
జాతీయ క్రీడాదినోత్సవ ర్యాలీ
శామీర్‌పేట్/ మేడ్చల్: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా శామీర్‌పేట్, మేడ్చల్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆయా గ్రామాల్లోని పురువీధుల్లో సోమవారం ర్యాలీలు తీశారు. ఈ సందర్భంగా క్రీడాదినోత్సవ ఆవశ్యకతను వివరించారురు. శామీర్‌పేటలో ఫిజికల్ డైరెక్టర్ (పీ.డీ) మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్ల కార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చెన్నయ్య, నాగిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.