babai
-
ఆస్తిలో వాటా ఇవ్వలేదని వెంటాడి మరీ యువకుడి ప్రాణం తీసిన బాబాయ్
ఇచ్చోడ: భూవివాదంలో సొంత బాబాయ్ తన కుమారుడితో కలిసి యువకుడిని హత్య చేసిన సంఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. మూడెళ్లుగా అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న భూ వివాదమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని సాథ్‌నంబర్ గ్రామానికి చెందిన వానోలే కేదోబ, పాండురంగ్‌లు అన్నదమ్ములు. కేదోబ ఐటీడీఏ ఉపాధ్యాయుడిగా పనిచేసి నాలుగేళ్ల కిందట పదవీ విరమణ పొందాడు. పాండురంగ్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తూ రెండు నెలల కిందట గుండెపోటు రావడంతో ఫిట్నెస్ లేక డ్యూటీకి వెళ్లడం లేదు. ఇద్దరు అన్నదమ్ములకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి సాథ్‌నంబర్‌లోని జాతీయ రహదారికి ఆనుకొని ఉంది. ఈ భూమి తల్లి పేరు మీద పట్టా ఉంది. కానీ గత సంవత్సరం కిందట పాండురంగ్‌కు తెలియకుండానే కేదోబ కుమారుడు ఈశ్వర్ (29) తన తండ్రి కేదోబ పేరిట ఎకరం, కేదోబ చెల్లెలు పేరిట మరో ఎకరం, తన పేరిటా ఎకరం ఇలా నాలుగు ఎకరాల భూమిని విరాసత్ ద్వారా పట్టాలు చేసుకున్నాడు. వారసత్వంగా వచ్చే భూమిలో వాటా ఇవ్వకుండా పట్టా చేసుకోవడంపై ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ప్రారంభమైంది. ప్రస్తుతం భూ వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ విషయంపై చాలసార్లు కుల పెద్దల మధ్య పంచాయితీ కూడా నిర్వహించారు. నెలరోజుల క్రితం ఈశ్వర్ తన తండ్రి కేదోబ పేర్ల మీద ఉన్న భూమిని కోటి రూపాయలకు విక్రయించినట్లు ప్రచారంలో ఉంది. తన వాటా దక్కకుండా భూ వివాదం కోర్టులో ఉండగా విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పాండురంగ్ ఈశ్వర్‌పై పగా పెంచుకున్నాడు. మంగళవారం ఉదయం 8గంటల ప్రాంతంలో పాండురంగ్ తన కుమారుడు సూర్యకాంత్‌ను తీసుకొని సాథ్‌నంబర్ నుంచి ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తాలో ఈశ్వర్ కోసం కాపు కాశాడు. టీచర్స్‌కాలనీలో నివాసముండే ఈశ్వర్ ఉదయం 9గంటల ప్రాంతంలో ఇంటి నుంచి నడుచుకుంటూ సిరిచెల్మ చౌరస్తాలో పాన్‌టేలకు వెళ్లాడు. అక్కడ సమీపంలోని పాండురంగ్, సూర్యకాంత్‌లు ఈశ్వర్‌పై దాడికి ప్రయత్నించారు. దీంతో ఈశ్వర్ తప్పించుకునే క్రమంలో సిరిచెల్మ రోడ్డులోని ప్రభుత్వ ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. పాండురంగ్, సూర్యకాంత్ వెంబడించి సాయిసామత్ ప్రైవేట్ కళాశాల ఎదుట ఈశ్వర్‌ను పట్టుకొని గొడ్డలితో నరికి కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్, ఎస్సై నరేష్ తెలిపారు. -
బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14). పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. -
నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేశ్ శివన్ బాబాయ్
దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతారలపై ఆస్తి అపహరణ కేసు నమోదు అయ్యింది. ఆరేళ్ల క్రితం ప్రేమలో పడి, సహజీవనం చేస్తూ గత రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న సంచలన జంట నయనతార, విఘ్నేష్ శివన్. సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో నయనతార నటిగా రానిస్తూ.. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నా వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ జంట సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం కూడా వివాదంగా మారింది. (ఇదీ చదవండి; 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) తాజాగా వీళ్లకు మరో సమస్య ఎదురైంది. విఘ్నేశ్ శివన్ పూర్వీకం తిరుచ్చి జిల్లా, లాల్‌కుడి గ్రామం ఈయన తండ్రి పేరు శివకొళుదు. వీళ్లు తొమ్మిది మంది అన్నదమ్ములు. పోలీస్ ఇన్ఫార్మర్గా పనిచేసిన విఘ్నేష్ శివన్ తండ్రి శివకొళుదు ఇప్పుడు లేరు. అయితే ఈయన జీవించి ఉండగా తమ ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు తెలియకుండా మోసపూరితంగా అపహరించినట్లు ఆయన సోదరుడు మాణిక్యం కోయంబత్తూర్‌లో నివసిస్తున్న మరో సోదరుడు కుంచిత పాదం గురువారం తిరిచ్చి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. (ఇదీ చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అందులో మాణిక్యం పేర్కొంటూ తమ సోదరుడు విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు తెలియకుండా వేరే వారికి విక్రయించి మోసానికి పాల్పడ్డాడని, తమ ఆస్తిని కొనుగోలు చేసిన వారికి డబ్బును తిరిగి ఇచ్చి, ఆస్తిని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా తమ సోదరుడు కుమారుడు విఘ్నేశ్ శివన్ అతని తల్లి మీనాకుమారి, సోదరి ఐశ్వర్య, భార్య నయనతారలపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తిరుచ్చి డీఎస్పీ ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది నటి నయనతారకు కూడా తలనొప్పిగా మారింది. -
పిన్నితో వివాహేతర సంబంధం..!
సాక్షి, తలకొండపల్లి(కల్వకుర్తి): వరుసకు పిన్ని అయ్యే మహిళతో వివాహేతర సంబంధం నెరిపాడు. విషయం తెలుసుకున్న పెద్దలు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అయినా, వారు మారలేదు. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్నాన్న వరసయ్యే వ్యక్తిని చంపేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం చేసి విఫలమయ్యాడు. చివరకు ఇద్దరూ కటకటాలపాలయ్యారు. కేసు వివరాలను శనివారం స్థానిక ఠాణాలో ఎస్ఐ సురేష్‌యాదవ్ కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధి సంఘాయిపల్లికి చెందిన మీసాల మల్లేశ్ (26) స్థానికంగా ఉపాధి లేకపోవడంతో ఐదేళ్ల క్రితం నగరానికి వలస వెళ్లి మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి నాగర్‌కర్నూల్ జిల్లా సిద్దాపూర్ మండలంలోని పలుగు తండాకు చెందిన సోనీతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొన్ని రోజుల తర్వాత వీరు కులాంతర వివాహం చేసుకున్నారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, మల్లేశ్‌కు సమీప బంధువైన (వరుసకు కుమారుడు) మెదక్‌పల్లికి చెందిన మీసాల లాలయ్య అలియాస్ లాలూ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఇతను తరచూ నగరంలో ఉంటున్న మల్లేశ్ ఇంటికి వెళ్తుండేవారు. వరసకు చిన్నమ్మ అయినా సోనీతో ఇతడు పరిహాసమాడుతుండేవాడు. కుమారుడే కదా అని మల్లేశ్ పట్టించుకునేవాడు కాదు. ఈక్రమంలో సోనీ, లాలూకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం బంధువులకు తెలియడంతో మల్లేశ్‌కు చెప్పారు. దీంతో ఆయన బంధువుల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. తీరు మార్చుకోవాలని పెద్దలు సోనీ, లాలూకు సూచించినా ఫలితం కనిపించలేదు. తమ బంధానికి అడ్డుగా ఉన్న మల్లేశ్‌ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లాలూ, సోనీ నిర్ణయించుకొని అదను కోసం వేచి చూస్తున్నారు. ఇదిలా ఉండగా, మల్లేశ్ పొలానికి సంబంధించి రైతుబంధు డబ్బుల కోసం ఈనెల 4న స్వగ్రామానికి వచ్చాడు. ఈ విషయాన్ని సోనీ ఫోన్ చేసి లాలూకు చెప్పింది. మరుసటి రోజు లాలూ తలకొండపల్లికి వచ్చాడు. అతడు మల్లేశ్‌కు ఫోన్ చేసి మద్యం తాగుదామని చెప్పాడు. అనంతరం చంద్రధన గ్రామానికి రప్పించుకున్నాడు. ఇద్దరూ తలకొండపల్లికి బైకుపై వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకున్న తర్వాత లాలూ మల్లేశ్‌ను వైన్స్ వద్దే ఉంచి ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లి ఎలుకలను చంపే మందును తీసుకున్నాడు. అనంతరం మల్లేశ్‌ను బైక్‌పై ఎక్కించుకొని మిడ్జిల్ రోడ్డులో వెళ్లాడు. మధ్యలో సంఘాయిపల్లి గ్రామస్తులు అంజనేయులు, నర్సింలు, నరేష్‌లు ఎదురవడంతో లాలూ మల్లేశ్‌ను హత్య చేయడం విరమించుకున్నాడు. అనంతరం అందరూ కలిసి మద్యం తాగి వెళ్లిపోయారు. ఈనెల 7న లాలూ తిరిగి పథకం అమలు చేద్దామని భావించాడు. మల్లేశ్‌కు ఫోన్ చేసి సంఘాయిపల్లి గేట్ వద్దకు రమ్మని చెప్పాడు. మల్లేశ్ అక్కడికి వెళ్లగా బైకుపై ఎక్కించుకొని మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ వెళ్లారు. అక్కడ మద్యం తీసుకొని తాగారు. పథకం ప్రకారం లాలూ మల్లేశ్‌కు ఎక్కువగా మద్యం తాగించాడు. తర్వాత మండల పరిధిలోని దేవునిపడకల్ శివారులోని రిజర్వు ఫారెస్టులోకి తీసుకెళ్లి మళ్లీ మరికొంత మద్యం తాగారు. లాస్ట్ పెగ్‌లో లాలూ ఎలుకల మందును కలిపి మల్లేశ్‌తో తాగించారు. దీంతో అస్వస్థతకు గురై మృతిచెందాడు. అనంతరం లాలూ మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి స్వగ్రామానికి వెళ్లాడు. 11న హత్య విషయం వెలుగుచూసింది. ఎస్ఐ సురేష్‌యాదవ్ కేసు దర్యాప్తు చేశారు. మల్లేశ్ హత్యకు గురయ్యాడని అనుమానం వ్యక్తం చేశాడు. సీఐ నర్సింహారెడ్డి, ఎస్ఐ సురేశ్‌యాదవ్ ఆధ్వర్యంలో విచారణ జరిపి హత్యగా నిర్ధారించారు. ఈమేరకు లాలూ, సోనీని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయగా హత్య విషయం అంగీకరించడంతో రిమాండుకు పంపారు. లాలూ (20)కు ఇంకా వివాహం కాలేదు. హత్య కేసును చాకచక్యంగా పరిష్కరించిన సీఐ, ఎస్ఐకి డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఈ సందర్భంగా రివార్డు ప్రకటించారు. -
చిన్నాన్నపై కత్తితో దాడి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు , చేజర్ల: కుటుంబ వివాదం నేపథ్యంలో చిన్నాన్నపై అన్నకుమారుడు కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మడపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఏఎస్సై రమేష్‌బాబు కథనం మేరకు.. మడపల్లి గ్రామానికి చెందిన జువ్విగుంట పెంచల కొండయ్య మద్యానికి బానిసవగా, సంసారాన్ని నాశనం చేసుకోవద్దని అన్న జువ్విగుంట రమణయ్య తరచూ మందలిస్తుండేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మడపల్లి బస్టాండ్ సెంటర్లో పెంచలకొండయ్య మద్యం సేవించి ఉండగా అన్న మందలించడంతో దుర్భాషలాడాడు. ఈ విషయం తెలుసుకున్న రమణయ్య కుమారుడు జువ్విగుంట బాబు బస్టాండ్ సెంటర్‌కు చేరుకుని చిన్నాన్నపై చాకుతో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలవగా పెంచలకొండయ్యను బంధువులు ద్విచక్ర వాహనంపై పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న కొండయ్యను ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా బాబును అరెస్ట్ చేసే వరకు తాను స్టేషన్ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకుని కూర్చున్నాడు. గంట సేపు నచ్చజెప్పిన పోలీసులు అతికష్టం మీద పోలీసు జీపులో పొదలకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాబాయే... కాలయముడు
ఖమ్మం క్రైం/ గూడూరు : వరుసకు బాబాయి అయిన వ్యక్తే ఆ బాలుడి పాలిట కాలయముడయ్యాడు. ముక్కు పచ్చలారని బాలుడిని అతి కిరాతకంగా మెడకు బెల్టు బిగించి చనిపోయేంతవరకు అదిమిపట్టి..కొట్టి దారుణంగా హత్య చేశాడు. గూడూరు మండలం గంటలమ్మపాలెంకు చెందిన చండిక కిషోర్‌కుమార్, కోమలాదేవి దంపతులు హైదరాబాద్‌లోని చింతల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కోమలాదేవి చెల్లెలు దేవిసాయి ఖమ్మంలో నివసిస్తోంది. ఆమెకు 15వ తేదీన శస్త్రచికిత్స నిర్వహించాల్సి ఉండటంతో పరిచర్యల కోసం కోమలాదేవి తన నాలుగేళ్ల కుమారుడు నిషాంత్‌తో కలిసి ఖమ్మంలోని ఆస్పత్రికి వెళ్లింది. అయితే నిషాంత్ సాయివర్మ(4) అలియాస్ వడ్డీ ఈనెల 11న కిడ్నాప్‌నకు, అదే రోజు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ మృతదేహం 14వ తేదీన నగర శివార్లలో లభించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటన రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలతో బాలుడి బాబాయే హత్య చేశాడని ఎస్పీ ఏవీ.రంగనాథ్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నిషాంత్ తల్లి కోమలాదేవి ఆస్పత్రిలో ఉన్న తన చెల్లి దేవిసాయిని పలకరించేందుకు బాలుడిని తీసుకుని ఖమ్మం వచ్చింది. అయితే అప్పటికే దేవిసాయికి, ఆమె భర్త మధుకు మధ్య కుటుంబ పరంగా తగాదాలున్నాయి. తన భార్య తనతో సఖ్యతగా ఉండడం లేదని.. దీనికి ఆమె అక్కే కారణమని భావించాడు. భార్యపై ఉన్న కోపంతో నిషాంత్సాయివర్మను హత్య చేయాలన్న ఉద్దేశంతో ఉన్న మధు.. తన కారులో ఆస్పత్రి నుంచి అతని తల్లికి తెలియకుండా బయటకు తీసుకెళ్లాడు. టూటౌన్ పోలీసు స్టేషన్ సమీపం నుంచి బాలపేట బైపాస్ రోడ్డు పొదల్లోకి తీసుకెళ్లాడు. బాలుడిని కారులోనే బెల్టుతో మెడకు బిగించి గట్టిగా లాగడంతో పాటు బాగా కొట్టి గొంతు నులిమాడు. దీంతో బాలుడు చనిపోయాడు. మృతదేహాన్ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లో పడేసి వెళ్లిన మధు.. ఆ తర్వాత తన మీదకు అనుమానం వస్తుందన్న ఉద్దేశంతో అతని మిత్రుడు కిషోర్, బాలాజీ అనే డ్రైవర్ సహకారంతో బాలుడి మృతదేహాన్ని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించి పాతిపెట్టాలని ప్రయత్నించాడు. ఇందుకోసం వారికి రూ.1.50 లక్షలు ముట్ట జెప్పాడు. బాలుడి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసుల నిఘా ఎక్కువ ఉండడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 14న బాలపేట ముళ్ల పొదల్లో బాలుడి మృతదేహం బయట పడింది. ఈ సందర్భంగా వారం రోజుల్లో ఈ కేసును చేధిస్తామని చెప్పిన పోలీసులకు అస్పత్రి వద్ద ఉన్న సీసీ కెమెరా, వైరా రోడ్డులో ఉన్న మరో సీసీ కెమెరా నిందితుడిని పట్టించాయి. మధు.. నిషాంత్‌ను కారులో తీసుకెళ్తుండగా ఆస్పత్రి సీసీ కెమెరాలో నిక్షిప్తం కావడంతో పాటు వైరా రోడ్డులోని కెమెరాలో అతని కారు వెళ్తుండడం నిక్షిప్తమైంది. దీని ఆధారంగా పోలీసులు అతన్ని విచారించడంతో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మధుతో పాటు అతని మిత్రుడు కిషోర్‌ను అరెస్టు చేశామని, మరో నిందితుడు డ్రైవర్ పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించిన ఖమ్మం డీఎస్పీ బాలకిషన్, టూటౌన్ సీఐ సారంగపాణి, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
ఎక్కడ దాక్కున్నావయ్యా... Uncle Sam?
భాషణం అమ్మ తమ్ముణ్ణి మామయ్య అంటాం. నాన్న తమ్ముణ్ణి బాబాయ్ అంటాం. ఇంగ్లిష్‌లో అయితే ఈ మామయ్య, బాబాయ్ తదితరులంతా uncle (అంకుల్) అనే మాట కిందికే వచ్చేస్తారు. అత్త భర్త కూడా అంకులే. అందుకే ఇంగ్లిష్‌లో ఠఛ్ఛి అనగానే ఏ వరుస అంకులో తెలియదు. వీళ్లు కాక, మనకు తెలియని uncles ఇంగ్లిష్‌లో కొంతమంది ఉన్నారు. ఈవారం వారిని పరిచయం చేసుకుందాం. Uncle Sam అనే మాట వినే ఉంటారు. అమెరికా దేశాన్ని, అమెరికా ప్రభుత్వాన్ని అంకుల్ శామ్ అంటారు. ముఖ్యంగా రాజకీయ వ్యంగ్య చిత్రకారులు తమ కార్టూన్లలో అమెరికా దేశానికి, లేదా ఆ దేశ ప్రభుత్వానికి ప్రతీకాత్మకంగా (సింబాలిక్‌గా) ‘అంకుల్ శామ్’ బొమ్మను గీస్తారు. రివటలా ఉండే బక్కపలుచని దేహం, నెరిసిన గెడ్డం, పొడవాటి టోపీ... ఇదీ అంకుల్ శామ్ అవతారం. అసలు అమెరికాకు అంకుల్ శామ్ అనే పేరు ఎలా వచ్చింది? 1812 అమెరికా-బ్రిటన్ల మధ్య యుద్ధం సమయంలో న్యూయార్క్‌లోని ట్రాయ్ ప్రాంతంలో నివసించే Samuel Wilson నడుపుతున్న సంస్థ నుండి అమెరికన్ సైనికులకు చక్కగా ప్యాక్ చేసిన మాంసాహార పదార్థాలు అందుతుండేవి. అప్పట్లో ప్యాకింగ్ మీద విధిగా కాంట్రాక్టర్ పేరు, వాటిని ఏ దేశానికైతే పంపిస్తున్నారో ఆ దేశం పేరు ముద్రించి ఉండేది. గిజీson ప్యాకింగ్ కంపెనీ నుంచి బట్వాడా అయ్యే ప్యాకింగ్‌ల మీద E.A-US అని ఉండేది. ఓరోజు కొత్తగా ప్యాకింగ్ పనిలో చేరిన ఓ కుర్రాడు ఈ అక్షరాలకు అర్థం ఏమిటి అని అడిగినప్పుడు తోటి కార్మికుడు ఉ.అ అంటే Elbert Anderson (కాంట్రాక్టర్ పేరు) అని చెప్పి, ఇక ్ఖ అంటే (యునెటైడ్ స్టేట్స్ అని చెప్పకుండా) తమ యజమాని Samuel Wilson ° ఉద్దేశించిమన Uncle Sam అని జోక్ చేశాడట! అప్పట్నుంచీ అంకుల్ శామ్ అనే పేరు వాడుకలోకి వచ్చిందని ఒక అభిప్రాయం. Uncle Sam లాగే Uncle Tom అని ఇంకొకాయన ఉన్నాడు! అంకుల్ టామ్ అంటే నల్లబానిస అని అర్థం. తెల్లవారి అడుగులకు మడుగులు ఒత్తుతూ అతివినయం ప్రదర్శిస్తుండే వ్యక్తిని తృణీకార భావంతో అంకుల్ టామ్ అని అంటారు. ఇక Dutch uncle అంటే అస్తమానం సలహాలు ఇస్తుండే పెద్దమనిషి. అవతలి వాళ్ల ఫీలింగ్స్ అస్సలు పట్టించుకోడు ఆయన. ఈ వాక్యం చూడండి. He acts more like a Dutch uncle than a husband. ఆయనెవరో భర్తలా కాకుండా డచ్ అంకుల్లా భార్యతో వ్యవహరిస్తున్నాడని. Everybody and his uncle అని ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది. అంటే lots of people అని అర్థం. మన వాడుకలో ‘పిల్లజెల్లా అంతా...’ అని. (The state fair was packed. Everybody and his uncle was there). Everybody and his brother అని కూడా అనొచ్చు. ఇలాంటివే uncle అనే మాటతో వచ్చే చిత్రమైన వ్యక్తీకరణలు మరో రెండు ఉన్నాయి. 1. Bob's your Uncle! (బ్రిటన్, ఆస్ట్రేలియాల మాడలికం). 2. I'll be monkey's uncle!(ఓల్డ్ ఇంగ్లిష్). ఒక పనిని ఎలా చేయాలో వివరంగా చెప్పడం పూర్తి చేశాక, ‘అంతే, సింపుల్’ అని అనడాన్ని ఇంగ్లిష్‌లో Bob's your Uncle అంటారు. అలాగే I'll be monkey's uncle అంటే ‘ఎంత ఆశ్చర్యపోయానో తెలుసా?’ అని చెప్పడం. గ్ఛి, I'll be a monkey's uncle. I never thought Anirudh would remarry. say uncle దీనర్థం... ఓడిపోయానని ఒప్పుకోవడం. to admit failure. ఇట y uncle అన్నా, holler uncle అన్నా కూడా ఇదే అర్థం. holler అంటే పెద్దగా అరవడం, cry అంటే తెలిసిందే... గీ పెట్టడం. ఈ వాడుకలన్నీ చిన్న పిల్లల ఆటల్లోంచి వచ్చినవే. ఒప్పుకో, (say uncle) ఒప్పుకున్నానని (say uncle అని) చెబితే తప్ప నిన్ను కదలనివ్వను అని చెప్పడమన్నమాట. ప్రధానంగా ఇది అమెరికన్ యూసేజ్. ఉదా: I'm deter-mined to show them I can be a star. I'm not going to say uncle.