
మృతి చెందిన ఏంజలీనా
కర్నూలు: మేనమామ మరణం జీర్ణించుకోలేని ఓ బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని అబ్బాస్‌నగర్‌లో నివాసముంటున్న ఎడ్వర్డ్ క్రిస్టఫర్ ఇంగ్లిష్ దినపత్రికలో ఏడీవీటీ ఇన్‌చార్జ్‌గా పనిచేసేవాడు. ఈయన భార్య ఎనిమిదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తె బ్లెస్సీ ఏంజలీనా (19) కర్నూలు శివారులోని ఓ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
నందికొట్కూరుకు చెందిన ప్రభాకర్ (ఏంజలీనా మేనమామ) ఆకస్మికంగా మృతి చెందడంతో తండ్రితో కలసి అంత్యక్రియలకు వెళ్లి గురువారం సాయంత్రం కర్నూలుకు చేరుకున్నారు. అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వంట గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. గమనించిన సోదరుడు డేవిడ్ స్టాన్లీ వెంటనే కిందికి దించి ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment