krosuru
-
చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్
-
జగనన్న కాన్వాయ్‌పై పూల వర్షం
-
బాబు బతుకంతా మోసమే
-
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
-
సీఎం జగన్‌కు జేజేలు
-
Jagananna Vidya Kanuka: విద్యార్థులతో సీఎం జగన్.. ఫోటోలు
-
14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు?.. సీఎం జగన్
సాక్షి, పల్నాడు: పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు సీఎం జగన్. సోమవారం పల్నాడు క్రోసూర్లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తీరును సీఎం జగన్ ఏకిపారేశారు. ‘‘చంద్రబాబుకు మంచి చేయాలన్నది ఏనాడూ లేదు. గతంలో ఇది చూశాం. ఆయన 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా.. ఏ ఒక్క మంచి, పథకం కూడా గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదకులండా ‘‘ఎన్నికలకు ముందు వాగ్ధానం చేశారు.. ఎన్నికల తర్వాత మోసం చేశాడ’’ని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఇది కళ్ల ముందు కనిపిస్తున్న సత్యమన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గుర్తించండి. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధి దారులకు సంక్షేమం అందించిన ప్రభుత్వం మనది. అక్కచెల్లెమ్మల దగ్గరి నుంచి అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుస్తున్నాం. మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను అమలు చేస్తున్నాం. కానీ, చంద్రబాబు బతుకే మోసం, అబద్ధం, కుట్ర, వాగ్ధానాలు, వెన్నుపోటులు. ఒక ఈనాడు, ఒక టీవీ5, ఒక ఆంధ్రజ్యోతి, ఒక దత్తపుత్రులు.. ఈ గజదొంగల ముఠా ఆయనకు అండగా వస్తోంది. మూసేయడానికి సిద్ధంగా ఉన్న టీడీపీ దుకాణంలో పక్కరాష్ట్రం నుంచి మేనిఫెస్టో తీసుకొచ్చి.. బిసిబిల్లాబాత్‌గా వండుతున్నారు. మనం చేసిన మంచిని, అందిస్తున్న సంక్షేమ పథకాలను కిచిడీ, పులిహోరగా వండే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీఎస్టీ డిక్లరేషన్లు అంటూ ఇవాళ మొదలుపెట్టారు. ఆ 14 సంవత్సరాలు ఏం గాడిదలు కాసావా చంద్రబాబు? అంటూ నిలదీశారు సీఎం జగన్. కేవలం ఎన్నికలప్పుడే వాగ్ధానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు సీఎం జగన్. చంద్రబాబునాయుడుగారి పెత్తందారీ వ్యవస్థకు X పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం. డీపీటీ(దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి X లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్‌కు జరుగుతున్న యుద్ధం. సామాజిక అన్యాయానికి X సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. యెల్లో మీడియా విష ప్రచారానికి X ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధం.. ఇది జగన్‌పై జరుగుతున్న యుద్ధం కాదు.. పేదలపై జరుగుతున్న యుద్ధం. మీ జగనన్నకు ఈనాడు తోడు లేదు, టీవీ 5 అండ లేదు, ఏబీఎన్ ఢంకా బజాయించడంలేదు, దత్తపుత్రుడు అసలే లేడు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను. మీ చల్లని దీవెనలు. నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన మంచి అని చెప్పడానికి గర్వపడుతున్నా. మిమ్మల్ని కోరేది ఒక్కటే.. వాళ్ల దుష్ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రభుత్వం ద్వారా మీ ఇంట్లో జరిగిన మంచే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి గెలుస్తుందని మనసారా నమ్ముతూ.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. పిల్లలు మంచిగా చదువుకుని విద్యావేత్తలుగా ఎదగాలని, మంచి నాయకులు కావాలని.. మీ అందరికీ మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. గతానికీ ఇప్పటికీ తేడా.... గత ప్రభుత్వంలో ఇవన్నీ చేయాలని చంద్రబాబుకు మనసే లేదు. గతంలో చంద్రబాబుకు ఆలోచన వేరు. ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు. పేదలు చదువుకుంటే, అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే.. వారికి గవర్నమెంట్ బడుల్లో డిజిటల్ బోధన వస్తే.. ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తతత్వం చంద్రబాబుది. చంద్రబాబు పేదల వ్యతిరేకి.. అన్ని విషయాల్లో చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం, ఇదే బుద్ది. పేదలకు వ్యతిరేక బుద్ధి. పేదలు బాగు పడకూడదన్న దుర్బుద్ధి. కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం అని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. వాలంటీర్లు– లంచాలకు తావులేని వ్యవస్ధ... మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు, వివక్షకు తావుండకూడదని చెప్పి.. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం. గ్రామాల్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి, అక్కచెల్లెమ్మలకు రేషన్ సరుకులు మొదలు పేదలు, రైతులందరూ ఎటువంటి ఇబ్బంది, లంచాలు ఉండకూడదని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే వాలంటీర్ల వ్యవస్ధ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం. వెంటనే ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. నాడు–నేడు స్కూల్స్‌లో మార్పులు తీసుకొచ్చాం. ఇలా అనేక వ్యవస్ధలను గ్రామస్ధాయిలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. మరి ఇవే ఆలోచనలు గతంలో చంద్రబాబు బుర్రకు ఎందుకు తట్టలేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. కారణం వారిది పెత్తందారీ మనస్తత్వం, వారు పేదలకు వ్యతిరేకం. ఈ నాలుగు సంవత్సరాల్లోనే మనం ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణం, అక్కచెల్లెమ్మలకు ఇచ్చే అమ్మ ఒడి, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, దిశ యాప్.. ఇటువంటివన్నీ తీసుకొచ్చాం. భారత దేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా నిలబడనంత అండగా నా అక్క చెల్లెమ్మలకు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది. చంద్రబాబు బ్రతుకే మోసం, అబద్దం ... ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు. రైతన్నలకు ఎన్నికలకు ముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడు. యువతకూ ఎన్నికలకుముందు వాగ్దానం చేసి, ఎన్నికల తర్వాత మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు.. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీలో నిరుపేదలకు ఏం చేశాడని చూస్తే.. ఎన్నికలకుముందు వాగ్దానం, ఎన్నికల తర్వాత మోసం చేశాడని మనకు కళ్లెదుటనే కనిపిస్తున్న సత్యం. కారణం ఈ పెద్దమనిషి చంద్రబాబు బతుకే మోసం, పెద్ద అబద్ధం. చంద్రబాబుది పెత్తందారీ మనస్తత్వం, ఈ బాబు పేదలకు వ్యతిరేకమన్నది మర్చిపోవద్దని తెలియజేస్తున్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఏ ఒక్కసంక్షేమ పథకం మనకు గుర్తు రాదు. ఏ ఒక్క మంచీ గుర్తుకు రాదు. బాబు పేరు చెబితే వెన్నుపోటు గుర్తు వస్తుంది.. చంద్రబాబు పేరు చెబితే 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగా. ఇంత దారుణంగా ప్రజలందరినీ మోసం చేస్తున్నా కూడా అన్ని విషయాల్లో బాబును వెనకేసుకురావడానికి బాబు వల్ల బాగా వెనుకేసుకున్న ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ ఒక దత్తపుత్రుడు ఉన్నారు. ఈ గజదొంగల ముఠా, ఈదుష్ట చతుష్టయం మాత్రమే చంద్రబాబుకు తోడుగా ఉంది. కానీ బాబు పాలన వల్ల, ఆయన చేసిన పనులు వల్ల తమకు మేలు జరిగిందని చెప్పే ఒక సామాజికవర్గంగానీ, ప్రాంతంగానీ, పేదలుగానీ, ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరని ఈ సందర్భంగా చెబుతున్నాను. టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉన్న దుకాణం.. కాబట్టి మూసేయడాని సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతోందంటే.. పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టో తెచ్చి బిస్ బేలా బాత్‌గా వండుతున్నారు. ఈ రోజు మనం అమలు చేసిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా వండే కార్యక్రమం చేస్తున్నారు. నిస్సిగ్గుగా చంద్రబాబు... నిజంగా బాబు ఎంత సిగ్గులేకుండా ఉన్నాడంటే.. ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన తర్వాత ఈరోజు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం చేశారు ? గాడిదలు కాశారా అని అడుగుతున్నా ? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు. ఎస్సీ, ఎస్టీ, డిక్లరేషన్ అంటూ మొదలు పెట్టాడు, మైనార్టీ డిక్లరేషన్ అని మొదలు పెట్టాడు. అక్కచెల్లెమ్మలు, రైతన్నలు చివరికి గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలు పెట్టాడు. వాగ్దానాలు, వెన్నుపోట్ల చక్రమే– బాబు సైకిల్ చక్రం.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబూ ? అని అడుగుతున్నా. ఇవాళ ప్రజల్ని మళ్లీ మోసం చేస్తూ మరోసారి అవకాశం ఇస్తే మయసభ నిర్మిస్తానంటున్నాడు. మరోసారి అవకాశం ఇస్తే... ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తానంటున్నాడు. ఇంటింటికీ బెంజ్ కారు కొనిస్తానంటున్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా ? అని అడుగుతున్నా. కనీసం ఇప్పటికైనా ఈ పెద్దమనిషి చంద్రబాబు మరోసారి మోసానికి తెరతీయడం ఆపేస్తాడేమో అని ఆశిద్దాం. చంద్రబాబు గారి బ్రతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, మళ్లీ ఎన్నికలొచ్చినప్పుడు మళ్లీ వాగ్దానాలు, మళ్లీ వెన్నుపోట్లు, ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం. మనపేదలకూ– బాబు పెత్తందార్లకూ యుద్ధం.. ఈ రోజు బాబు పెత్తందారీ భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. గమనించమని, ఆలోచన చేయమని మిమ్నల్ని కోరుతున్నాను. చంద్రబాబు గారి దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ భావజాలానికి, మన రూ. 2.16 లక్షల కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య యుద్ధం జరుగుతోంది. చంద్రబాబు గారి మాదిరి దోచుకో, పంచుకో, తినుకో డీపీటీ కావాలా, మీ జగనన్న ప్రభుత్వం మాదిరిగా నేరుగా బటన్ నొక్కే మన డీబీటీ కావాలా ఆలోచన చేయండి. మనది సామాజిక న్యాయం– వారిది అన్యాయానికి యుద్దం. ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కామ్‌లకు, అదే బడ్జెట్లో మనం అందజేస్తున్న మంచి స్కీములకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది వారి ఎల్లో మీడియా.. వారి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 చేస్తున్న విష ప్రచారాలకు.. ఇంటింటికీ మనం చేసిన.. కనిపిస్తున్న మంచికి జరుగుతున్న యుద్ధం ఇది. పేదలపై జరుగుతున్న యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధంలో వీరిది పేదలపై యుద్దం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగన్‌కు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు. టీవీ5 డంకా బజాయించకపోవచ్చు. ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు. మీ జగనన్నకు బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. మీ ఆశీస్సులు– దేవుడి దయనే నమ్ముకున్నా... మీ జగనన్న వీళ్లను నమ్ముకోలేదు. మీ జగనన్న దేవుడి దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు. నా బలం ఇంటింటికీ మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడుతున్నాను. మీకు మంచి జరిగిందా లేదా అన్నదే కొలమానం.... మీ అందరినీ ఒకటే కోరుతున్నా. వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది ఒక్కటే ప్రామాణికంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడాలని కోరుతున్నాను. ఈ యుద్ధంలో చివరకు ఎప్పుడైనా మంచే గెలుస్తుందని మనసారా నమ్ముతున్నాను. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు ఉండాలని, ప్రజలందరి చల్లని ఆశీస్సులు కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా, తమ్ముడిగా మీ పిల్లలంతా ఇంకా బాగా చదువుకోవాలని, ప్రతి కుటుంబంలోంచి ఒక మంచి ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, సాఫ్ట్వేర్ సీఈవో, ఎకానమిస్ట్, ఎంటర్ప్రెన్యుర్ రావాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మంచి లీడర్ రావాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవుడు ఇంకా మీ అందరికీ మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. చివరిగా... కాసేపటి క్రితం మాదిపాడు వద్ద రూ.60 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్ధాపన చేశాం. దీనివల్ల విజయవాడ, గుంటూరుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా హైదరాబాద్‌కు వెళ్లాలంటే 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ నియోజకవర్గానికి మంచి చేస్తూ... హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజే శంకుస్ధాపన చేశాం. అదే మాదిరిగా అమరావతి – రాజుపాలెం... కీలకమైన రోడ్డును మరో రూ.150 కోట్లతో శంకుస్ధాపన చేసాం. -
ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన పిల్లలు ఉండాలి
సాక్షి, పల్నాడు: వీళ్లు చిన్నారులు వీళ్లకు ఓటు హక్కు లేదు.. పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేది గతం. కానీ, ఇవాళ వాళ్ల జగన్ మామ ప్రభుత్వంలో విద్యాకానుక ఓ పండుగలా జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ప్రజాప్రతినిధులందరూ పిల్లలతో కలిసి ఈ పండుగలో పాల్గొంటుడడం.. ఆ పిల్లల మేనమామగా సంతోషపడుతున్నా: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న విద్యాకానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. సోమవారం పల్నాడు జిల్లా క్రోసూర్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారాయన. ‘‘పాఠశాలలు ప్రారంభమైన రోజే విద్యాకానుక అందిస్తున్నాం. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు విద్యాకానుక కిట్లు ఇస్తున్నాం. కిట్లలో మెరుగైన మార్పులు తెచ్చాం. ప్రతీ విద్యార్థికి మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, షూస్, సాక్సులు అందిస్తున్నాం. నోట్ బుక్స్, వర్క్ బుక్స, బైలింగువల్ పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలతో పాటు బ్యాగు సైజులు పెంచాం. యూనిఫామ్ డిజైన్లోనూ మార్పులు చేశాం అని తెలిపారాయన. ఈ ఒక్క పథకం మీదే ఈ నాలుగు ఏళ్లలో ఈ పిల్లల మేనమామ ప్రభుత్వం అక్షరాల రూ. 3,366 కోట్లు ఖర్చు చేశామని చెప్పడానికి గర్వపడతున్నాం అని సీఎం జగన్ చెప్పారు. ఈ ఏడాది 43.10 లక్షల మంది విద్యార్థులకు 1,042.53 కోట్ల వ్యయంతో విద్యాకానుక అందిస్తున్నాం. ప్రతీ విద్యార్థికి రూ. 2,600 విలువైన కిట్ పంపిణీ అందిస్తున్నామని తెలిపారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితిలో మన విద్యార్థులు ఉండాలి. అందుకే టోఫెల్ పరీక్షలకు సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నాం. ఇందుకోసం అమెరికాకు చెందిన సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. ఇంగ్లీష్ మాట్లాడడంలో మన విద్యార్థుల ప్రతిభ పెరుగుతుందన్నారు సీఎం జగన్. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. బయట తీవ్రమైన ఎండలు ఉన్న కూడా ఏమాత్రం ఖాతరు చేయని చిరునవ్వులతో, ప్రేమానురాగాలు, ఆప్యాయతలు చూపిస్తున్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి సోదరుడికీ, స్నేహితుడికీ, నా చిట్టిపిల్లలకూ హృదయపూర్వక కృతజ్ఞతలు. బడి గంట కంటే ముందే కానుకల గంట... వేసవి సెలవులు అయిన తర్వాత నేటి నుంచి బడి తలుపులు తెరుచుకుంటున్నాయి. బడిగంట మోగకముందే, బడికి వెళ్లే పిల్లలకు ఇవ్వాల్సిన కానుకల గంటను మన ప్రభుత్వం ఈరోజే మోగిస్తుంది. వరుసగా నాలుగో ఏడాది విద్యా కానుక.... ఈ రోజు స్కూళ్లు తెరవగానే పుస్తకాల కోసం, యూనిఫాం వంటి వాటి కోసం ఏ ఒక్కపాప, బాబు వారి తల్లిదండ్రులూ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంలో వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లోనూ ఒకటి నుంచి పదో తరగతివరకూ చదువుతున్న ప్రతి విద్యార్ధికి ప్రభుత్వం ఉచితంగా ఈ విద్యాకానుక కిట్‌ను ఇవ్వనుంది. బట్టల కుట్టుకూలీతో సహా... విద్యాకానుక కిట్. ప్రతి విద్యార్ధికి కుట్టుకూలీతో సహా మూడు జతల యూనిఫాం, ఒక స్కూల్బ్యాగు, బైలింగివల్ టెక్ట్స్‌బుక్(ఒక పేజీ ఇంగ్లిషు ఒక పేజీ తెలుగు), నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, ఒక జత షూ, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు ఇవి కాకుండా పిల్లలందరికీ ఇంగ్లిషు నుంచి తెలుగుకు అనువదించడానికి ఒక మంచి డిక్షనరీ కూడా విద్యాకానుక కిట్ ద్వారా ఇస్తున్నాం. వారికి వసతులు కల్పిస్తూ... బడి తెరిచే సమయానికి వారికి ఇవ్వవలిసినవి ఇస్తూ.. వీటి మీద ధ్యాస పెడుతూ, క్వాలిటీని మరింత మెరుగుపరిచేలా మార్పులు తీసుకువచ్చాం. ఫీడ్ బ్యాక్ ఆధారంగా మరింత మెరుగ్గా... పిల్లలకు యూనిఫాం కింద ఇచ్చే క్లాత్ గతేడాది కంటే ఈ సంవత్సరం ఎక్కువ ఇస్తున్నాం. పిల్లలందరూ చక్కగా కనపించాలని యూనిఫాం డిజైన్‌లో కూడా మెరుగైన మార్పులు తీసుకొచ్చాం. నిరుడు సంవత్సరం వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పుస్తకాల బ్యాగు సైజ్‌ను కూడా పెంచి మెరుగైన బ్యాగు ఇస్తున్నాం. మెరుగైన క్వాలిటీ షూ కూడా ఇస్తున్నాం. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాల నాణ్యతను కూడా పెంచి పిల్లలకిస్తున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యాకానుక కిట్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుంది. చిన్నపిల్లలు ఓటర్లు కాదు వీరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితి గతం. ఒక్కో విద్యార్ధికి రూ.2400 ఖర్చుతో కిట్... కానీ ఈ రోజు ఆ పిల్లలు జగన్ మామయ్య ప్రభుత్వంలో ఏం జరుగుతుందంటే.. విద్యాకానుక పండగ కార్యక్రమంలో ప్రతి స్కూళ్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రజా ప్రతినిధులంతా పాలుపంచుకునే గొప్ప వాతావరణం రాష్ట్రంలో ఉంది. ఆ పిల్లలకు మంచి మేనమామగా సంతోషపడుతున్నాను. ఈ రోజు నుంచి అందిస్తున్న ఈ విద్యాకానుక కిట్స్ కోసం అయ్యే ఖర్చు రూ.1042 కోట్లు. 43.10 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ... ఒక్కో విద్యార్ధికి ఇచ్చే స్కూల్ బ్యాగుతో సహా ఇచ్చే యూనిఫాం, బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్ కలుపుకుని వీటి ఖరీదు రూ.2400 ఖర్చుచేస్తున్నాం. ఆ పిల్లల తల్లులకు అన్నగా సంతోషంగా ఈ ఖర్చు చేస్తున్నాం. ఒక్క విద్యాకానుక కింద ఈ నాలుగేళ్లలో రూ.3366 కోట్లు ఖర్చు చేసింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు.... విద్యావ్యవస్ధలో మన ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి మరికొన్ని విషయాలు మీకు చెప్పాలి.పాఠశాల స్ధాయి నుంచే పేదపిల్లల ఇంగ్లిషు కమ్యూనికేషన్ స్కిల్స్ మరింత మెరుగుపడాలని ఆలోచన చేశాం. మన పిల్లలు ఎక్కడికైనా వెళ్లి ఆ ప్రపంచాన్ని ఏలే పరిస్థితుల్లో మన పిల్లలు ఉండాలి కానీ.. తక్కువగా చూసే పరిస్థితుల్లో ఉండకూడదని ఈ అడుగులు వేశాం. మన పిల్లలకు ఎక్కడైనా ఎదిగేందుకు వీలుగా టోఫెల్ పరీక్షలకు వారిని సిద్ధం చేసే కార్యక్రమం ఈ యేడాది నుంచే మొదలవుతుంది. టోఫెల్ కోసం అమెరికా ఈటీఎస్‌తో ఒప్పందం... ఇందుకోసం ప్రపంచంలోనే ఎంతో పేరున్న అమెరికన్ సంస్ధ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్( ఈటీఎస్ ) ప్రిన్స్టన్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రిన్స్టన్లో టోఫెల్ అనే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ మన పిల్లలకు ఇస్తారు. ఈ టోఫెల్ అనే పరీక్షకు పిల్లలకు తర్ఫీదు ఇస్తూ తయారు చేస్తున్నాం. మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టోఫెల్ ప్రైమరీ, ఆరో తరగతి నుంచి తొమ్మదో తరగతి వరకు టోఫెల్ జూనియర్ పేరుతో పరీక్షలు నిర్వహించి వారికి టోఫెల్ ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇస్తారు. తద్వారా ఇంగ్లిషు వినడమే కాకుండా మాట్లాడడం కూడా వస్తుంది. అది కూడా అమెరికన్ యాక్సెంట్, డైలెక్ట్లో వస్తుంది. వీరికి ఇవన్నీ తీసుకువచ్చే కార్యక్రమంలో ఈ సంవత్సరం టోఫెల్‌ను కూడా ప్రవేశపెడుతున్నాం. ప్రతిభా ఉపాధ్యాయులకు అమెరికాలో ఓరియెంటేషన్... అంతే కాకుండా రాష్ట్ర స్ధాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపించిన ప్రభుత్వ స్కూళ్లలో... ప్రతి జిల్లాలోనూ ఒక ప్రభుత్వ హైస్కూల్, ఒక ప్రైమరీ స్కూల్ వెరసి 26 జిల్లాల్లోని 52 స్కూళ్లకు సంబంధించిన ఇంగ్లిషు టీచర్లను అందరికీ స్ఫూర్తినిస్తూ.. వారికి మెరుగైన ఓరియెంటేషన్ కోసం ప్రోత్సహిస్తూ అమెరికాలోని ప్రిన్స్టన్కు కూడా పంపిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా ఎదగాలని, అంతర్జాతీయంగా కూడా విద్యారంగంలో వస్తున్న మార్పులన్నింటినీ అధ్యయనం చేసి, మారిపోతున్న ప్రపంచంలో చదువులకు సంబంధించిన మార్పుల్లో మన పిల్లలు అందరికన్నా ముందడుగులో ఉండాలని, రాబోయే రోజుల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, లాంగ్వేజ్ లెర్నింగ్ మాడ్యూల్స్, డేటా అనలెటిక్స్ మొదలు చాట్ జీపీటీ వరకూ మన సిలబస్‌లోకి ఎలా అనుసంధానం చేయాలి, వాటిని ఎలా అనుసంధానం చేసి, మన పిల్లలను ముందు వరుసలో నిలబెట్టగలుగుతాము అనేది అధ్యయనం చేసే దిశగా వేగంగా ఆలోచనలు చేస్తున్నాం. విద్యారంగంలో విపరీతమైన మార్పులు కనిపించేటట్లుగా నాలుగేళ్లలో చేశాం. ఇప్పటికే మనబడి నాడు–నేడులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు రూపులు మారి కళ్లముందు కనిపిస్తున్నాయి. బడుల్లో సీబీఎస్ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం తీసుకొచ్చాం. గవర్నమెంట్ స్కూళ్లు మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంగ్లిష్ అని చెప్పడానికి గర్వపడుతున్నాను. గతంలో క్లాస్ టీచర్లే లేని పరిస్థితి నుంచి.. మూడో తరగతి నుంచి ఏకంగా సబ్జెక్టు టీచర్లే ఉండేట్లుగా మన ప్రభుత్వంలో అడుగులు పడ్డాయి. బైజూస్ కంటెంట్‌తో... నాలుగో తరగతి నుంచి మన కరిక్యులమ్ కు అనుసంధానం చేస్తూ పేద పిల్లలందరికీ కూడా బైజూస్ కంటెంట్ తీసుకొచ్చి ఉచితంగా ఇస్తున్నాం. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా స్కూళ్లలో గోరుముద్ద, అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణం అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. 75 శాతం హాజరుకు ముడిపెడుతూ దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో జరిగిస్తూ, జగనన్న అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని బడులకు పంపే తల్లులను ప్రోత్సహిస్తూ ప్రతిఏటా రూ.15 వేలు ఏటా ఇస్తున్నాం. ఒక్క అమ్మ ఒడి అనే కార్యక్రమానికి మాత్రమే రూ.19,674 కోట్లు ఖర్చు చేశాం. 8వ తరగతి పిల్లలకు ఆఫ్‌లైన్‌లో కూడా పని చేసేట్టుగా ప్రీలోడెడ్ బైజూస్ కంటెంట్‌తో పిల్లలకు, టీచర్లకు ట్యాబ్‌లు అందించాం. అక్షరాలా 5,18,740 ట్యాబ్‌లు రూ. 685 కోట్లు ఖర్చు చేసి నిరుడు ఇచ్చాం. మళ్లీ ఈ సంవత్సరం మీ జగన్ మామయ్య పుట్టిన రోజున డిసెంబర్ 21న మళ్లీ 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తాం. డిజిటల్ దిశగా మారుతున్న క్లాస్‌రూములు.. ప్రతి క్లాస్ రూమ్ రూపురేఖలు మారుతున్నాయి. ప్రభుత్వ బడులలో నాడు–నేడు అయిపోయిన స్కూళ్లలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్స్ తీసుకొస్తున్నాం. డిజిటల్ బోధన పిల్లలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి చదువును సులభంగా అర్థమయ్యేట్లు చేస్తున్నాం. తొలిదశలో నాడు నేడు పూర్తయిన దాదాపు 15,750 స్కూళ్లలో 6వ తరగతి, ఆ పైన ఉన్న 30,232 క్లాస్ రూముల్లో డిజిటల్ బోధనను జూలై 12న ప్రారంభిస్తున్నాం. డిజిటల్ బోర్డులు ప్రతి క్లాస్ రూమ్‌లోనూ ఉంటాయి. కాసేపటి క్రితం క్రోసూరు హైస్కూల్లో డిజిటిల్ బోర్డులను కూడా చూశాను.ఈడిజిటల్ బోర్డులు 6వ తరగతి పైన ప్రతి క్లాస్‌రూమ్‌లోనూ ఉంటాయి. 2వ దశలో మరో 22 వేల స్కూళ్లు, మరో 16 వేల యూనిక్ స్కూళ్లలో డిసెంబర్ 21న మరో 31,700 ఐఎఫ్బీ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దీంతో డిసెంబర్ 21కల్లా నాడు–నేడులో ఫేజ్1, ఫేజ్2 పూర్తి చేసుకున్న దాదాపు 33 వేల స్కూల్స్‌లో 6వ తరగతి, ఆపైన క్లాస్ రూములన్నీ కూడా మొత్తం డిజిటల్ బోధన వైపు అడుగులు పడుతాయి. ఆడపిల్లలకు మరింత అండగా.. ఆడ పిల్లలకు మరింత అండగా నిలుస్తూ, బడుల్లో నాడు నేడుతో పాటు టాయిలెట్ల నిర్మాణం, మెయింటెనెన్స్‌పై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా టాయిలెట్ మెయింటినెన్స్, స్కూల్ మెయింటినెన్స్ ఫండ్ తీసుకొచ్చాం. బడికి వెళ్లే ఏ చిట్టి తల్లి కూడా ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో వారి కోసం స్వేచ్ఛ అమలు చేస్తున్నాం. ఇవన్నీ పిల్లల చదువుల కోసం వారు వేసే ప్రతి అడుగునూ నిశితంగా పరిశీలించి సక్సెస్ కావాలని అడుగులు వేయిస్తుంది మీ మేనమామ ప్రభుత్వం. ఉన్నత విద్యలోనూ మార్పులు.. హయ్యర్ ఎడ్యుకేషన్‌లో మార్పులు తెచ్చాం. జగనన్న విద్యాదీవెన ద్వారా కాలేజీ ఫీజు ఎంతైనా సరే.. ఎంత మంది పిల్లలుంటే అంతమందినీ చదివించినా సరే.. సంవత్సరంలో ప్రతి మూడు నెలలకోసారి నేరుగా పిల్లల తల్లుల ఖాతాల్లోకి జగనన్న విద్యా దీవెన ద్వారా నగదు జమ చేస్తున్నాం. ఒక్క జగనన్న విద్యా దీవెన పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పధకంతో ఇప్పటి వరకు మన ప్రభుత్వం రూ.10,636 కోట్లు. ఖర్చు చేసింది. పిల్లలందరూ పెద్ద చదువులు చదివేటప్పుడు భోజనం, వసతి కోసం ఇబ్బంది పడకూడదని, వాళ్ల తల్లిదండ్రులూ అంత కన్నా ఇబ్బంది పడే పరిస్ధితి రావద్దని, ఒక్కో పిల్లాడికిఏడాదికి రూ. 10 నుంచి రూ. 20 వేల వరకు ఖర్చు చేసి జగనన్న వసతి దీవెన తీసుకొచ్చాం. ఇప్పటివరకు ఈ పథకానికి రూ.4,275 కోట్లు ఖర్చు చేశాం. జగనన్న విదేశీ విద్యాదీవెన... మన పిల్లలు దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అగ్రగామి పిల్లలుగా నిలబడాలని తపన, తాయపత్రయంతో టాప్ గ్లోబల్ కాలేజీల్లో ఏ పిల్లాడికి సీటు వచ్చినా రూ.1. 25 కోట్ల వరకూ ఖర్చయినా పర్వాలేదు. మీ జగన్ మామయ్య చదివిస్తాడు. టాప్ 50 యూనివర్సిటీల్లో 213 మంది మన పిల్లలు చదువుతున్నారు. ఇంతవరకు జగనన్న విదేశీ విద్యా దీవెన కోసం రూ.20 కోట్లు ఖర్చు చేశాం. అడుగులు వేగంగా ముందుకు పడుతున్నాయి. కల్యాణమస్తు, షాదీ తోఫా అనే మరో పథకాన్ని తీసుకొచ్చాం. పెళ్లిళ్లు చేసేటప్పుడు వధూవరులకు టెన్త్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీని వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ప్రేరణ అవుతుందని.. ఈ పథకంలో చదువులను ప్రోత్సహించేందుకు అడుగులు ముందుకు వేశాం. ఇలా ఈ నాలుగేళ్లలో కేవలం ఈపథకాలకోసమే విద్యా రంగంలో నాలుగేళ్లలో మనం చేసిన ఖర్చు రూ.60,329 కోట్లు. చదువుల గురించి, ఆ అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా, పిల్లల భవిష్యత్ కోసం ఎంతగా మీ బిడ్డ ఆలోచన చేస్తున్నాడో గమనించాలని ప్రతి చెల్లెమ్మకూ తెలియజేస్తున్నా. తేడాఒక్కసారి గమనించమని కోరుతున్నా. మన హయాంలోనే పులిచింతల... పులిచింతల ప్రాజెక్టు నాన్నగారి స్వప్నం. ఆయన పూర్తి చేస్తే మిగిలిన పోయిన ఆర్ అండ్ ఆర్ కూడా ఇవ్వకుండా 45 టీఎంసీల నీళ్లు నిల్వచేసే కార్యక్రమం చేయకుండా, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మన ప్రభుత్వ హయాంలో రూ.140 కోట్లు కేటాయించి, 45 టీఎంసీల నీళ్లు నింపి, ఆర్ ఆండ్ ఆర్ కార్యక్రమం కూడా పూర్తి చేశాం. ఈ కార్యక్రమం చేస్తూ.. పొరపాటున ఇమాజిగూడెంలో 128 ఇళ్లకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ మిగిలిపోయిందని ఎమ్మెల్యే నా దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని కూడా పూర్తి చేయిస్తాను. ఇది కాకుండా రూ.45 కోట్లతో అచ్చంపేట మండలం తాళ్లచెరువులో లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం అడిగారు. దాన్ని కూడా మంజూరు చేస్తాం. అది కాకుండా మాదిపాడులో ఆర్ ఆండ్ బీ రోడ్డులో పులిచింతల డ్యామ్‌కు కనెక్ట్ చేస్తూ... రూ.3.50 కోట్లు ఖర్చయ్యే రోడ్డును అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాను. ఇంకా సబ్స్టేషన్లు వంటివి అడిగారు. అవసరమైన చోట వాటిని కూడా ఏర్పాటు చేస్తాం. వీటన్నింటి వల్ల ఈ నియోజకవర్గానికి మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు ఇంకా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ.. సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు. ఇదీ చదవండి: ఉద్దానం చెంతకు ఆధునిక వైద్యం -
నిత్య పెళ్లి కొడుకు పాస్‌పోర్టు రద్దు చేయించాలి
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్): నిత్య పెళ్లికొడుకు పాస్‌పోర్టుని వెంటనే రద్దు చేయించాలని బాధితులు, వారి కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక– స్పందన (గ్రీవెన్స్)లో జిల్లా ఎస్పీ కె.ఆరిఫ్ హఫీజ్ దృష్టికి తీసుకువచ్చారు. వరుస వివాహాలతో పలువురి మహిళలను మోసగించిన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అందుకూరు గ్రామానికి చెందిన కె.సతీష్‌బాబు అలియాస్ సత్యకుమార్‌ను గత గురువారం (జూలై 28) గుంటూరు దిశ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సతీష్‌బాబుపై కోర్టులో కేసు జరుగుతుందని, అతనికి బెయిల్ మంజూరు చేస్తే విదేశానికి పారిపోయేందుకు అవకాశం ఉందని గుంటూరు నగరంలోని పాతగుంటూరు, శ్యామలానగర్‌కు చెందిన బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అతనికి బెయిల్ మంజూరు చేయవద్దని, అలాగే పాస్‌పోర్ట్ రద్దు చేయించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అతని వద్ద ఉన్న మరో లాప్‌ట్యాప్‌ను సీజ్ చేయలేదని తెలిపారు. అందులో విమాన టికెట్ ఉందని, ఏమాత్రం అతనికి బెయిల్ మంజూరైన, వెంటనే ఇక్కడి నుంచి పారిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఓ పోలీస్ అధికారి తీరు విమర్శలకు తావిస్తోందని, బాధితుల పక్షాన తెలియజేసే అదనపు సమాచారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. బాధితుల ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించారు. పోలీస్ అధికారిని పిలిచి మాట్లాడారు. (క్లిక్: పడకగదిలో అశ్లీల ఫొటోలు తీసి.. నిత్య పెళ్లికొడుకు లీలలెన్నో..!) -
సీఎం జగన్ పిలుపు.. డాక్టర్ ఔదార్యం
సాక్షి, హైదరాబాద్: ‘రెండేళ్లు ఆగండి. ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తాం. ఇప్పుడున్న స్కూల్‌ను ఫొటో తీసి.. రెండు సంవత్సరాల తర్వాత ఫొటో తీసి నాడు నేడు అని డిస్ప్లే చేస్తాం’ అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో నగరానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ శూలపాణి స్పందించారు. ఆయన స్వగ్రామం గుంటూరు జిల్లా క్రోసూర్ మండలం హస్సానాబాద్ గ్రామంలో సుమారు కోటి రూపాయలు విలువజేసే ఒక ఎకరా 70 సెంట్ల భూమిని ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు విరాళం అందజేసి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన చింతలపాటి సోమయాజి శర్మ, రాజ్యలక్ష్మి దంపతుల కుమారుడు డాక్టర్ చింతలపాటి శూలపాణి. వనస్థలిపురంలో ఆయన రాజ్యలక్ష్మి నర్సింగ్ హోమ్‌ను నిర్వహిస్తున్నారు. తన తండ్రి సోమయాజిశర్మ కొన్నేళ్ల క్రితం మరణించారు. తల్లి రాజ్యలక్ష్మి ఇటీవలే కన్నుమూశారు. డాక్టర్ శూలపాణి చిన్నతనంలో తన స్వగ్రామం హస్సానాబాద్‌లోనే ప్రాథమిక విద్య అభ్యసించారు. 3 సంవత్సరాల క్రితం 5వ తరగతి వరకే ఉన్న ఆ పాఠశాలకు 10వ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని విద్యాశాఖ అనుమతిచ్చింది. దీంతో ప్రాథమిక పాఠశాల తరగతి గదిలోనే పైతరగతులను ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాలకు అదనపు తరగతులు నిర్మించేందుకు స్థలం లేదు. ఇదే క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించింది. పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు కార్యాచరణ చేపట్టింది. డాక్టర్ శూలపాణి తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్వగ్రామంలో ఏదైనా చేయాలని భావిస్తున్న తరుణంలో తనకున్న ఒక ఎకరా 70 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వ పాఠశాలకు ఇచ్చేందుకు అంగీకరించారు. బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాలను విద్యాశాఖ అధికారులకు అందజేశారు. డాక్టర్ శూలపాణి నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. -
వైఎస్ శకం..విద్యకు నవయుగం
సాక్షి,గుంటూరు : ‘ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి. అక్షరజ్ఞానంతో అభివృద్ధి పథంలో పయనించాలి. సమాజంలో చదువుల విప్లవం రావాలి. కార్పొరేట్ స్థాయి విద్య కార్మికుడి బిడ్డకు కూడా అందాలి. ప్రతిభ ముందు పేదరికం తలవంచాలి. ఇంటికో ఇంజినీర్ తయారవ్వాలి.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటాలి’.. ఇది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ఆయన పని చేశారు. ఈ క్రమంలోనే మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రోసూరుకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేశారు. అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి మోడల్ స్కూల్ నిర్మాణానికి సంకల్పించారు. ఎందరో విద్యా కుసుమాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టారు. ఇచ్చిన మాట ప్రకారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2009లో మండల కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మోడల్‌స్కూల్, కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 9 బ్యాచ్‌ల విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసుకున్నారు. అప్పట్లో ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు అందింది. అదే విధంగా పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియంలో బోధన అందించి ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా చదువులు అందించాలన్న కాంక్షతో 2009 లో నిధులు కేటాయించగా 2013 లో భవనాలు పూర్తిచేసుకుని పాఠశాల ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. తరగతికి 80 మంది విద్యార్థులు చొప్పున ప్రతిఏటా 650 మంది విద్యార్థులు చదువులు కొనసాగిస్తున్నారు. బాలికల హాస్టల్, కస్తూర్బాగాంధీ పాఠశాల ద్వారా ఎంతో పేద బాలికలకు చదువుకోగల్గుతున్నారు. అయితే మొత్తం అభివృద్ధిని నేనే చేశానని చెప్పుకునే టీడీపీ నాయకులు ఈ ఐదేళ్ల కాలంలో ఒక్క కొత్త విద్యాసంస్థను నెలకొల్పకపోగా, రేషనలైజేషన్‌లో పేరుతో ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మూసివేశారు. మాలాంటి పేద విద్యార్థులకు వరం నేను మోడల్ స్కూల్లో ఏడో తరగతి నుంచి చదువుతున్నా. ప్రస్తుతం ఇంటర్ రెండో సంవత్సరం. స్థానికంగా కాలేజీ ఉండటం మాలాంటి ఆడపిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రైవేట్ కాలేజీలో వేల రూపాయల ఫీజులు చెల్లించలేం. ఈ ఏడాది నీట్ కోచింగ్ కూడా ఇస్తున్నారు. – వీ వాణి, సీనియర్ ఇంటర్, ఎంపీసీ నాణ్యమైన విద్య.. మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ఎందరో పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి చదువులకు దగ్గరయ్యారు. విద్యార్థుల మెరిట్ కోసం నిరంతం కృషి చేస్తున్నాం. – ఝాన్సీవాణి, మోడల్‌స్కూల్ ప్రిన్స్‌పాల్ -
ఒక్క ఫైర్ ఇంజిన్.. సరిపోతుందా!
సాక్షి, క్రోసూరు: అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు సమయానికి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా కాపాడే అగ్నిమాపక యంత్రం, సిబ్బంది అందుబాటులో ఉంటే ప్రజలకు ఎంతో భరోసా ఉంటుంది. అయితే పెదకూరపాడు నియోజకవర్గంలో ఐదు మండలాలకు కలిపి ఒకే ఫైర్ ఇంజిన్ ఉండటంతో దూరాభారం కారణంగా, రోడ్లు బాగోలేకపోవటం, అందుబాటులోని నీటి సౌకర్యాలతో సమయానికి దూరప్రాంతాలకు చేరుకోలేక, అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఫలితంగా అగ్రిప్రమాద బాధితులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. క్రోసూరు మండల కేంద్రలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డి 2004లో అగ్నిమాపక స్టేషన్ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లి పరిధిలోని సహాయ అగ్నిమాపక అధికారి రామకృష్ణ నేతృత్వంలో ప్రస్తుతం స్టేషన్లో ఒకే ఒక ఇంజిన్‌తో ఇద్దరు డ్రైవర్లు, 13 మంది ఫైర్ మెన్లు పనిచేస్తున్నారు. అగ్నిమాపక శకటం ద్వారా క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండలో అన్ని గ్రామాలు, అమరావతి, పెదకూరపాడు మండలంలో సగం గ్రామాలకు ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు. ఈ ఐదు మండలాల్లో కలిపి 110 గ్రామాలున్నాయి. పెదకూరపాడులో సగం అంటే కనీసం 100 గ్రామాలకు ఈ వాహనాన్నే వినియోగించాలి. అయితే ప్రమాదాలు సంభవించినపుడు సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతున్నట్లు ప్రజలు వాపోతున్నారు. గత ఏడాది 100 ప్రమాదాలకు హాజరైతే ఈ ఏడాది ఇంకా ప్రమాదాలు సంభవించలేదు. మండలానికి ఒక ఫైరఇంజిన్ ఏది ఏమైనప్పటికీ భానుడు తీవ్రతకు స్లాబ్ గృహాలే మండిపోతున్నందున పూరిళ్లు, పూరి పాకలు, చిన్నచిన్న షెడ్డులు, నిత్యం పొయ్యి మంటలతో వ్యాపారాలు నిర్వహించే వ్యాపార సంస్థలు, వంటగ్యాస్ ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మండలానికి ఒక ఫైర్ ఇంజిన్ అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. కనీసం రెండు మండలాలకైనా.. పేదల ఆస్తిపాస్తులు, గడ్డివాములకు వేసవిలో అగ్నిప్రమాదాలు సంభవించి కట్టుబట్టలతో బయట పడిన కుటుంబాలకు తూతూ మంత్రంగా రేషన్ ఇచ్చి, ఐదు వేల నగదు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. ఇది చాలా దారుణం. ప్రమాదాల నుంచి కాపాడే వ్యవస్థలను బలోపేతం చేయాల్సి ఉండి కూడా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవరించడం శోచనీయం. వేసవి కాలంలో అగ్నిప్రమాదాలు సంభవించినపుడు, తక్షణమే ఆదుకునేందుకు కనీసం రెండు మండలాలకు ఒక అగ్నిమాపక శకటం అయినా ఏర్పాటు చేయాలి. కాల్వపల్లి ఏసురెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం కార్యదర్శి, క్రోసూరు -
గ్యాస్ లీకై నవ వధువు సజీవదహనం
క్రోసూరు (గుంటూరు జిల్లా) : వంట గ్యాస్ లీకై సంభవించిన అగ్నిప్రమాదంలో ఓ నవ వధువు సజీవ దహనమైన ఘటన గుంటూరు జిల్లా క్రోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానిక మార్కెట్ యార్డు వెనుకభాగంలో ఉన్న ఎస్టీ కాలనీలో ఈ ఘోరం చోటుచేసుకుంది. రేఖమణి వెంకటకృష్ణ, ఆదెమ్మ దంపతుల కుమార్తె లావణ్య (19)ను నరసరావుపేట ప్రాంతానికి చెందిన వనపర్తి మస్తాన్‌కు ఇచ్చి గత నెల 29న వివాహం చేశారు. అల్లుడిని కూడా తమ ఇంటి వద్దే ఉంచుకుని వ్యాపారం చేయించాలనే యోచనలో వెంకటకృష్ణ దంపతులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం నవదంపతులు ఇక్కడి వచ్చారు. ఆదివారం ఉదయం లావణ్య దంపతులు పాలప్యాకెట్ కోసం బజారుకెళ్లారు. ముందుగా లావణ్య ఇంటికి వచ్చి టీ పెట్టేందుకు వరండాలోని గ్యాస్ స్టవ్ వెలిగించింది. అప్పటికే వంటగ్యాస్ లీకై ఉండడంతో ఒక్కసారిగా మంటలు అంటుకుని చుట్టుముట్టాయి. దీంతో భయాందోళన చెందిన ఆమె ఇంట్లోకి వెళ్లింది. క్షణాల్లో మంటలు పెద్దవి కావడంతో ఆ మంటల్లో చిక్కుకుని లావణ్య సజీవ దహనమైంది. ప్రమాదంలో పక్కనే ఉన్న మూడు పూరిళ్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. వ్యాపారనిమిత్తం పక్క గ్రామం వెళ్లిన లావణ్య తల్లిదండ్రులు, సోదరుడు ఇంటికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనాస్థలానికి సత్తెనపల్లి సీఐ కోటేశ్వరరావు, అచ్చంపేట ఎస్ఐ రాజేశ్వరరావు చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తహశీల్దార్ జేఏ ప్రసూన బాధిత కుటుంబాలకు 20 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, ఐదు వేలు ఆర్థిక సహాయం అందజేశారు. -
మామను అంతమొందించిన అల్లుడు
క్రోసూరు: గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో ఘోరం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కిరాయి ముఠాతో పిల్లను ఇచ్చిన మామను హత్య చేయించాడు. ఆదివారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఎస్ఐ బ్రహ్మం కథనం మేరకు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం దొంగగామపాడు గ్రామానికి చెందిన వెంకటకృష్ణయ్య (63)కు ఐదుగురు కుమార్తెలు. నాలుగో కుమార్తెను క్రోసూరు మండలం విప్పర్ల గ్రామానికి చెందిన అంకమరావు వివాహం చేసుకున్నాడు. అయితే, వీరికి సంతానం లేకపోయేసరికి ఐదో కుమార్తెను కూడా తనకిచ్చి చేయాలని ఏడాదిగా అంకమరావు ఒత్తిడి చేస్తున్నప్పటికీ మామ ఒప్పుకోవడం లేదు. వెంకటకృష్ణయ్య కుటుంబం కూడా విప్పర్లకు వచ్చి అంకమరావుతోనే కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో అంకమరావు కిరాయిముఠాతో మామను హత్య చేయించేందుకు పథకం వేశాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి 12 మంది వ్యక్తులు వచ్చి కృష్ణయ్యను ఇంట్లో నుంచి బయటకు ఈడ్చి తీవ్రంగా కొట్టి చంపారు. అనంతరం అంకమరావుతోపాటు వారందరూ పరారయ్యాడు. క్రోసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.