Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

India And Pakistan War Updates1
IndiavsPak: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలి: కేంద్రం

ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్‌ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్‌ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.పాకిస్తాన్‌ దుర్మార్గ వైఖరిపై భారత్‌ ఆ‍గ్రహం ⇒ పాకిస్తాన్‌ ఫేక్‌ ప్రచారం నమ్మొద్దు... భారత సైనిక స్థావరాలు, క్షిపణి ‍వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయి... విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ స్పష్టీకరణ ⇒ భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఆగని కాల్పుల మోత... పాక్‌ సైన్యం దాడిలో జమ్మూకశ్మీర్‌లో ఆరుగురి మృతి ⇒ భారత సైన్యం దాడుల్లో ఐదుగురు మోస్ట్‌ వాంటెడ్‌ పాకిస్తాన్‌ ఉగ్రవాదులు హతంశనివారం రాత్రి శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ ప్రాంతంలో పాకిస్తాన్‌ డ్రోన్లను నిర్వీర్యం చేస్తున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ జమ్మూ బారాముల్లా, శ్రనగర్‌ టార్గెట్‌గా పాక్‌ డ్రోన్ల దాడులుపంజాబ్‌లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్‌ ప్రకటించిన సైన్యంజమ్మూకశ్మీర్‌, రాజస్తాన్‌, గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌గుజరాత్‌లోని కచ్‌లో పూరిస్థాయిలో బ్లాకౌట్‌డ్రోన్లు కనిపిస్తే కూల్చేసేలా BSFకు ఆదేశాలుశ్రీనగర్‌లోని ఆర్మీ చినార్‌ కోర్స్‌లో హెడ్‌క్వార్టర్‌ లక్ష్యంగా పాక్‌ డ్రోన్‌ దాడులుతదుపరి ఆదేశాలు వచ్చేవరకు పలు ప్రాంతాల్లో బ్లాకౌట్‌ విదించాలని ఆదేశాలుపాక్‌ కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులివ్వాలంటూ సైనికులకు విదేశాంగ శాఖ ఆదేశంఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలంటూ కేంద్రం ఆదేశించిందిపరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయికాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో పాక్‌పై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రి ఫైర్‌ అయ్యారు. DGMOల స్థాయిలో జరిగిన కాల్పుల విరమణ అవగాహనను ఉల్లంఘిస్తున్నారు. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాకిస్తాన్‌దే పూర్తి బాధ్యత. ఈ ఉల్లంఘన పై తగిన దర్యాప్తు జరపాలి. ఈ అతిక్రమణ నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి. పాక్‌ జరిపిన ఈ చర్యకు భారత్‌ గట్టి సమాదానం చెప్తుంది. సరిహద్దు పొడవునా పాక్‌ దాడులకు తెగబడింది. LOC దగ్గర పాక్‌ కాల్పులు జరిపింది. దాన్ని భారత ఆర్మీ తిప్పి కొడుతోంది. పాక్‌ సైనికులు కాల్పులు జరపకుండా పాకిస్తాన్‌ చర్యలు తీసుకోవాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అన్నారు విక్రమ్ మిస్త్రి.ఇండియా పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలుకాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో చర్చిస్తున్న మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్సీజ్‌ఫైర్‌ ఇక లేనట్లే.. కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లామళ్లీ పాక్ బరితెగించింది. ఒకవైపు కాల్పుల విరమణ అంటూనే మళ్లీ భారత్ పై కాల్పులకు తెగబడుతోంది. శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. మూడు గంటల్లోనే పాక్ కాల్పుల విరమణ అంశాన్ని పక్కన పెట్టింది. జమ్మూ కశ్మీర్ లో మళ్లీ భారీ శబ్దాలు వినబడుతున్నాయంటూ సీఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేయడంతో పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించిన విషయం బహిర్గతమైంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఆర్మీ ధిక్కరించినట్లు కనబడుతోంది. పాక్‌ కాల్పుల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ ఇంతియాజ్‌ వీర మరణంమళ్లీ వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్‌సరిహద్దు నగరాలపై పాక్ మళ్లీ కాల్పులుడ్రోన్లు కనిపిస్తే కూల్చేయాలని బీఎస్ఎఫ్ కు ఆదేశాలుజమ్మూ కశ్మీర్‌లో ఏం జరుగుతోందంటూ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌మళ్లీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయిభారీ శబ్దాలు వినపడుతున్నాయని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌శ్రీనగర్ లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలుపాక్‌ కాల్పుల నేపథ్యంలో శ్రీనగర్ లో బ్లాక్‌ అవుట్‌3 గంట్లల్లోనే పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనభారత్ పై మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్‌శ్రీనగర్ లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలుఅఖ్నూర్‌, రాజౌరి, పూంచ్‌ సెక్టార్‌ లో కాల్పులుపాక్‌ కాల్పులను తిప్పికొడుతున్న భారత సైన్యంరాజస్థాన్‌ సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌జమ్మూ కశ్మీర్‌ లో పలు ప్రాంతాల్లో బ్లాక్‌ అవుట్‌

Pakistan has repeatedly violated the ceasefire understanding2
విరమణ.. ఉల్లంఘన

న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌ కయ్యానికి కాలుదువ్విన దాయాదికి నాలుగు రోజుల్లోనే తత్వం బోధపడింది. సాయుధ ఘర్షణకు తెర దించుదామంటూ భారత్‌తో కాళ్లబేరానికి వచ్చింది. దాంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు ప్రభుత్వాలూ దాన్ని ధ్రువీకరించాయి. తమ మధ్యవర్తిత్వమే ఇందుకు కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించగా భారత్‌ దాన్ని తోసిపుచ్చింది. పాక్‌ విజ్ఞప్తి మేరకే ద్వైపాక్షిక చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రకటించింది. ‘‘శనివారం సాయంత్రం ఐదు గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. భూ, గగన, సముద్ర తలాల్లో పూర్తిస్థాయిలో కొనసాగుతుంది’’ అని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ మీడియాకు వెల్లడించారు. కానీ కాసేపటికే పాక్‌ వంకర బుద్ధి ప్రదర్శించింది. శనివారం రాత్రి ఏడింటి నుంచీ మరోసారి దాడులకు దిగింది. సరిహద్దుల గుండా మళ్లీ డ్రోన్‌ ప్రయోగాలకు, కాల్పులకు తెగబడింది. కోరి కుదుర్చుకున్న విరమణ ఒప్పందానికి గంటల వ్యవధిలోనే తూట్లు పొడిచి తాను ధూర్తదేశాన్నేనని మరోసారి నిరూపించుకుంది. ఈ పరిణామంపై భారత్‌ మండిపడింది. రాత్రి 11 గంటలకు మిస్రీ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఓవైపు విరమణ అంటూనే మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్‌ తిరిగి దాడులు, కాల్పులకు దిగిందంటూ ధ్వజమెత్తారు. ఒప్పందం కుదిరిందన్న ట్రంప్‌పాక్‌ దొంగ నాటకాల నడుమ శనివారం రోజంతా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటేదాకా పాక్‌ సైన్యం క్షిపణి, డ్రోన్‌ దాడులు, సరిహద్దుల వెంబడి కాల్పులు కొనసాగించింది. వాటికి దీటుగా బదులిచ్చిన భారత్‌ శనివారం తెల్లవారుజాము నుంచీ తీవ్రస్థాయిలో ప్రతి దాడులకు దిగింది. ఆరు పాక్‌ వైమానిక, రెండు రాడార్‌ కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనూహ్య ప్రకటన చేశారు. సొంత సోషల్‌ మీడియా హ్యాండిల్‌ ట్రూత్‌ సోషల్‌లో సాయంత్రం ఐదింటి ప్రాంతంలో ఈ మేరకు పోస్ట్‌ చేశారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా జరిగిన చర్చోపచర్చల అనంతరం ఎట్టకేలకు ఇరు దేశాలూ తక్షణం పూర్తిస్థాయి కాల్పుల విరమణకు అంగీకరించాయి’’ అని పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అవే వ్యాఖ్యలు చేశారు. ప్రధానులు నరేంద్ర మోదీ, షహబాజ్‌ షరీఫ్‌లకు అభినందనలు తెలిపారు. ట్రంప్‌ బృందం ఈ దిశగా అద్భుతంగా పని చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చెప్పుకొచ్చారు. సాయంత్రం ఆరింటికి విదేశాంగ కార్యదర్శి మిస్రీ మీడియా ముందుకొచ్చారు. ‘‘పాక్‌ విజ్ఞప్తి మేరకే విరమణకు ఒప్పుకున్నాం. శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు పాక్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ భారత డీజీఎంఓకు ఫోన్‌ చేశారు. వారి నడుమ చర్చల ఫలితంగా ఈ మేరకు ఒప్పందం కుదిరింది’’ అని స్పష్టం చేశారు. దీనిపై డీజీఎంఓల నడుమ సోమవారం పూర్తిస్థాయి చర్చలు జరుగుతాయని వెల్లడించారు. ‘‘శాంతి సాధనకు ఇది నూతన ప్రారంభం. కాల్పుల విరమణకు చొరవ చూపినందుకు ట్రంప్, వాన్స్, రూబియోలకు కృతజ్ఞతలు’’ అంటూ పాక్‌ ప్రధాని షహబాజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్, పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్, పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టి(పీపీపీ) అధినేత బిలావల్‌ భుట్టో, ప్రజాప్రతినిధులు తదితరులు ఒప్పందాన్ని స్వాగతించారు. అనంతరం తన గగనతలాన్ని తెరుస్తున్నట్టు పాక్‌ ప్రకటించింది. బయటపడ్డ పాక్‌ నైజం కొద్ది గంటలైనా గడవకుండానే పాక్‌ తన బుద్ధి బయటపెట్టుకుంది. విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి ఏడింటి నుంచే మరోసారి సరిహద్దుల వెంబడి దాడులకు దిగింది. జమ్మూ కశ్మీర్‌ మొదలుకుని గుజరాత్‌ దాకా పలుచోట్ల డ్రోన్‌ దాడులు జరిగాయి. శ్రీనగర్‌లో భారీ పేలుడు శబ్దాలు విని్పంచాయి. బారాముల్లా తదితర చోట్ల సైనిక స్థావరాల సమీపంలో డ్రోన్లు ఎగురుతూ కని్పంచాయి. దీనిపై జమ్మూ కశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘శ్రీనగర్‌ అంతటా పేలుళ్ల శబ్దాలే. ఏమిటిది? విరమణకు అప్పుడే తూట్లా?’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు మొదలయ్యాయి. పాక్‌ దాడులకు మన సైన్యం దీటుగా బదులిచ్చింది. జమ్మూ, శ్రీనగర్, గుజరాత్‌లోని భుజ్‌ తదితర చోట్ల పాక్‌ డ్రోన్లను బలగాలు కూల్చేశాయి. కచ్‌ తదితర చోట్ల కూడా డ్రోన్లు కని్పంచినట్టు రాష్ట్ర మంత్రి హర్‌‡్ష సంఘవి ధ్రువీకరించారు. ముందుజాగ్రత్తగా సరిహద్దు రాష్ట్రాల్లో పలుచోట్ల కరెంటు సరఫరా నిలిపేసి బ్లాకౌట్‌ పాటించారు. అయితే శనివారం అర్ధరాత్రికల్లా పాక్‌ వెనక్కు తగ్గిందని, నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు దాదాపుగా ఆగిపోయాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ ఒప్పందాన్ని గంటల్లోనే పాక్‌ ఉల్లంఘించింది. ఇది అత్యంత దుర్మార్గం. ఇందుకు పూర్తి బాధ్యత ఆ దేశానిదే. దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. మతిలేని చర్యలను ఇకనైనా కట్టిపెట్టి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్‌ పూర్తిస్థాయిలో కట్టుబడాలి. లేదంటే తీవ్రస్థాయిలో ప్రతిక్రియ తప్పదు. దాడులను దీటుగా తిప్పికొట్టాల్సిందిగా సైన్యానికి పూర్తిస్థాయి ఆదేశాలిచ్చాం. – విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ

Bangladesh Govt bans Sheikh Hasina Awami League3
బంగ్లాదేశ్‌ హసీనా బిగ్‌ షాక్‌

ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో ముహమ్మద్‌ యూనుస్‌ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం మాజీ మహిళా ప్రధానమంత్రి షేక్‌ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ పార్టీని నిషేధించింది. ఉగ్రవ్యతిరేక చట్టం నిబంధనల ప్రకారం అవామీ లీగ్‌ను నిషేధించినట్లు శనివారం సాయంత్రం అక్కడి తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. సలహాదారుల మండలి(కేబినెట్‌) నిర్ణయం మేరకే నిషేధం విధించామని, నిషేధానికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను త్వరలోనే ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.అవామీ లీగ్, ఆ పార్టీ అగ్ర నేతలపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్‌లో కొనసాగుతున్న కేసుల విచారణ ముగిసేదాకా ఈ రాజకీయ పార్టీపై నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. షేక్‌హసీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2024 జూలైలో ఉద్యమించిన విద్యార్థి సంఘాలు, నేతలు, సాక్షుల భద్రత, పరిరక్షణ కోసం అవామీ పార్టీపై నిషేధాజ్ఞలు అమలుచేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 1949లో అవామీ లీగ్‌ పార్టీ ఏర్పడింది. తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాళీలకు స్వయంప్రతిపత్తి హక్కులు దఖలుపడాలన్న లక్ష్యంతో అప్పట్లో అవామీ లీగ్‌ ఉద్యమం చేసింది. చివరకు స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఆవిర్భావానికి కారణమైంది.🇧🇩 In Bangladesh, students and the public have been continuously protesting for the past 48 hours, demanding a ban on the Awami League, the party of former autocratic and murderous Prime Minister Sheikh Hasina. ✊ #HasinaOut #BanAwamiLeague #BangladeshCrisis pic.twitter.com/YueL4gwhc4— Ibnul Wasif Nirob (@Wasifvibes) May 10, 2025NEW! #Bangladesh’s interim government on Saturday banned deposed prime minister Sheikh Hasina’s Awami League under anti-terrorism law.The announcement to ban Hasina’s Awami League came after the student-led newly-floated National Citizen Party (NCP) activists rallied since… pic.twitter.com/0Zwfd6DdU1— DOAM (@doamuslims) May 10, 2025

Weekly Horoscope In Telugu From 11-05-2025 To 17-05-20254
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం...పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన ఆదాయం సమకూర్చుకుంటారు. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. ఎరుపు, గులాబీ రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృషభం...చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుని మిత్రులను ఆశ్చర్యపరుస్తారు. పారిశ్రామికవర్గాలకు భాగస్వాముల నుంచి సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మిథునం...ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఏ మాత్రం అలసత్వం చూపక బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. బంధువులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పంచముఖ ఆంజనేయ స్తోత్రాలు పఠించండి.కర్కాటకం...అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో విభేదాలు. ఎరుపు, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహం....ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. గతంలో చేజారిన కొన్ని డాక్యుమెంట్లు అనుకోని విధంగా లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు లక్ష్యాలు నెరవేరతాయి. వారం మధ్యలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు. నీలం, నేరేడు రంగులు. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.కన్య...కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి.స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. పసుపు, నేరేడు రంగులు. కాలభైరవాష్టకం పఠించండి.తుల....పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. పసుపు, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ప్రత్యర్థులను అనుకూలురుగా మార్చుకుంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఒక సంఘటనకు ఆకర్షితులవుతారు. కొన్ని వివాదాలు సోదరుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు.హయగ్రీవస్తోత్రాలు పఠించండి.ధనుస్సు...అనుకున్న పనులు కొంత నిదానంగా సాగినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. వ్యాపారాలు ఆశించిరీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం.ఆరోగ్యం మందగిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు ముమ్మరం చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. బంధువులు, మిత్రులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. నిర్ణయాలు సైతం మార్చుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆహ్వానాలు అందుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. కనకధారాస్తోత్రాలు పఠించండి.కుంభం...కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. సంఘ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.మీనం...కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

TDP Coalition Govt Police Over Action On YSRCP Leader Vidadala Rajini5
రెడ్‌బుక్‌ అండతో ‘ఖాకీ’ కావరం.. 'కారు లోంచి లాగి.. తోసేసి'..

చిలకలూరిపేట: పాలకులు రెడ్‌బుక్‌ మంత్రం జపిస్తుంటే కొంత మంది పోలీసు అధికారులు అందుకు వంత పాడుతూ సభ్యత సంస్కారాలు మరచి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, బీసీ నేత, వైఎస్సార్‌సీపీ నాయకురాలు అని కూడా చూడకుండా విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్‌ సీఐ సుబ్బనాయుడు రెచ్చిపోయి అనుచితంగా ప్రవర్తించారు. ఎక్కువగా మాట్లాడితే నీపైనా కేసు పెడతానంటూ బెదిరించారు. చెబుతుంటే అర్థం కావడం లేదా.. పక్కకు తప్పుకోండంటూ హూంకరించారు. ఓ దశలో రజినిని కారులోంచి పక్కకు లాగి తోసేసి.. ఆయన కారు­లోకి ఎక్కారు. నడిరోడ్డుపై సీఐ బరితెగింపు చూసి ప్రజలు విస్తుపోయారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత, గ్రామ సర్పంచ్‌ బత్తుల సీతారామిరెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడితే ఆయనను పరామర్శించేందుకు శనివారం మధ్యాహ్నం విడదల రజిని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంట్లో నుంచి బయటకు రాగానే.. చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్‌ఐ పుల్లారావు, పోలీసు సిబ్బంది ఆమె కారును చుట్టుముట్టారు. తన కారు వద్ద ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ ఆమె రూరల్‌ సీఐని ప్రశ్నించారు. మీ అనుచరుడు మానుకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కేసులు ఉన్నాయని, అతన్ని అరెస్టు చేయడానికి వచ్చామని సీఐ బదులిచ్చారు. ఎఫ్‌ఐఆర్‌ లేదా అరెస్టు వారంట్‌ను చూపాలని రజనీ కోరగా.. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ సీఐ దురుసుగా మాట్లాడారు. దీంతో ఆమె తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయగా, సీఐ వెంటనే ఆమెను కారులో నుంచి దురుసుగా బయటకు లాగారు. కారులోకి ఎక్కి శ్రీకాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. ‘సీఐ గారూ.. ఏమిటీ దురుసు ప్రవర్తన.. ఎఫ్‌ఐఆర్‌ లేదా ఇతర ఆధారాలు చూపి అరెస్టు చేయండి’ అని విడదల రజినీ కోరగా.. సీఐ మరింత రెచ్చిపోయి పక్కకు తప్పుకోవాలని హూంకరించారు. ‘చెబుతుంటే అర్థం కావడం లేదా.. ఎక్కువ మాట్లాడితే నా విధులకు ఆటంకం కల్పించినందుకు నీపై కూడా కేసు పెడతా’ అని బెదిరించారు. ఆమెను పక్కకు నెట్టివేసి శ్రీకాంత్‌రెడ్డిని తీసుకెళ్లిపోయారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిని ప్రకాశం జిల్లా వైపు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై రూరల్‌ సీఐ సుబ్బానాయడును వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా.. రాష్ట్రంలో మహిళ పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ అరాచకాలు శృతిమించుతున్నాయి. సభ్యతా సంస్కారాలు మరిచి పోలీసులు వారి పట్ల సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరులో రాత్రిపూట నైటీలో ఉన్న ఎస్సీ మహిళా ఎంపీటీసీ సభ్యురాలు వి.కల్పనను విచక్షణ మరచి అరెస్ట్‌ చేశారు. రెండు నిమిషాల్లో చీర కట్టుకుని వస్తానన్నా కూడా వినిపించుకోకుండా నైటీ మీదుగానే జీప్‌ ఎక్కించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇలాంటి ఘటనలు టీడీపీ కూటమి ప్రభుత్వ రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతున్న తీరుకు అద్దం పడుతున్నాయి. ఉన్నత న్యాయస్థానాలు మొట్టికాయలు వేస్తున్నా పోలీసుల తీరులో మార్పు రాకపోవడం దారుణం అని ప్రజలు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల అండ చూసుకుని రెచ్చిపోతే మునుముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని కొందరు పోలీసులు మరచిపోయి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

Sakshi Editorial On India Pakistan6
విరమణ సరే, విధానం సంగతి!

భారత్‌ – పాకిస్తాన్‌ల మధ్య వివాదాలన్నీ ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనేది చాలా కాలంగా భారత్‌ అనుసరిస్తున్న స్థిరమైన విధానం. కశ్మీర్‌ అంశాన్ని తొలి రోజుల్లో ఐక్యరాజ్యసమితి వద్దకు తీసుకుపోవడం వలన నష్టం జరిగిందనే అభిప్రాయం ఇండియాకు ఏర్పడింది. పాక్, భారత్‌ల మధ్య రెండు కీలకమైన ఒప్పందాలున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్‌ డిక్లరేషన్‌. రెండు దేశాల నడుమ ఏ వివాదం తలెత్తినా ఈ రెండు ఒప్పందాల పరిధిలో, ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్‌ చాలా కాలంగా దృఢమైన వైఖరితో ఉండేది. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్‌ ఏనాడూ అంగీకరించలేదు.ఇందుకు భిన్నంగా రెండు దేశాల వివాదంలో ఇప్పుడు మూడో పక్షం తలదూర్చిందా? కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్‌ దేశాలు అంగీకరించాయనీ, ఇది వెంటనే అమల్లోకి వస్తుందనీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సోషల్‌ మీడియా వేదికగా సాయంత్రం 5.30కి ప్రకటించారు. అమెరికా మధ్య వర్తిత్వం వహించి, రాత్రంతా చర్చలు జరిపిన ఫలితంగా ఈ ఒప్పందం సాధ్యమైందని కూడా ఆయన వెల్లడించారు. కామన్‌ సెన్స్‌నూ, తెలివిడినీ ఉపయోగించినందుకు రెండు దేశాలనూ ఆయన అభినందించారు.ఆ తర్వాత అరగంటకు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించాయని ఆయన ధ్రువీకరించారు. సాయంత్రం ఐదు గంటలకే అమల్లోకి వచ్చినట్టు చెప్పారు. అయితే ఆయన ట్రంప్‌ ట్వీట్‌ ప్రస్తావన గానీ, అమెరికా మధ్యవర్తిత్వం గురించి గానీ మాట్లాడలేదు. ఈరోజు మధ్యాహ్నం 3:30కు పాకిస్తాన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంవో), ఇండియా డీజీఎంవోకు ఫోన్‌ చేశారు. కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరిందని మిస్రీ చెప్పారు.మూడో పక్షం జోక్యం లేకుండానే ఇరు దేశాలూ ఒప్పందానికి వచ్చాయనే విధంగానే ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ట్వీట్‌ చేసిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ కూడా రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంగానే దీన్ని అభివర్ణించారు. రేపు సోమవారం నాడు రెండు దేశాల మధ్య చర్చలు జరగబోతు న్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. రెండు దేశాల డీజీఎంవోలు మాట్లాడుకోవడానికి ముందు నుంచే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాల ముఖ్య నేతలతో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి.ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా నిర్వహించిన పాత్రేమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉద్రిక్తతల సడలింపునకు కాల్పులు విరమణ పాటించాలని స్నేహపూర్వక సలహా మాత్రమే రెండు దేశాలకు ఇచ్చిందా? లేక చర్చల ప్రాతిపదికను తయారు చేసే మధ్యవర్తిత్వ పాత్ర పోషించిందా? ఒకవేళ మధ్యవర్తిగానే చర్చల ప్రాతిపదికను కూడా సిద్ధం చేసి ఉంటే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో ఒక కీలకమైన మార్పు వచ్చినట్టే భావించాయుద్ధం అమానుషమై నది. అనాగరికమైనది. యుద్ధం కారణంగా దేశాలు, ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడం వివేకవంతమైన చర్యే! కాల్పుల విరమణ ఆహ్వానించదగ్గదే! అయితే ఈ విరమణ వల్ల దేశం సాధించేది ఏమిటి? పోగొట్టుకునేదేమిటనే విశ్లేషణ కూడా అవసరం. యుద్ధం భారత్‌ ప్రారంభించలేదు. ఉగ్రవాదాన్ని ప్రయోగించి పాకిస్తానే కయ్యానికి కాలు దువ్వింది. బదులుగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే భారత్‌ దాడులు చేసింది. నూరు శాతం కచ్చితత్వంతో చేసిన ఈ దాడులు పదును దేలిన భారత రణ వ్యూహానికీ, అద్భుతమైన సైనిక పాటవానికీ అద్దం పట్టాయి.భారత దాడులకు పాక్‌ నివ్వెరపోయింది. అధీన రేఖ వెంబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడింది. జనావాసాలను టార్గెట్‌గా చేసుకొని దాడులకు దిగింది. ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగానే జరిగినట్టు కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా పరోక్షంగా అంగీకరించారు. మిగిలిన సరిహద్దు రాష్ట్రాల కంటే జమ్మూకశ్మీర్‌ ఈ దారుణాన్ని ఎక్కువగా భరించవలసి వచ్చింది. పసిపిల్లలతో సహా సాధారణ ప్రజలను బలి తీసుకుంటున్న మహమ్మారి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని కశ్మీర్‌ ప్రతిపక్ష నేత మెహబూబా ముఫ్తీ కన్నీళ్ళతో వేడుకున్నారు.యుద్ధాలను వేగిరపడి ప్రారంభించడం కాకుండా పూర్తి ప్రణాళికను రచించుకొని మొదలుపెట్టాలనీ, వీలైనంత వేగంగా ముగించాలనీ, శత్రువు ప్రతిఘటనా శక్తిని దెబ్బకొట్టి పోరాడకుండానే యుద్ధాలను గెలిచే మార్గాలను అన్వేషించాలనీ సన్‌షూ తన యుద్ధతంత్ర గ్రంథమైన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’లో చెబుతాడు. ఈ నాలుగు రోజుల భారత దాడుల్లో సన్‌షూ చెప్పిన ‘ఆర్ట్‌ ఆఫ్‌ వార్‌’ కనిపించింది. ఉగ్రవాద స్థావరాలపై గురి తప్పకుండా, సరిహద్దులు దాటకుండా దాడి చేయడం, పలువురిని మట్టు పెట్టడంతోనే భారత్‌ సగం యుద్ధాన్ని గెలిచింది. పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను ధ్వంసం చేయడం, ఎనిమిది కీలకమైన ఎయిర్‌ బేస్‌లను దెబ్బతీయటం, బాలిస్టిక్‌ మిసైల్‌ను గాల్లోనే పేల్చేయడంతో పాకిస్తాన్‌ దాదాపుగా చేతు లెత్తేసింది.ఈ దశలోనే పాక్‌ నేతలు అమెరికా శరణు కోరి ఉంటారనీ, అవమానకరమైన ఓటమి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేసి ఉంటారనీ అంచనాలు వెలువడుతున్నాయి. అమెరికా జోక్యం చేసుకున్న విషయం యథార్థం. అది ఏ మేరకు అన్నది తేలవలసి ఉన్నది. సాధారణ ప్రజలపై మారణ హోమం చేయడం తప్ప పాకిస్తాన్‌ సాధించిందేమీ లేదు. భారత్‌ సాధించిన ఈ వేగవంతమైన విజయం రేపు జరిగే చర్చల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలి. భారత్‌ కోరుతున్న విధంగా ఉగ్ర హంతకులకు స్థావరం లేకుండా చేస్తామని అంగీకరించాలి. భారత్‌లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి అంగీకరించాలి. భారత కశ్మీర్‌లో వేలు పెట్టబోమని అంగీ కరించే విధంగా పాక్‌పై ఒత్తిడి తేవాలి. సింధూనదీ జలాల ఒప్పందం నిలిపివేత విషయంలో పునఃసమీక్షకు అంగీకరించరాదు. అప్పుడే ఇది విజేత షరతుల మేరకు జరిగే ద్వైపాక్షిక చర్చలుగా పరిగణించవలసి ఉంటుంది. లేకుంటే మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోమన్న చారిత్రక విధానానికి వీడ్కోలు పలికినట్లవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొసమెరుపు ఏమిటంటే... కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల తర్వాత సరిహద్దుల వెంబటి పాకిస్తాన్‌ ఆర్మీ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు వార్తలు వస్తున్నాయి. భారత భూభాగంపై కాల్పులు జరుపుతున్నాయి. ఇది పాకిస్తాన్‌ రాజకీయ నాయకత్వానికీ, ఆర్మీ నాయకత్వానికీ మధ్య సమన్వయ లోపమా? లేక రేపటి చర్చల్లో బేరమాడేందుకు తమ శక్తిని పెంచు కోవడానికి ఆ దేశం ఆడుతున్న నాటకమా? అదీ త్వరలోనే తేలుతుంది.వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

Star Heroes Take a Summer Break from Shoots7
వేసవొచ్చింది... సెలవులు తెచ్చింది

వేసవి వచ్చిందంటే చాలు... స్కూల్స్, కాలేజీలు క్లోజ్‌ అవుతాయి. స్టూడెంట్స్‌కు సెలవులొచ్చేస్తాయి. అలాగే ప్రతి ఏడాది సినిమా స్కూల్స్‌కు కూడా వేసవి సెలవులు వస్తుంటాయి. ఈ సెలవుల్లో మెజారిటీ స్టార్‌ హీరోలు షూటింగ్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుంటుంటారు. అలా ఈ ఏడాది షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇచ్చిన కొందరు తెలుగు హీరోలపై ఓ లుక్‌ వేయండి.లండన్‌లో ల్యాండ్‌ నిన్న మొన్నటివరకు ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఇటీవలే లండన్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఆయన తనయుడు, హీరో– నిర్మాత రామ్‌చరణ్‌ మైనపు విగ్రహం లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం కోసం చిరంజీవి ఫ్యామిలీతో కలిసి లండన్‌ వెళ్లారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు చిరంజీవి. ఈ నెల మూడో వారంలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుందని తెలిసింది.ఈ మూవీలో నయనతార, కేథరీన్‌ హీరోయిన్లుగా నటించనున్నారనే ప్రచారం సాగుతోంది. సాహు గార పాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లుగా మేకర్స్‌ ఆల్రెడీ అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ‘విశ్వంభర’ సినిమాకు చిన్న పాటి ΄్యాచ్‌ వర్క్, ఓ స్పెషల్‌ సాంగ్‌ బ్యాలెన్స్‌ ఉన్నాయట. వీలు చూసుకుని, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టే ఆలోచనలో ఉన్నారు చిరంజీవి. ఈ సినిమాకు ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండగా, యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, విక్రమ్, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో త్రిషా, ఆషికా రంగనాథన్‌ హీరోయిన్లుగా నటిస్తారు. ఇక ‘విశ్వంభర’ సినిమా కొత్త విడుదల తేదీపై అతి త్వరలోనే ఓ స్పష్టత రానుంది.ఓవర్‌ టు ఓజీ కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉంటూ, సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉంటున్న పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ఇది. దీంతో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ వంతు షూటింగ్‌ పూర్తయింది. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఏయం రత్నం సమర్పణలో అద్దంకి దయాకర్‌ నిర్మించారు. అయితే ఈ సినిమాను తొలుత మే 30న రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ...పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ పూర్తి కాని నేపథ్యంలో రిలీజ్‌ను వాయిదా వేశారని, అతి త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుందని తెలిసింది. రెండు భాగాలుగా ‘హరిహర వీరమల్లు’ సినిమా విడుదల కానుంది.తొలి భాగంగా ‘హరిహర వీరమల్లు: స్పిరిట్‌ వర్సెస్‌ స్వార్డ్‌’ విడుదలవుతుంది. ఇలా ‘హరిహర వీరమల్లు’ చిత్రీకరణ పూర్తి కావడంతో, ఇక పవన్‌ ఫోకస్‌ అంతా ‘ఓజీ’ సినిమాపైనే. అయితే ‘హరిహర వీరమల్లు’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసిన పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌కు చిన్న విరామం ఇచ్చారు. అతి త్వరలోనే ఆయన ‘ఓజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. సుజిత్‌ దర్శకత్వంలో డీవీవీ దానయ్య, కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, నాజర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు.ఫారిన్‌ వెకేషన్‌ ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఫారిన్‌ ట్రిప్‌ వెళ్తుంటారు హీరో మహేశ్‌బాబు. అయితే ఈ ఏడాది రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు సినిమాప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబుకు ఈ ఏడాది ఫారిన్‌ హాలిడే బ్రేక్‌ దొరక్కపోవచ్చని కొందరు అనుకున్నారు. కానీ మహేశ్‌బాబుకు ఆ అవకాశం లభించింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా లాంగ్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత ఫారిన్‌ ఫ్లైట్‌ ఎక్కారు మహేశ్‌బాబు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి యూఎస్‌లో ఉన్నారని సమాచారం.ఇంకా రెండు వారాలు మహేశ్‌బాబు అక్కడే ఉంటారట. వచ్చిన తర్వాత రాజమౌళి సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారు. కేఎల్‌ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 వేసవిలో ఈ చిత్రం విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది.ఇటలీలో... ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలతో కొన్ని రోజులు క్రితం బిజీ బిజీగా గడి పారు ప్రభాస్‌. దాంతో ఈ సినిమా చిత్రీకరణలకు బ్రేక్‌ ఇచ్చి, ఇటీవల ఫారిన్‌ వెళ్లారు ప్రభాస్‌. దాదాపు ఇరవై రోజుల నుంచి ప్రభాస్‌ ఇటలీలోనే ఉంటున్నారని తెలిసింది. అతి త్వరలోనే ప్రభాస్‌ ఇండియాకు తిరిగి రానున్నారు. వచ్చిన తర్వాత ‘ది రాజా సాబ్, ఫౌజి’ సినిమాల చిత్రీకరణలనుప్రారంభిస్తారు. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరో నటి రిద్దీ కుమార్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌పై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తున్న పీరియాడికల్‌ ఫిల్మ్‌ ‘ఫౌజి’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో ఇమాన్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్లు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2026లో ‘ఫౌజి’ సినిమా విడుదల కానుంది.లండన్‌లో... లండన్‌ వెళ్లారు ఎన్టీఆర్‌. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా ‘డ్రాగన్‌’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) అనే హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లాంగ్‌ షెడ్యూల్‌ చిత్రకరణ కర్ణాటకలో జరిగింది. ఎన్టీఆర్‌ పాల్గొనగా, యాక్షన్‌ సీక్వెన్స్‌లు, కొంత టాకీ పార్టును చిత్రీకరించారు ప్రశాంత్‌ నీల్‌. కాగా ఈ కర్ణాటక షూటింగ్‌ షెడ్యూల్‌ తర్వాత ఎన్టీఆర్‌ లండన్‌ వెళ్లారని తెలిసింది. లండన్‌లోని ప్రముఖ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా స్క్రీనింగ్‌ జరగనుందని తెలిసింది. అలాగే ఈ చిత్రం సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి లైవ్‌ కాన్సెర్ట్‌ కూడా ఉంది.ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్‌ లండన్‌ వెళ్తున్నారని తెలిసింది. ఈ వేడుకలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో హీరోలుగా నటించిన ఎన్టీఆర్, రామ్‌చరణ్, ఈ చిత్రదర్శకుడు రాజమౌళిలతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యూనిట్‌లోని మరికొందరు పాల్గొంటారట. తిరిగొచ్చిన తర్వాత మళ్లీ ‘డ్రాగన్‌’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు ఎన్టీఆర్‌. కల్యాణ్‌రామ్, కె. హరికృష్ణ, నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘డ్రాగన్‌’ సినిమాను 2026 జూన్‌ 25న రిలీజ్‌ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.విదేశాల్లో వెరీ బిజీ ‘పెద్ది’ సినిమా చిత్రీకరణకు బ్రేక్‌ ఇచ్చి, లండన్‌ వెళ్లారు రామ్‌చరణ్‌. లండన్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహావిష్కరణ, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వేడుకల్లో పాల్గొనేందుకు రామ్‌చరణ్‌ ఆల్రెడీ లండన్‌లోనే ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలతో ప్రస్తుతం రామ్‌చరణ్‌ బిజీగా ఉన్నారు. తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ‘పెద్ది’ సినిమా చిత్రీకరణలో ఆరంభిస్తారు రామ్‌చరణ్‌. బుచ్చిబాబు దర్శకత్వంలో సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ ‘పెద్ది’ చిత్రం వచ్చే ఏడాది రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా మార్చి 27న రిలీజ్‌ కానుంది. ఈ మల్టీ స్పోర్ట్స్‌ డ్రామా మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, దివ్యేందు, శివ రాజ్‌కుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు హీరోలు ఈ వేసవికి షూటింగ్‌ బ్రేక్స్‌ ఇచ్చారు.– ముసిమి శివాంజనేయులువేసవి తర్వాతే... ఈ వేసవికి కొందరు హీరోలు షూటింగ్స్‌కు బ్రేక్‌ ఇవ్వగా, ఈ వేసవి తర్వాతనే కొత్త సినిమా షూటింగ్‌లనుప్రారంభించాలని మరి కొందరు హీరోలు ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత వెంకటేశ్‌ నెక్ట్స్‌ సినిమాపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. వెంకటేశ్‌ కూడా చాలా కథలు వింటున్నారు. కాగా వెంకటేశ్‌ నెక్ట్స్‌ మూవీ దర్శకుడు త్రివిక్రమ్‌తో ఉంటుందని, హారిక అండ్‌ హాసినీ క్రియేషన్స్‌పై ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారని, వేసవి తర్వాత అధికారిక ప్రకటన రానుందని తెలిసింది.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయట. ఇక మరో సీనియర్‌ హీరో నాగార్జున సోలో హీరోగా కొత్త సినిమాపై ఇంకా సరైన స్పష్టత రాలేదు. అయితే తమిళ దర్శకుడు ఆర్‌. కార్తీక్‌ చెప్పిన ఓ కథ నాగార్జునకు నచ్చిందని, త్వరలోనే ఈ మూవీ గురించిన అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. వేసవి తర్వాతనే ఈ సినిమా చిత్రీకరణను ఆరంభించాలని నాగార్జున భావిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. మరోవైపు అల్లు అర్జున్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్‌ వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి తర్వాతే ఈ సినిమా చిత్రీకరణనుప్రారంభించాలని అట్లీ అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేసిందట. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇలా మరికొంతమంది తెలుగు హీరోలు ఈ వేసవి సెలవుల తర్వాత తమ కొత్త సినిమాల సెట్స్‌లోకి అడుగుపెట్ట నున్నారని తెలిసింది.

Andhra University 100 Years Celebration8
100 ఏళ్ల చదువుల గుడి ఎయూ శతవార్షికోత్సవాలు

ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం ప్రత్యేకంగా ఆవిర్భవించిన మొదటి విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన భాషా ప్రయుక్త విశ్వవిద్యాలయం ఆంధ్రవిశ్వవిద్యాలయం. దేశంలో అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ విశ్వకళాపరిషత్‌ అనే పేరుతో వ్యవహరించేది మాత్రం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మాత్రమే! దేశంలో మరో విశ్వవిద్యాలయానికి లేని ప్రత్యేకత ఇది. పేరుకు తగినట్లే లలిత కళలైన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం, నటన వంటి కళలకు యూనివర్సిటీలో స్థానం కల్పించారు. స్వతహాగా కళా సాహిత్యాల పట్ల మక్కువ ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్‌’ పేరును ప్రతిపాదించారు. 1926లో మద్రాసు విశ్వవిద్యాలయ చట్టం ప్రకారం తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటైన రెసిడెన్షియల్‌ టీచింగ్‌– కమ్‌– అనుబంధ విశ్వవిద్యాలయంగా ఘనతకెక్కిన ఏయూ శతాబ్ది ఉత్సవాలను జరుపుకొంటోంది. మొదటగా విజయవాడలో 1926 ఏప్రిల్‌ 24న ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయానికి పునాదిని మొట్టమొదటి వీసీ డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి వేయగా, అప్పటి మద్రాస్‌ గవర్నర్‌ లార్డ్‌ గోచెన్‌ చాన్సలర్‌గా వ్యవహరించారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని 1930 సెప్టెంబరు 5న ఈ యూనివర్సిటీ ప్రాంగణాన్ని విశాఖపట్నానికి తరలించారు. ప్రతి ఏటా సగటున వెయ్యి నుంచి పన్నెండు వందల మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాలు తీసుకునే ఈ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్రస్తుతం 58 విభాగాలు, 18 పరిశోధన కేంద్రాల్లో 20 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలు...!ఏయూ ఏర్పాటై 2026 నాటికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఏడాది పాటు శతాబ్ది ఉత్సవాలను నిర్వహించుకునేందుకు ఏయూ సిద్ధమయ్యింది. ఏడాదిపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఔట్‌రీచ్‌– ఈ మూడు విభాగాల్లో పనిచేయాలని విజన్‌ డాక్యుమెంట్‌ను ఏయూ ప్రకటించింది. శతాబ్ది ఉత్సవాల లోగోను ప్రత్యేకంగా తయారు చేశారు. ఈ లోగోను యూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలోని బీఎఫ్‌ఏ విద్యార్థి షేక్‌ రఫీ రూపొందించారు. ఏయూ లోగో ప్రత్యేకత!ఆంధ్రా యూనివర్సిటీ లోగోను ప్రత్యేక శ్రద్ధతో తయారుచేసి, లోగోలోని ప్రతి చిహ్నానికి అర్థం స్ఫూరించేలా తయారు చేశారు. కాంతి కిరణాలతో ఉదయించే సూర్యుడు విశ్వవిద్యాలయాన్ని, దాని అనేక అధ్యయన విభాగాలను సూచిస్తుంది. ఇక కమలం శ్రేయో దేవత లక్ష్మీ, జ్ఞాన దేవత సరస్వతి– ఇద్దరినీ ప్రతిబింబిస్తుంది. సూర్యకిరణాలపై ఆర్యులలో దీవెన చిహ్నమైన స్వస్తిక ఉంటుంది. అరవై నాలుగు తామర రేకులతో కూడిన శిఖరం బయటి వృత్తం, భారతదేశ శాస్త్రీయ సంప్రదాయంలోని అరవై నాలుగు కళలను, శాస్త్రాలను సూచిస్తుంది. ఇక సముద్రాన్ని– విద్యార్థులు ప్రావీణ్యం పొందడానికి దోహదపడే విస్తారమైన జ్ఞానకేంద్రం అనే అర్థంలో తయారు చేశారు. ఉపనిషత్తులలోని ‘తేజస్వినావధితమస్తు’ అనే నినాదాన్ని కూడా లోగోలో భాగం చేశారు. దీని అర్థం ఏమిటంటే ‘దైవిక కాంతి మన అధ్యయనాలను ప్రకాశింపజేయుగాక‘ అని. ఈ జ్ఞాన చిహ్నం కింద అన్ని మతాలలోనూ ప్రాశస్త్యం కలిగిన నెలవంక ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని కళల అభివృద్ధికి నెలకొల్పిన సంస్థ అనే అర్థంతో ‘ఆంధ్ర విశ్వకళాపరిషత్‌’ అని దీనికి నామకరణం చేశారు. లోగోలోని దిగువభాగంలో ఉన్న రెండు సర్పాలు తామర రేకుల నుంచి జ్ఞానాన్ని కోరుకునేవారిని, జ్ఞాన సంరక్షకులను సూచిస్తాయి. అంతేకాకుండా, పురాతనకాలం నుంచి ఆంధ్రులలో నాగారాధన సంప్రదాయం ఉంది. ఈ లోగోను కౌతా రామమోహనశాస్త్రి రూపొందించగా, ఏయూ వ్యవస్థాపక వీసీ డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి ఆమోదించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో...వాస్తవానికి మొట్టమొదటగా బెజవాడలోని (ఇప్పటి విజయవాడ) తాత్కాలిక భవనాల్లో ఏర్పాటైన ఏయూ 1930లో విశాఖకు తరలివచ్చింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మాత్రం ఏయూ ప్రాంగణం అంతా సైనిక స్థావరంగా మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 ఏప్రిల్‌ 6న విశాఖ హార్బర్‌పై జపాన్‌ బాంబులు వేసింది. ఆ దాడి తర్వాత యూనివర్సిటీ భూమిని, భవనాలను తమ అవసరాలకు ఉపయోగించుకోవాలని అప్పటి బ్రిటిష్‌ సైన్యం నిర్ణయించుకుంది, యూనివర్సిటీని మార్చమని బలవంతం చేసింది. బాంబు దాడి జరిగిన పది రోజుల తర్వాత– అంటే 1942 ఏప్రిల్‌ 16న యూనివర్సిటీని తరలించడానికి సన్నాహాలు చేసుకోవడం కోసం మూసివేశారు. కెమిస్ట్రీ మినహా చాలా విభాగాలు గుంటూరుకు మారగా, కెమిస్ట్రీ విభాగం మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలకు మారింది. భవనాలన్నింటినీ సైన్యం ఆక్రమించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం జూన్‌ 1945 వరకు అంటే మూడేళ్లపాటు విశాఖపట్నం వెలుపలి నుంచే పనిచేసింది.న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌తో...!తెలుగు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితంగా ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పడటంతో తెలుగు ప్రజలు యూనివర్సిటీతో మానసికంగా అనుబంధం పెంచుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ దేశంలోని పురాతన విద్యాసంస్థలలో ఒకటి మాత్రమే కాదు, రెసిడెన్షియల్‌ మల్టీ–డిసిప్లినరీ యూనివర్సిటీగా ఏర్పడిన విశ్వవిద్యాలయాలలో మొదటిది. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమైన ఈ యూనివర్సిటీకి కట్టమంచి రామలింగారెడ్డి వ్యవస్థాపక వైస్‌ చాన్సలర్‌గా, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండో వైస్‌ చాన్సలర్‌గా, తిరిగి సీఆర్‌ రెడ్డి, అనంతరం డాక్టర్‌ వీఎస్‌ కృష్ణు్ణడు– ఈ ముగ్గురు దార్శనికులు వేసిన పునాదులు ఆ తర్వాతి దశాబ్దాల్లో ఫలవంతమై, ఏకంగా దేశంలోనే న్యాక్‌ ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ పొందిన మొట్టమొదటి ప్రభుత్వ యూనివర్సిటీగా 2024లో చరిత్రకెక్కింది. ఏయూలో 59 దేశాల విద్యార్థులు...దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతో పాటు విదేశాల్లోని విద్యార్థులనూ ఏయూ ఆకర్షిస్తోంది. ఇక్కడ చదువుకునేందుకు విదేశీ విద్యార్థులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఏకంగా 59 దేశాలకు చెందిన 1,130 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. ఎక్కువగా ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 472 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. 2019–20 సంవత్సరంలో 190 మంది ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య గత ప్రభుత్వ హాయంలో ప్రత్యేకంగా హాస్టల్స్‌ ఏర్పాటుతో పాటు ప్రత్యేక మెనూను అమలు చేయడంతో ఈ సంఖ్య 1,130కి చేరుకుంది. ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ప్రధానంగా విశాఖలో జరిగే వివిధ రకాల సినిమా షూటింగుల కోసం అవసరమైన విదేశీయుల కోసం ఇక్కడ చదువుకుంటున్న విదేశీ విద్యార్థులను దర్శకులు వెదుక్కుంటూ వచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఇస్మార్ట్‌ శంకర్, శివం వంటి సినిమాల్లో ఇక్కడి విదేశీ విద్యార్థులు నటించారు. ఎందరో మహానుభావులు...ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న అనేక మంది ఎంతో గొప్ప స్థానాలకు చేరుకున్నారు. ఆచార్య సూరి భగవంతం (భౌతికశాస్త్రం), ఆచార్య జ్ఞానానంద (అణుభౌతిక శాస్త్రం), ఆచార్య సి.మహదేవన్‌ (జియాలజీ), ఆచార్య టీఆర్‌. శేషాద్రి (రసాయన శాస్త్రం), ఆచార్య బి. రామచంద్రరావు(స్పేస్‌ ఫిజిక్స్‌), ఆచార్య సి.ఆర్‌రావు (స్టాటస్టిక్స్‌), ఆచార సీవీ రామన్‌(భౌతికశాస్త్రం), ఆచార్య ఆర్‌.రంగదామరావు (మీటీయరాలజీ) వంటి అనేక మంది ప్రపంచస్థాయిలో శాస్త్రవేత్తలుగా రాణించినవారే! ఇక భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రస్తుత ఒడిశా గవర్నర్‌ ఆచార్య కంభంపాటి హరిబాబు, రాజ్యసభ మాజీ సభ్యుడు, విశ్వ హిందీపరిషత్‌ అద్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, పెన్‌స్టేట్‌ యూనివర్సిటీ (అమెరికా) అద్యక్షురాలు నీలి బెండపూడి, జీఎంఆర్‌ గ్రూప్‌ అధినేత డాక్టర్‌ జి.ఎం.రావు, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ దువ్వూరి సుబ్బారావు, లోక్‌సభ మాజీ స్పీకర్‌ జీఎంసీ బాలయోగి తదితర ప్రముఖులు ఏయూ పూర్వవిద్యార్థులలో ఉండటం విశేషం. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు నాయకత్వం వహిస్తున్న 50 మంది వీసీలను, 10 మంది చాన్సలర్లనూ అందించిన ఘనత ఏయూ సొంతం. ఇదిలా ఉంటే, ఈ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఎనిమిది మంది శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డు గ్రహీతలు, ముగ్గురు పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీతలు, నలుగురు పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో పాటు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఒకరు ఉన్నారు. డిసెంబర్‌లో పూర్వ విద్యార్థుల సమావేశం...ఏయూ పూర్వ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నవారు ఉన్నారు. దేశంతో పాటు విదేశాల్లోనూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, జపాన్, కెనడా, ఆఫ్రికా, జర్మనీ, ఫ్రా¯Œ ్స, రష్యా, థాయ్‌లండ్, మలేషియా మొదలైన దేశాల్లో మంచి సంఖ్యలో పూర్వ విద్యార్థులు స్థిరపడి పని చేస్తున్నారు. వీరందరూ కలిపి ఏర్పాటు చేసుకున్న ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం యూనివర్సిటీ అభివృద్ధిలోనూ ఎంతగానో సహాయ సహకారాలను అందిస్తోంది. ఈ సంఘం ద్వారా యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక వీసీ సీవీ రెడ్డి జయంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. ‘నాసా’ పరిశోధనల్లోనూ...ప్రారంభంలో ఏయూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆర్ట్స్‌ కళాశాలలు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడి విభాగాలకు ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఎం. వెంకటరంగయ్య ‘పద్మవిభూషణ్‌’ అందుకున్నారు. అయితే, 1931లో ఈ రెండు విభాగాలను వేరు చేశారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల తొలి ప్రిన్సిపాల్‌గా ఆర్‌.రామనాథం పనిచేశారు. జయపూర్‌ మహారాజా విక్రమ్‌దేవ్‌ వర్మ ఏయూకు విలువైన భూములను, భారీగా నగదును విరాళంగా ఇచ్చారు. సంప్రదాయ కోర్సులకు భిన్నంగా భవిష్యత్‌ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులను విద్యార్థులకు అందించడంలో ఆంధ్రా యూనివర్సిటీ అగ్రగామిగా ఉంటోంది. ఏయూ మీటియరాలజీ, ఓషనోగ్రఫీ, జియాలజీ, నూక్లియర్‌ ఫిజిక్స్‌ వంటి వైవిధ్యభరితమైన ప్రత్యేక శాస్త్ర విభాగాలను నిర్వహిస్తోంది. దేశంలోనే మొదటిసారిగా న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీగా ఏయూ పేరు సంపాదించింది. ఇక వివిధ రకాల పరిశోధనల కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అడ్వాన్స్‌డ్‌ అనలిటికల్‌ లేబొరేటరీ, ఎన్‌ఎంఆర్‌ స్పెక్టోస్కోపీలు వర్సిటీ విశిష్టతను చాటుతున్నాయి. ఇక ‘నాసా’ చేపట్టిన లూనార్‌ ప్రయోగాలకు ఏయూ తన వంతు సహాయాన్ని అందించింది. తూర్పు కనుమలలోని పలు రకాల రాళ్లను సేకరించి, చంద్రమండలంలోని పదార్థాలలో పోలి ఉన్నాయా లేదా అనే ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందుకు అవసరమైన సహకారాన్ని ఏయూ జియాలజీ విభాగం అందించింది. తమకు అందించిన సహకారానికి ‘నాసా’ స్వయంగా ఏయూకు కృతజ్ఞత లేఖ రాసింది. అలాగే ఏయూ ఫ్రాన్స్‌కు కూడా అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించింది.మరో ఎత్తుకు వైఎస్‌ జగన్‌ హాయంలో....!నూతన పోకడలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీలో కొంగొత్త మార్పులకు గత వైఎస్సార్‌సీపీ హాయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలో శ్రీకారం చుట్టారు. ఎన్నడూ లేని విధంగా స్టార్టప్‌ల కోసం ప్రత్యేకంగా ఏ–హబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు పేటెంట్ల కోసం ఏకంగా నూటికిపైగా దరఖాస్తులు చేయడంలో ఏయూ మరో శిఖరానికి చేరుకుంది. పేటెంట్లకు దరఖాస్తు చేసేందుకు ప్రత్యేకంగా ఆంధ్రా యూనివర్సిటీలో మేధాసంపత్తి హక్కులను పొందేందుకుగానూ ప్రత్యేకంగా మేధాసంపత్తి హక్కుల కేంద్రాన్ని (సీఐపీఆర్‌) గత ప్రభుత్వ హాయంలో అప్పటి వీసీ ప్రసాద్‌రెడ్డి సెప్టెంబరు 2020లో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా నూటికిపైగా దరఖాస్తులను పంపారు. ఇక గత ప్రభుత్వ హాయంలో చేపట్టి, పూరైన 5 ప్రత్యేక భవనాలను సీఎం హోదాలో 2023 ఆగస్టు 1వ తేదీన వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అప్పటి వీసీ ప్రసాద్‌ రెడ్డి నేతృత్వంలో ఏయూ ఈ ప్రగతిని సాధించింది. ఆ భవనాలు ఇవే... ఏ–హబ్‌ (ఆంధ్రా యూనివర్సిటీ స్టార్టప్‌ – టెక్నాలజీ ఇంక్యుబేషన్‌ హబ్‌): దీనిని రూ. 21కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల స్థలంలో కొత్తగా నిర్మించారు. ఇందులో 121 స్టార్టప్స్‌ తమ కార్యాలయాలను ప్రారంభించి సేవలందిస్తున్నాయి. రాష్ట్రంలో స్టార్టప్స్‌కు అంకురార్పణ కూడా ఇక్కడి నుంచే ఊపందుకుందని చెప్పవచ్చు.ఎలిమెంట్‌(ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్‌ మరియు బయోలాజికల్‌ మానిటరింగ్‌ హబ్‌): ఫార్మా/బయోటెక్‌/ జెనోమిక్స్‌ ఇంక్యుబేషన్, టెస్టింగ్‌ ల్యాబ్‌ కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా నిర్మించారు. దీని నిర్మాణానికి రూ. 44 కోట్లు ఖర్చు చేశారు.ఆల్గోరిథమ్‌(ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్‌ జోన్‌ –స్మార్ట్‌ క్లాస్‌ రూమ్స్‌ కాంప్లెక్స్‌): దీనిని 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూ. 35 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇందులో 250 మంది కూర్చునేందుకు వీలు కలిగిన రెండు ఆధునిక సెమినార్‌ హాళ్లు, 15 స్మార్ట్‌ క్లాస్‌ రూమ్‌లలో 500 కంప్యూటర్‌లతో విద్యార్థులకు శిక్షణ, ఆన్‌లైన్‌ పరీక్షలను నిర్వహించుకునే వీలు కలిగింది. ఇందుకోసం ప్రత్యేక ఫ్లోర్‌ను నిర్మించారు.ఏయూ–సిబ్‌ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌): ఐఐఎం–విశాఖపట్నంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుని, రూ. 18 కోట్ల వ్యయంతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. ఇందులో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అండ్‌ అనలిటిక్స్‌లో ప్రత్యేకమైన బ్యాచిలర్‌ మరియు మాస్టర్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నారు.ఏయూ–అవంతి ఆక్వాకల్చర్‌ ఇనోవేషన్‌ మరియు స్కిల్‌ హబ్‌మొదటి దశలో రూ. 11 కోట్లతో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మెరైన్‌ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణను అందించడానికి దీనిని నిర్మించారు.

Pakistan air defence system destroyed by India9
పాక్‌ రెక్కలు కత్తిరించాం

యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్‌ పంచ్‌ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్‌ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్‌కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్‌లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్‌ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్‌ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్‌కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్‌ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్‌ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్‌ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్‌ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్‌ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్‌–78 విమానాలకు స్థావరం. పాక్‌ ఎయిర్‌ మొబిలిటీ కమాండ్‌కు ప్రధాన కేంద్రం కూడా. భారత్‌తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్‌ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్‌పై జరిపిన డ్రోన్‌ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్‌ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్‌. పాక్‌ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్‌పోర్ట్‌ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్‌ వైమానిక దళ (పీఏఎఫ్‌) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్‌ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్‌ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్‌ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్‌బేస్‌పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్‌లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్‌ ప్రావిన్స్‌లో జాంగ్‌ జిల్లాలోని షోర్‌కోట్‌లో ఇస్లామాబాద్‌కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్‌కోట్‌ బేస్‌గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్‌ లీడర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్‌ కొనుగోలు చేసిన జేఎఫ్‌–17, మిరాజ్‌ వంటి అత్యాధునిక ఫైటర్‌ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్‌బేస్‌ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్‌ పంజాబ్‌లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్‌వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్‌ రక్షణ నెట్‌వర్క్‌లో అతి కీలకమైన భాగమిది.మురీద్‌చక్వాల్‌ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్‌–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్‌ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్‌పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌కు చక్వాల్‌ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్‌ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్‌ దాడులకు ప్రతి చర్యగా మురీద్‌ ఎయిర్‌ బేస్‌ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్‌ఖాన్‌దక్షిణ పంజాబ్‌లో రహీం యార్‌ఖాన్‌ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్‌ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్‌ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్, జైసల్మేర్‌ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్‌తో పాటు ఇక్కడి రన్‌వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్‌భొలారీ ఎయిర్‌బేస్‌గా పిలుస్తారు. సింధ్‌ ప్రావిన్స్‌లో కరాచీ, హైదరాబాద్‌ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్‌కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్‌బేస్‌ను ఏర్పాటు చేశారు. సదరన్‌ ఎయిర్‌ కమాండ్‌ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్‌ కన్వర్షన్‌ యూనిట్‌ తాలూకు 19 స్క్వాడ్రన్‌కు కేంద్రం. ఎఫ్‌–15ఏ, ఎఫ్‌–16, కొన్ని జేఎఫ్‌–17లతో పాటు ఏడీఎఫ్‌ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్‌ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్‌ సపోర్ట్‌ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్‌ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్‌ఏఏబీ 2000 ఎయిర్‌బార్న్‌ అర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్‌ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్‌) ఉంది.రాడార్‌ కేంద్రాలుసియాల్‌కోట్‌పంజాబ్‌లోని సియాల్‌కోట్‌ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్‌ కేంద్రం వైమానికంగా పాక్‌కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్‌ఇది కూడా పంజాబ్‌లోనే సియాల్‌కోట్‌ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్‌ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్‌పంజాబ్‌ ప్రావిన్స్‌లో లాహోర్‌కు 70 కి.మీ. దూరంలో చునియన్‌ వద్ద ఉంటుంది. పాక్‌లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Indian archers win 5 medals at Archery World Cup10
భారత్‌ ‘పాంచ్‌ పటాకా’

షాంఘై: ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–2 టోర్నమెంట్‌లో భారత కాంపౌండ్‌ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్‌ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్‌గా మూడు పతకాలు గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్‌ ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్‌ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్‌ఫెక్ట్‌ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్‌లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది. అంతకుముందు కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్‌ వర్మ, రిషభ్‌ యాదవ్, ఓజస్‌ ప్రవీణ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్‌ యాదవ్‌ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్‌లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్‌పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్‌), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్‌ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో మధుర–అభిõÙక్‌ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్‌ నూర్‌ఫతే–మొహమ్మద్‌ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్‌ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్‌కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement