
ప్రతీకాత్మక చిత్రం
లక్నో: సినిమాలు అతిగా చూసే వారిపై ఆ ప్రభావం ఎంతో కొంత పడుతుంది. పలనా సినిమా నుంచి స్ఫూర్తి పొందానంటూ కూడా కొందరు చెబుతూ ఉంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి హాలీవుడ్ సినిమా చూసి ఏకంగా బ్యాంకుకే కన్నంవేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతనే పోలీసుల విచారణలో తెలిపాడు. వివరాలు యూపీలోని కొద్వార్ ప్రాంతానికి చెందిన వికుల్ రాతి స్థానిక కోపరేటీవ్ బ్యాంకులో ఇటీవల దోపిడీకి పాల్పడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు దగ్గరలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. వికుల్ అని తేలింది. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు. వారి విచారణలో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి అన్ని వివరాలను వెల్లడించారు.
తాను ఇటీవల ఓ హాలీవుడ్ సినిమా చూశానని, అందులో బ్యాంకులు సునాయాశంగా దోచుకున్నారని తెలిపాడు. తాను కూడా వారు అనుసరించిన విధంగానే ప్రయత్నించి దోపిడీకి పాల్పడినట్లు తెలిపాడు. అయితే వారం వ్యవధిలోనే అతను మూడుసార్లు దోపిడీకి ప్రయత్నించినట్లు ఒప్పుకున్నాడు. అయితే తాను మరో బ్యాంకు నుంచి రూ. 20లక్షల అప్పు తీసుకున్నానని, దానిని తీర్చేందుకు ఇలా రాబరీ చేశానని వివరించాడు. దీంతో అతని వద్ద నుంచి కొంత నగదు, ఇసుప వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment