![Shamirpet: Young Woman Commits Suicide Due To Marriage Cancel - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/28/suicide.gif.webp?itok=Xngks8da)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, శామీర్‌పేట్: పెళ్లి రద్దయిందని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. శామీర్‌పేట్ పోలీసులు తెలిపిన మేరకు.. అలియాబాద్‌కు చెందిన లక్ష్మణ్ కూతురు అనూష(22) మూడుచింతలపల్లికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇటీవల వివాహం రద్దయింది. దీంతో అనూష మనస్థాపానికి గురై గురువారం ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుకొని మృతిచెందింది. ఘటనా స్థలానికి శామీర్‌పేట పోలీసులు చేరుకొని పంచానామ నిర్వహించారు. తల్లి కృష్ణవేణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment