
సాక్షి, హైదరాబాద్: షామీర్‌పేట్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీయత్నం జరిగింది. బ్యాంకులోకి ప్రవేశించి దోచుకునేందుకు దొంగలు విశ్వప్రయత్నం చేశారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు రావడంతో దొంగల ప్రయత్నం విఫలమైంది. పోలీసుల రాకను పసిగట్టి దొంగలు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే సీసీకెమెరా దృశ్యాల ఆధారంగా దొంగలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.