
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్, డెంటల్, ఆయుష్, నర్సింగ్, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్ విద్యాసంస్థల్లో ఫీజుల నిర్ణయానికి దరఖాస్తు గడువును మరో 2వారాలు పొడిగించారు. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) సభ్య కార్యదర్శి డాక్టర్ ఎన్.రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మార్చి 14వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టు తెలిపారు.
మెడికల్‌లో యూజీ, పీజీ, సూపర్ స్పెషాల్టీ, డెంటల్‌లో యూజీ, పీజీ, ఆయుష్, నర్సింగ్‌లో యూజీ, పీజీ, డిప్లొమో, పారామెడికల్, అగ్రికల్చర్, హార్టికల్చర్ ప్రోగ్రాములు నిర్వహించే ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ప్రొఫెషనల్ విద్యాసంస్థలు ఈ గడువులోగా తమ సమాచారాన్ని aphermc.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని రాజశేఖర్‌రెడ్డి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment