
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలోని పొట్టి శ్రీరాములు సెం టర్ సమీపంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంను గుర్తుతెలియని దుండగులు శనివారం రాత్రి పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. అయితే ఏటీఎంలో నగదు ఎంత ఉంది, ఏమైనా చోరీకి గురైందా అనేది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని జంగారెడ్డిగూడెం డీఎస్పీ సీహెచ్ మురళీకృష్ణ, సీఐ కె.బాలరాజు పరిశీలించారు. ఈ ఘటనపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ ఎస్.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఏటీఎం తమ నిర్వహణలో లేదని, పూర్తిగా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో టాటా సంస్థ నిర్వహిస్తోందని తెలిపారు. ఏటీఎం ధ్వంసం, చోరీపై టాటా కంపెనీ ప్రతినిధులే ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు. అందులో ఎంత నగదు ఉంది, చోరీకి గురైందా లేదా అనే విషయాలను టాటా సంస్థే తెలియజేయాలన్నారు. ఇదిలా ఉండగా టాటా సంస్థ ప్రతినిధులు దీనిపై ఫిర్యాదు చేయలేదని సీఐ బాలరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment