బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకువస్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. అతని చేతిలో ఉన్న డబ్బుల బ్యాగు లాక్కెళ్లిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్‌బీఐ ఎదుట గురువారం మధ్యాహ్నం జరిగింది.
మెదక్ : బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకువస్తున్న వ్యక్తి దృష్టి మరల్చి.. అతని చేతిలో ఉన్న డబ్బుల బ్యాగు లాక్కెళ్లిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ ఎస్‌బీఐ ఎదుట గురువారం మధ్యాహ్నం జరిగింది. బ్యాంకు నుంచి రూ.1.80 లక్షలు డ్రా చేసుకువస్తున్న మక్సూద్ అనే వ్యక్తిని 'ఈ డబ్బులు మీవేనా..?' అని పలకరించి అతను వాటిని తీసుకోవడానికి ప్రయత్నించేలోపే అతని చేతిలోని డబ్బుల బ్యాగుతో గుర్తుతెలియని దుండగులు ఉడాయించారు.
దీంతో మక్సూద్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.