సొంత బ్యాంకు‌కే కన్నం వేసిన క్యాషియర్‌ | Krishna: Nuziveedu Punjab National Bank Cashier Robbed In Own Bank | Sakshi
Sakshi News home page

సొంత బ్యాంకు‌కే కన్నం వేసిన క్యాషియర్‌

Jun 3 2020 9:26 PM | Updated on Mar 21 2024 8:42 PM

సాక్షి, కృష్ణా: నూజివీడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో బుధవారం ఘరానా మోసం  బట్టబయలైంది.  హెడ్‌ క్యాషియర్‌గా పనిచేస్తున్న గుండ్ర రవితేజ కోట్ల రూపాయలను ఖాచేసి సొంత బ్యాంకుకే కన్నం వేశాడు.  రూ. 1,56,56,897 కోట్ల ఖాతాదారుల నగదును  బ్యాంక్‌ నుంచి కాచేసి చేతి వాటం చూపించాడు. దీనిపై బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. రవీతేజ 2017లో నుంచి  బ్యాంక్‌లో పనిచేస్తున్నాడని చెప్పాడు. కాగా ఖాతాదారుల నగదును,  ఫిక్సిడ్‌ డిపాజిట్లను తన అకౌంట్‌కు బదిలీ చేసుకున్నట్లు క్యాష్‌ తనిఖీలో వెల్లడైందని ఆయన తెలిపారు. వెంటనే నూజివీడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నాడు.  కాగా రవీతేజకు ఆన్‌లైన్‌లో రమ్మీ, కాసినో ఆటలకు అలవాడు పడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణతో తెలింది. బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ ఫిర్యాదు మేరకు రవీతేజపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement
 
Advertisement

పోల్

Advertisement