
సేలం: తూత్తుకుడి సమీపం శంకరరాజపురం గ్రామానికి చెందిన ఆనంది కుమార్తె సబీష్టా (14)కు పుష్పవతి వేడుకలను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సబీష్టా మేనమామలు భవిత్‌కుమార్, సూర్య మేళతాళాల హోరు, బాణాసంచాల మోత, వెలుగుల మధ్య 350 పళ్లాలలో బంగారు నగలతోపాటు పూలు. పండ్లు, పలు రకాల స్వీట్లు, దుస్తులు, అలంకరణ సామగ్రి మొదలైనవి సారెగా ఇచ్చేందుకు కంటైనర్ లారీలో తీసుకురావడం స్థానికులకు ఆశ్చర్యాన్ని కలిగించింది.