మామను అంతమొందించిన అల్లుడు | man killed his uncle | Sakshi
Sakshi News home page

మామను అంతమొందించిన అల్లుడు

Published Mon, Mar 28 2016 6:53 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

man killed his uncle

క్రోసూరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కిరాయి ముఠాతో పిల్లను ఇచ్చిన మామను హత్య చేయించాడు. ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్‌ఐ బ్రహ్మం కథనం మేరకు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం దొంగగామపాడు గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య (63)కు ఐదుగురు కుమార్తెలు. నాలుగో కుమార్తెను క్రోసూరు మండలం విప్పర్ల గ్రామానికి చెందిన అంకమరావు వివాహం చేసుకున్నాడు. అయితే, వీరికి సంతానం లేకపోయేసరికి ఐదో కుమార్తెను కూడా తనకిచ్చి చేయాలని ఏడాదిగా అంకమరావు ఒత్తిడి చేస్తున్నప్పటికీ మామ ఒప్పుకోవడం లేదు.

 

వెంకటకృష్ణయ్య కుటుంబం కూడా విప్పర్లకు వచ్చి అంకమరావుతోనే కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అంకమరావు కిరాయిముఠాతో మామను హత్య చేయించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 మంది వ్యక్తులు వచ్చి కృష్ణయ్యను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చి తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అంకమరావుతోపాటు వారందరూ పరారయ్యాడు. క్రోసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement