులు చెల్లించడం ద్వారా అగ్రపథంలో నిలిచి పరపతి పెంచుకున్నారు. అనంతపురం అర్బన్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)పై బ్యాంకులకు అపార నమ్మకం. బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో తీరుస్తుండటమే ఇందుకు కారణం. సంఘాలు అడిగిన వెంటనే బ్యాంకులు రూ.కోట్లలో రుణం మంజూరు చేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు జగనన్న సర్కార్ వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన మూడేళ్లలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా బ్యాంకులు రూ.5,423 కోట్ల రుణం మంజూరు చేశాయి. 99.62 శాతం రుణ చెల్లింపు స్వయం సహాయక సంఘాలకు గడిచిన మూడేళ్లలో బ్యాంకులు రూ.5,423 కోట్లు రుణం మంజూరు చేస్తే అందులో సగటున 99.62 శాతం చెల్లింపులు జరిగాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 47,358 సంఘాలకు బ్యాంకులు రూ.1,587 కోట్ల రుణం మంజూరు చేస్తే 99.61 శాతం చెల్లించారు. 2020–21లో 59,849 సంఘాలకు రూ.1,726 కోట్ల రుణం ఇవ్వగా చెల్లింపులు 99.60 శాతం ఉన్నాయి. 2021–22లో 55,221 సంఘాలకు రూ.2,110 కోట్లు రుణం మంజూరు చేస్తే చెల్లింపులు 99.65 శాతం జరిగాయి. రూ.387.01 కోట్ల సున్నా వడ్డీ స్వయం సహాయక సంఘాలు నిర్వహించుకుంటూ ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.137.72 కోట్లు, 2020–21లో రూ.118.35 కోట్లు, 2021–22లో రూ.130.25 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. సీఎంకు రుణపడి ఉంటాం మహిళల అర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాము. మా సంఘం ద్వారా ప్రతిసారి రూ.5 లక్షల రుణం తీసుకుంటున్నాం. సకాలంలో కంతులు కడుతున్నాం. మేము తీసుకున్న రుణానికి వడ్డీని ప్రభుత్వం సున్నావడ్డీ పథకం ద్వారా చెల్లిస్తోంది. ఇదే కాకుండా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎంతో చేస్తున్నారు. – సునీత, సత్యసాయి మహిళా సంఘం, అనంతపురం సక్రమంగా చెల్లిస్తున్నాం మా సంఘంలో పది మంది సభ్యులం ఉన్నాము. ఇటీవలనే బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాం. తొలి నుంచి కంతులు సక్రమంగా చెల్లిస్తుండడంతో అడిగిన వెంటనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తున్నారు. ఈ అప్పు తీరిన వెంటనే రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. సున్నావడ్డీ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. – సుమంగళమ్మ, నైథిలి మహిళా సంఘం, బ్రహ్మసముద్రం రికవరీ సంతృప్తికరం మహిళలు తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో వారు అడిగిన వెంటనే బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. రుణాల రికవరీ 95 నుంచి 99 శాతంతో సంతృప్తికరంగా ఉంది. సంఘాలకు రుణం మంజూరు, చెల్లింపు విషయంలో సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారు. దీంతో చెల్లింపులు బాగుంటున్నాయి. – బి.నాగరాజరెడ్డి, ఎల్డీఎం బాధ్యతగా రుణ చెల్లింపులు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు బాధ్యతగా చెల్లిస్తున్నారు. ఏటా లక్ష్యానికి మించి బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఏదేని సంఘం రుణం సకాలంలో చెల్లించకపోతే అది సున్నావడ్డీ పథకానికి అర్హత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో రుణం మంజూరు చేయించడంతో పాటు వారు సక్రమంగా చెల్లించే విషయంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ బ్యాంకుల సంపూర్ణ సహకారం పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణం మంజూరు చేయడంలో బ్యాంకులు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. రుణం తీసుకున్న సంఘ సభ్యులూ బాధ్యతగా సకాలంలో చెల్లిస్తున్నారు. ఇక నారీశక్తి కింద మహిళలకు యూనియన్ బ్యాంక్ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. – విజయలక్ష్మి, పీడీ, మెప్మా -
డ్వాక్రా మహిళా సంఘాలకు ఆర్బీఐ శుభవార్త!
మహిళా సంఘాలకు ఆర్బీఐ శుభవార్త అందించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద స్వయం సహాయక బృందాలకు తనఖా లేకుండానే రూ.20 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫై చేసింది. మహిళల సహాయంతో బలమైన సంస్థలను నిర్మించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడం, జీవనోపాధిని కల్పించడానికి భారత ప్రభుత్వం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం పథకాన్ని తీసుకొచ్చింది. "రూ.10 లక్షల కంటే ఎక్కువ రూ.20 లక్షల వరకు స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాల కోసం తనఖా కింద ఎలాంటి ఆస్తులు ఉంచుకోకూడదని, వారి పొదుపు ఖాతాలపై ఎటువంటి ఆంక్షలు విధించకూడదని, రుణాలు మంజూరు చేసే సమయంలో మార్జిన్ కూడా తీసుకోకూడదు" అని తెలిపింది. అదేవిధంగా, ఎస్ హెచ్ జిల సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు విరుద్ధంగా ఎలాంటి తాత్కాలిక హక్కును మార్క్ చేయరాదు, రుణాలను మంజూరు చేసేటప్పుడు ఎలాంటి డిపాజిట్లను పట్టుబట్టరాదు అని తెలిపింది. మైక్రో యూనిట్స్ (సీజీఎఫ్ఎంయు) పథకం కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ లో ప్రభుత్వం ఇటీవల సవరణలు చేసిన తరువాత ఆర్బీఐ ఈ సర్క్యులర్ జారీ చేసింది. -
ఊరట.. నిట్టూర్పు..!
సాక్షి, ఆదిలాబాద్: డ్వాక్రా మహిళలకు రెండేళ్ల వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.. ఇది ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాల) సభ్యులకు ఊరటనిచ్చేదే.. అయితే వారం రోజులు పైబడ్డా ఆ రాయితీ నిధులు గ్రూపు ఖాతాల్లో జమ కాలేదు. మూడేళ్ల తర్వాత వడ్డీ నిధులు వచ్చాయని సంబరపడుతున్న మహిళా సంఘాలకు తమ గ్రూపు ఖాతాలో జమ కాకపోవడంతో ఇంకెన్ని రోజులు ఎదురుచూడాలన్న నిట్టూర్పు కనిపిస్తోంది. మరోపక్క మూడేళ్ల వడ్డీ రావాల్సి ఉండగా, రెండేళ్ల నిధులను మాత్రమే విడుదల చేసిన ప్రభుత్వం మరో ఏడాది డబ్బుల కోసం మహిళా సంఘాలను నిరీక్షించేలా చేసింది. దీంతో ఆ డబ్బులు ఎప్పుడొస్తాయోనని వారు ఎదురుచూసే పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఏటేటా జిల్లాలో స్వయం సహాయక సంఘాలు, సభ్యుల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు పూర్తిస్థాయిలో ఆర్థిక స్వాలంబన సాధించే విషయంలో బ్యాంకులు, ఐకేపీ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల వడ్డీ నిధులు విడుదల.. మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం 2015–16, 2016–17, 2017–18 సంవత్సరాలకు సంబంధించి వడ్డీ రాయితీ చెల్లించాల్సి ఉండగా, వారం రోజుల క్రితం ప్రభుత్వం 2015–16, 2016–17కు సంబంధించిన నిధులు మాత్రమే విడుదల చేసింది. 2017–18కు సంబంధించి వడ్డీ రాయితీ డబ్బులను విడుదల చేయకపోవడంతో ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రుణం తీసుకొని ప్రతినెల సక్రమంగా చెల్లించినప్పటికీ ప్రభుత్వం వడ్డీ రాయితీని ఎప్పటికప్పుడు విడుదల చేయకుండా ఇలా సంవత్సరాల తరబడి నాన్చడంతో సంఘం సభ్యులు ఆర్థికంగా ప్రయోజనం పొందలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీఓ జారీ చేసింది. దీంతో ఇక ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆశిస్తున్న సభ్యులకు నిరీక్షణే నెలకొంది. ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ సెర్ప్ ఖాతాల్లో ఇంకా జమకాలేదని అధికారులు చెబుతున్నారు. వారి ఖాతాల్లో జమ అయిన తర్వాత అక్కడి నుంచి బ్యాంక్ ఖాతాల్లోకి రావడం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరికొద్ది రోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా 2015–16లో 4,790 ఎస్‌హెచ్‌జీలకు రూ.52.62 కోట్ల రుణాలు బ్యాంకులు, ఐకేపీ నుంచి ఇచ్చారు. 2016–17లో 6,131 ఎస్‌హెచ్‌జీలకు రూ.75.46 కోట్లు ఇచ్చారు. 2017–18లో 6,641 ఎస్‌హెచ్‌జీలకు గాను లక్ష్యం రూ.122.62 కోట్లు ఉండగా, రూ.88 కోట్లు రుణాల కింద ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ మూడు సంవత్సరాలకు సంబంధించి సుమారు రూ.6 కోట్లకు పైగా వడ్డీ రాయితీ నిధులు ఎస్‌హెచ్‌జీలకు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు సంవత్సరాలయే విడుదల అయ్యాయి. ఇచ్చిన రుణాలపై పరిగణనలోకి తీసుకుంటే 2017–18కి సంబంధించే ఎస్‌హెచ్‌జీలకు అధికంగా సుమారు రూ.మూడున్నర కోట్లకు పైగా వడ్డీ రాయితీ నిధులు జమ కావాల్సి ఉంది. బ్యాంక్ లింకేజీకి అర్హత సాధిస్తేనే.. మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి సంబం ధించి ప్రతినెలా కిస్తులు సక్రమంగా చెల్లించడంతోపాటు రుణాన్ని పూర్తిగా చెల్లించిన పక్షంలో అవి బ్యాంక్ లింకేజీకి అర్హత సాధిస్తాయి. తద్వారా ఆ సంఘాలు రుణ సదుపాయాన్ని పొందుతాయి. మహిళా సంఘాల పొదుపు, చెల్లింపులు సక్రమంగా ఉన్నప్పుడే ఈ సంఘాలు మనుగడ సాధి స్తాయి. ఈ సంఘాలకు ఈ రెండు అంశాల ఆధారంగా గ్రేడింగ్ కేటాయిస్తూ రుణ సదుపాయాన్ని పెంచడం జరుగుతుంది. ఈ సంఘాల రుణ చెల్లింపులకు సంబంధించి పూర్తిగా ఆన్లైన్లో వివరాలు నమోదవుతాయి. తద్వారా సక్రమంగా చెల్లిస్తున్న సంఘాలు వడ్డీ రాయితీకి అర్హత సాధి స్తాయి. మిగతా సంఘాలు బ్యాంక్ లింకేజీ కోల్పో యి రుణ సదుపాయానికి దూరమవుతాయి. జిల్లాలో ప్రతియేటా సంఘాలతోపాటు సభ్యుల సంఖ్య తగ్గుతూ వస్తుండడం ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తుంది. జిల్లాలో వ్యవసాయ ఆధారంగానే అధికంగా మహిళలు రుణాలు పొందడంతోపాటు చెల్లింపులు చేస్తారు. దీంతో వ్యవసాయంలో నష్టాలు సంభవించినప్పుడు రుణ చెల్లింపులో జాప్యం కారణంగా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. గతేడాదికి ఈయేడాదికే సుమారు 350 సంఘాలు రుణ అర్హతను కోల్పోవడం పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రధానంగా ఒక సంఘం బ్యాంకులో చేసే పొదుపుపై మూడింతలు అధికంగా రుణం ఇవ్వడం జరుగుతుంది. రుణానికి సంబంధించి మొదట వడ్డీతోపాటు మహిళా సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ రీపేమెంట్ సక్రమంగా ఉన్న పక్షంలో ఆ సంఘాలకు వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఆర్థిక పరిపుష్టి ఏది.. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మహిళలు సైతం పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని.. ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడాలన్నా.. ఆర్థికాభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇస్తుంది. తీసుకున్న రుణాలతో మహిళలు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తున్నారు. ఎంతో ఆశతో ఈ సంఘాల్లో చేరుతున్న మహిళలకు నిరాశే ఎదురవుతోంది. రుణ చెల్లింపుల్లో పలు సంఘాలు వెనుక బడడం, సంఘాల కారణంగా గ్రామాఖ్య సంఘాలు, వాటి నుంచి మండల సమాఖ్యలు ఇలా ఒకదానికొకటి వెనుకబడుతున్నాయి. ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.. మహిళా సంఘాలకు వడ్డీ రాయితీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అవి సెర్ప్ ఖాతాల్లో జమ కావాల్సి ఉన్నాయి. ఆ తర్వాత బ్యాంక్ ఖాతాల్లో ఎస్‌హెచ్‌జీలకు రావడం జరుగుతుంది. మరో రెండు మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలో రూ.6కోట్లకు పైగా వడ్డీ రాయితీ రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ.2.95 కోట్లు రెండేళ్లకు సంబంధించి విడుదల చేశారు. మరో రూ.3 కోట్లకు పైగా రావాల్సి ఉంది. – రాజేశ్వర్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
రుణమో.. రామచంద్రా !
మూడు జిల్లాల్లో నిలిచిన ఎస్‌హెచ్‌జీ రుణాలు 2016–17లో ఇవ్వాల్సింది రూ.763.54 కోట్లు నవంబర్ నాటికి చెల్లించింది రూ.234.22 కోట్లే.. ఇంకా 33,324 సంఘాల ఎదురుచూపులు.. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు క్యాష్‌లెస్ లావాదేవీల నేపథ్యంలో కొత్త తిప్పలు సంఘాల తీర్మానంతోనే రుణాలు ఇవ్వాలని గ్రామీణాభివృద్ధి సంస్థ ఆదేశాలు నల్లగొండ : మహిళా స్వయం సహాయక సంఘాల రుణాలకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వలలో చిక్కుకుని మహిళా సంఘాలు కొట్టుమిట్టాడుతున్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను సంఘాలకు చెల్లించాల్సిన లింకేజీ రుణాలను బ్యాంకులు నిలిపేశాయి. గ్రామీణ ప్రాంతాల్లో మ హిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించి.. వారిని అన్ని రంగాల్లో బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచి బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు రుణాలు మంజూరవుతుంటాయి. అదే పద్ధతిలో ఈ ఏడాది కూడా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. అప్పటికే జిల్లాల పునర్విభజనలో అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రుణాలివ్వడంలో బ్యాంకులు వెనుకంజ వేశాయి. దీంతోపాటు ప్రభుత్వం విడుదల చేయాల్సిన పావలా వడ్డీ రాయితీ కూడా బ్యాంకుల్లో జమ కాలేదు. ఈ క్రమంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వకుండా మొండికేశారు. ఇదే క్రమంలో కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేయడంతో రుణాల మంజూరు ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇదీ పరిస్థితి.... 2016–17కుగాను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో 43,825 సంఘాలకు రూ. 763.54 కోట్లు రుణ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ మేరకు అక్టోబర్ మాసాంతానికి కేవలం 10 ,501 సంఘాలకు రూ.234.22 కోట్లు మంజూరు చేశారు. నిర్ధారించిన లక్ష్యం ప్రకారం బ్యాంకులు నవంబర్ నాటికి 21,898 సంఘాలకు రూ.397.61 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ.. పది వేల సంఘాలకు మాత్రమే రుణాలు ఇచ్చాయి. దీంతో 33,324 సంఘాలు రుణాల కోసం ఎదురుచూస్తున్నాయి. మండలాల వారీగా ఇలా.. నల్లగొండ జిల్లాలోని చండూరు మండలంలో 737 సంఘాలకు రూ.15.21 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 85 సంఘాలకు రూ.3.47 కోట్లు ఇచ్చారు. మిర్యాలగూడ మండలంలో 1,338 సంఘాలకు రూ.26.14 కోట్లు ఇవ్వాల్సి ఉంది. 387 సంఘాలకు రూ.11.28 కోట్లు మాత్రమే చెల్లించారు. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలంలో 1313 సంఘాలకు రూ.21.93 కోట్ల రుణాలు ఇవ్వాలి. 262 సంఘాలకు రూ.7.11 కోట్లు మాత్రమే ఇచ్చారు. చివ్వెంల మండలంలో 765 సంఘాలకు రూ.13.90 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 69 సంఘాలకు రూ.2.15 కోట్లు ఇచ్చారు. యాదాద్రి జిల్లాలోని ఆలేరు మండలంలో 783 సంఘాలకు రూ.12.49 కోట్లు రుణాలు ఇవ్వాలని నిర్దేశించగా.. 166 సంఘాలకు రూ.3.59 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. వలిగొండ మండలంలో 1,049 సంఘాలకు రూ.18.59 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. 255 సంఘాలకు రూ.7.19 కోట్లు చెల్లించారు. తీర్మానం తప్పనిసరి.. రుణాలు రాక సంఘాలు సతమవుతున్న పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహి ంచడం కోసం చేపట్టిన చర్యలు సంఘాలను మరింత ఇబ్బందుల పాల్జేస్తున్నాయి. సంఘం లోని ప్రతి సభ్యురాలికి బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు ఉంటే తప్ప రుణం ఇచ్చే పరిస్థితి లే కుండా పోయింది. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డు, చెక్కుబుక్కు కలిగిన సంఘ సభ్యురాలికి మాత్రమే రుణం ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. గతంలో రుణం మంజూరైన సంఘం బ్యాంకుకు వెళ్లి ఆ మొత్తాన్ని డ్రా చేసి సభ్యులకు పంచడం చేసేవారు. ప్రస్తుతం నగదు ర హిత లావాదేవీల వైపు మహిళా సంఘాలను మళ్లించాలన్న నిర్ణయంతో కొత్త నిబంధన వి ధించారు. రుణ మంజూరు పొందిన సంఘం సభ్యుల ఆమోదంతో తప్పనిసరిగా తీర్మానం చేయాలి. ఈ పత్రాన్ని బ్యాంకులకు అందజేయాలి. తీర్మాన పత్రంలో సభ్యుల బ్యాంకు ఖాతా నంబర్లు రాయాలి. దీంతో బ్యాంకర్లు రుణ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత సభ్యులు ఏటీఎం నుంచి నగదు పొందాలి. సభ్యులు మరొకరి ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తే చెక్కులు ఉపయోగించుకోవాలి. మొత్తంగా ఇక ముందు బ్యాంకుల నుంచి రుణాలు పొందే సంఘాలు నగదు రహిత లావాదేవీలనే కొనసాగించాలి. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ క్షేత్రస్థాయిలో సీసీలకు, ఏపీఎంలకు ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మాసాలే గడువు... ఆర్థిక సంవత్సరం మరో మూడు మాసాల్లో ముగియనుంది. ఈ మూడు నెలల్లో బ్యాంకులు 33,324 సంఘాలకు రూ.529.32 కోట్లు రుణం ఇవ్వాల్సి ఉంది. నోట్ల రద్దు సమస్య నుంచి బ్యాంకులు ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయిలో బ్యాంకులకు నగదు నిల్వలు చేరుకోలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత స్వల్ప వ్యవధిలో బ్యాంకులు ఏమేరకు రుణ లక్ష్యాన్ని పూర్తిచేస్తాయో వేచిచూడాల్సిందే.