Chittoor Crime News: Boy Killed By Uncle In Chittoor District - Sakshi
Sakshi News home page

బంధువుతో వివాహేతర సంబంధం.. బాలుడు చూశాడని..

Published Sun, Mar 20 2022 8:17 AM | Last Updated on Sun, Mar 20 2022 9:06 AM

Uncle Is The Killer In The Boy Murder Case In Chittoor District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కలికిరి(చిత్తూరు జిల్లా): వివాహేతర సంబంధం చూడడంతో ఓ బాలుడిని సొంత చిన్నాన్నే ఉరేసి చంపిన ఘటన అద్దవారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మండలంలోని అద్దవారిపల్లికి చెందిన కె.రవి, తులసి దంపతుల కుమారుడు ఉదయ్‌ కిరణ్‌ (8) ఈ నెల 11న శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి కనిపించకపోవడంతో 12వ తేదీన తల్లి కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అదేరోజు సాయంత్రం బాలుడు అద్దవారిపల్లి సమీపంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. జిల్లా ఎస్పీ, ఇన్‌చార్జ్‌ డీఐజీ సెంథిల్‌కుమార్, జిల్లా సెబ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విద్యాసాగర్‌నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించి మిస్టరీగా మారిన బాలుడి హత్య కేసును త్వరితగతిన ఛేదించాలని ఆదేశించారు.

చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం..

మదనపల్లి డీఎస్పీ రవిమనోహరాచారి ఆదేశాల మేరకు సీఐ నాగార్జున రెడ్డి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎట్టకేలకు హత్యకేసు చిక్కుముడి విప్పారు. 11న సాయంత్రం బాలుడు ఉదయ్‌కిరణ్‌ తనకు స్వయానా చిన్నాన్న కె.సహదేవ, సమీప బంధువు రాజేశ్వరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని చూశాడు. విషయం బయటకు చెప్తాడనే భయంతో ఇద్దరూ కలిసి ఉదయ్‌కిరణ్‌ మర్మాంగాలపై కొట్టి చంపేశారు.

ఉరేసుకుని చనిపోయినట్లుగా నమ్మించడానికి అర్ధరాత్రి శవాన్ని గ్రామ సమీపంలోని చెట్టుకు టవల్‌తో వేలాడదీశారు. ఈ మేరకు నిందితులు సహదేవ, రాజేశ్వరిలను అరెస్టు చేశారు. కేసు వివరాలను మదనపల్లి డీఎస్పీ మీడియాకు వెల్లడించారు.  కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన కలకడ ఎస్‌ఐ రవిప్రకా‹Ùరెడ్డి, వాయల్పాడు ఎస్‌ఐ బిందుమాధవి, కేవీపల్లి ఎస్‌ఐ బాలక్రిష్ణ, కలికిరి ఏఎస్‌ఐ మధుసూదనాచారిని జిల్లా ఎస్పీ అభినందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement