మృతదేçహాన్ని తీసుకువెళ్తున్న బంధువులు...ఇన్‌సెట్లో మానస ఫైల్ ఫోటో
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరు పట్టణానికి సరఫరా చేసే మంచినీటి బావిలో దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని జగ్జీవన్‌రాంకాలనీకి జగ్జీవన్ రాం కాలనీ చెందిన రాములు, వెంకటమ్మలకు నలుగురు కూతుళ్లు. గురువారం సాయంత్రం ఇంట్లో చేసుకునే పని విషయంలో అక్కాచెల్లెళ్ల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన నాలుగో కుమార్తె మానస(15) రాత్రి 7 గంటల సమయంలో అమ్మాయి ఇంటి నుంచి పరుగెడుతూ పక్కనే ఉన్న మున్సిపల్ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటన స్థలాన్ని టూటౌన్ ఎస్‌ఐ మురళి, తహసీల్దార్ ప్రభాకర్, డీఎఫ్‌ఓ శ్రీనివాస్ పరిశీలించారు.
65 అడుగుల లోతు..
పట్టణానికి మంచినీరు సరఫరా చేసే బావి లోతు 65 అడుగులు ఉంటుంది. బాలిక బావిలో దూ కిన సమయంలో 30 అడుగులలో మంచినీళ్లు ఉన్నాయి. బాలిక బావిలో దూకిన వెంటనే మృతిచెంది బావి అడుగుకు చేరింది. అయితే మొదట స్థానిక యువకులు బావిలో దూకి వెతికినా ఆచూకీ లభించలేదు. అప్పటికే బాలిక బావిలో దూకిం దని స్థానికులు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం తో వారు అక్కడికి చేరుకున్నారు. అప్ప టికే బావికి సరఫరా అవుతున్న నీటిని బంద్ చేయడంతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది బావిలో ఉన్న నీటిని బయటకు ఎత్తిపోశారు. అనంతరం అగి ్నమాపక సిబ్బంది రాత్రి 7.30 నుంచి దాదాపు 9.30గంటల వరకు 2 గంటలపాటు శ్రమించి బావిలో మృతదేహం వెలికితీశారు.
కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు..
గొడవ జరిగిన తర్వాత బాలిక రోడ్డు వైపు వెళ్లిందని కొందరు.. బావిలో దూకిందని మరికొందరు చర్చించుకుంటున్నారు. అయితే బాలిక ఎక్కడ వెళ్లింది అనే విషయం గందరగోళం నెలకొనడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. చివరికి బాలిక బావిలో పడి మృతిచెందిందని తెలియడంతో తల్లిదండ్రులు, అక్కలు అక్కడికి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. మృతదేహాన్ని బావిలో నుంచి తీసిన తర్వాత ప్రాణం ఉందనే ఆశతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం గదిలో పెట్టకుండా కుటుంబ సభ్యులు పోలీసులకు అడ్డుచెప్పారు.
స్థానికుల ఆందోళన..
బస్టాండ్‌కు సమీపంలో ఉన్న మంచినీటి బావికి ఇనుప కంచె ఏర్పాటు చే యాలని ఎన్నోసార్లు క మిషనర్, కలెక్టర్‌కు ఫి ర్యాదు చేసినా ఏర్పాటు చేయకపోవడం వల్లే నష్టం జరిగిందని స్థా నికులు ఆరోపించారు. 65 అడుగుల బావి చుట్టూ ఎలాంటి రక్షణ చర్యలు లేవు. బావిపైన, చుట్టూ ఇనుప కంచె ఏర్పా టు చేస్తే ఇంతటి ఘోరం జరిగేది కాదని వాపోయా రు. జిల్లా ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment