
కాపురానికి పిలవలేదని.. ఏడుగురి సజీవదహనం
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలో ఓ దారుణం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఇదంతా చేసినది ఆ ఇంటి కోడలే! తన భర్త తనను చాలా కాలంగా కాపురానికి పిలవడం లేదనే కోపంతోనే ఆమె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు తెలిసింది. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఆమె తన భర్త, అత్త మామలు నివసిస్తున్న ఇంటికి నిప్పుంటించింది.
దాంతో భర్త, అత్తమామలతో పాటు ఏడుగురు సజీవదహనమయ్యారు. అంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అనంతరం ఆమె స్వయంగా వెళ్లి, పోలీసుల ఎదుట లొంగిపోయింది. అయితే భార్యాభర్తల మధ్య ఇంతకుముందు ఎలాంటి గొడవలు జరిగాయో, ఎందుకు ఆమె ఇంతటి దారుణానికి ఒడిగట్టిందోననే విషయాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.