
సూర్యాపేటలో రూ. 2 కోట్ల కరెన్సీ పట్టివేత
నల్లగొండ జిల్లా సూర్యాపేటలో 2 కోట్ల రూపాయల సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. ఈ సొమ్ము కర్ణాటకలోని ఓ బ్యాంకులో చోరీ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. సూర్యాపేట హైటెక్ బస్టాండు సమీపంలో కారులో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద ఏకంగా రూ. 2 కోట్ల కరెన్సీ పట్టుబడింది. వాళ్లు వాడిన కారు నెంబరు కేఏ 28 ఎన్ 9119గా గుర్తించారు.
దాంతో వెంటనే వాళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని ఒక బ్యాంకులో ఇటీవల భారీ దోపిడీ జరిగింది. బహుశా ఈ సొమ్ము అంతా అక్కడిదే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా అందాల్సి ఉంది.