ఎక్కడ దాక్కున్నావయ్యా... Uncle Sam? | short story about english relationship | Sakshi
Sakshi News home page

ఎక్కడ దాక్కున్నావయ్యా... Uncle Sam?

Published Sun, Dec 22 2013 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM

ఎక్కడ దాక్కున్నావయ్యా... Uncle Sam?

ఎక్కడ దాక్కున్నావయ్యా... Uncle Sam?

భాషణం
 అమ్మ తమ్ముణ్ణి మామయ్య అంటాం. నాన్న తమ్ముణ్ణి బాబాయ్ అంటాం. ఇంగ్లిష్‌లో అయితే ఈ మామయ్య,  బాబాయ్ తదితరులంతా uncle (అంకుల్) అనే మాట కిందికే వచ్చేస్తారు. అత్త భర్త కూడా అంకులే. అందుకే ఇంగ్లిష్‌లో ఠఛ్ఛి అనగానే ఏ వరుస అంకులో తెలియదు. వీళ్లు కాక, మనకు తెలియని uncles ఇంగ్లిష్‌లో కొంతమంది ఉన్నారు. ఈవారం వారిని పరిచయం చేసుకుందాం.
 
 Uncle Sam అనే మాట వినే ఉంటారు. అమెరికా దేశాన్ని, అమెరికా ప్రభుత్వాన్ని అంకుల్ శామ్ అంటారు. ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య చిత్రకారులు తమ కార్టూన్‌లలో అమెరికా దేశానికి, లేదా ఆ దేశ ప్రభుత్వానికి ప్రతీకాత్మకంగా (సింబాలిక్‌గా) ‘అంకుల్ శామ్’ బొమ్మను గీస్తారు. రివటలా ఉండే బక్కపలుచని దేహం, నెరిసిన గెడ్డం, పొడవాటి టోపీ... ఇదీ అంకుల్ శామ్ అవతారం. అసలు అమెరికాకు అంకుల్ శామ్ అనే పేరు ఎలా వచ్చింది?
 
 1812 అమెరికా-బ్రిటన్‌ల మధ్య యుద్ధం  సమయంలో న్యూయార్క్‌లోని ట్రాయ్ ప్రాంతంలో నివసించే Samuel Wilson   నడుపుతున్న సంస్థ నుండి అమెరికన్ సైనికులకు చక్కగా ప్యాక్ చేసిన మాంసాహార పదార్థాలు అందుతుండేవి. అప్పట్లో ప్యాకింగ్ మీద విధిగా కాంట్రాక్టర్ పేరు, వాటిని ఏ దేశానికైతే పంపిస్తున్నారో ఆ దేశం పేరు ముద్రించి ఉండేది. గిజీson ప్యాకింగ్ కంపెనీ నుంచి బట్వాడా అయ్యే  ప్యాకింగ్‌ల మీద E.A-US అని ఉండేది. ఓరోజు కొత్తగా ప్యాకింగ్ పనిలో చేరిన ఓ కుర్రాడు ఈ అక్షరాలకు అర్థం ఏమిటి అని అడిగినప్పుడు తోటి కార్మికుడు ఉ.అ అంటే Elbert Anderson (కాంట్రాక్టర్ పేరు) అని చెప్పి, ఇక ్ఖ అంటే (యునెటైడ్ స్టేట్స్ అని చెప్పకుండా) తమ యజమాని Samuel Wilson ° ఉద్దేశించిమన Uncle Sam అని జోక్ చేశాడట! అప్పట్నుంచీ అంకుల్ శామ్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని ఒక అభిప్రాయం.
   
 Uncle Sam లాగే Uncle Tom అని ఇంకొకాయన  ఉన్నాడు! అంకుల్ టామ్ అంటే నల్లబానిస అని అర్థం. తెల్లవారి అడుగులకు మడుగులు ఒత్తుతూ అతివినయం ప్రదర్శిస్తుండే వ్యక్తిని తృణీకార భావంతో అంకుల్ టామ్ అని అంటారు.
   
 ఇక Dutch uncle అంటే  అస్తమానం సలహాలు ఇస్తుండే పెద్దమనిషి. అవతలి వాళ్ల ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోడు ఆయన. ఈ వాక్యం చూడండి. He acts more like a Dutch uncle than a husband. ఆయనెవరో భర్తలా కాకుండా డచ్ అంకుల్‌లా భార్యతో వ్యవహరిస్తున్నాడని.
 Everybody and his uncle అని ఇంకో ఎక్స్‌ప్రెషన్ ఉంది. అంటే lots of people అని అర్థం. మన వాడుకలో ‘పిల్లజెల్లా అంతా...’ అని. (The state fair was packed. Everybody and his uncle was there). Everybody and his brother అని కూడా అనొచ్చు.
 ఇలాంటివే uncle అనే మాటతో వచ్చే చిత్రమైన వ్యక్తీకరణలు మరో రెండు ఉన్నాయి.
 1. Bob's your Uncle! (బ్రిటన్, ఆస్ట్రేలియాల మాడలికం). 2. I'll be monkey's uncle!(ఓల్డ్ ఇంగ్లిష్).
 ఒక పనిని ఎలా చేయాలో వివరంగా చెప్పడం పూర్తి చేశాక, ‘అంతే, సింపుల్’ అని అనడాన్ని ఇంగ్లిష్‌లో Bob's your Uncle అంటారు.
 అలాగే I'll be monkey's uncle అంటే ‘ఎంత ఆశ్చర్యపోయానో తెలుసా?’ అని చెప్పడం. గ్ఛి, I'll be a monkey's uncle. I never thought Anirudh would remarry.
 
 say uncle
 దీనర్థం... ఓడిపోయానని ఒప్పుకోవడం. to admit failure. ఇట y uncle అన్నా, holler uncle అన్నా కూడా ఇదే అర్థం. holler అంటే పెద్దగా అరవడం, cry  అంటే తెలిసిందే... గీ పెట్టడం. ఈ వాడుకలన్నీ చిన్న పిల్లల ఆటల్లోంచి వచ్చినవే. ఒప్పుకో, (say uncle)  ఒప్పుకున్నానని (say uncle అని) చెబితే తప్ప నిన్ను కదలనివ్వను అని చెప్పడమన్నమాట. ప్రధానంగా ఇది అమెరికన్ యూసేజ్. ఉదా: I'm deter-mined to show them I can be a star. I'm not going to say uncle.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement