వియ్యంపుడి మృతి.. కోడలిని ఓదార్చిన కేసీఆర్‌ | KCR Consoles Daughter In Law Shailima Kalvakuntla | Sakshi
Sakshi News home page

వియ్యంపుడి మృతి.. కోడలిని ఓదార్చిన సీఎం కేసీఆర్‌

Dec 29 2022 4:20 PM | Updated on Dec 29 2022 4:29 PM

KCR Consoles Daughter In Law Shailima Kalvakuntla - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్‌ మామ హ‌రినాథ్‌రావు గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. హరినాథ్‌రావు పార్థివ‌దేహానికి సీఎం కేసీఆర్ నివాళుల‌ర్పించారు. తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన కోడలు శైలిమను కేసీఆర్‌ ఓదార్చారు. అనంతరం హరినాథ్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఎమ్మెల్సీ క‌విత‌, ఎంపీ సంతోష్ కుమార్‌, మంత్రి మ‌హ‌ముద్ అలీ, మేయ‌ర్ గద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి కూడా హరినాథ్‌ పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌కు సంతాపం ప్ర‌క‌టించారు. కేటీఆర్‌కు పిల్లనిచ్చిన మామ పాకాల హ‌రినాథ్‌రావు(72). గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న హ‌రినాథ్‌.. గ‌చ్చిబౌలిలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో కన్నుమూశారు. విష‌యం తెలుసుకున్న కేటీఆర్, ఆయ‌న భార్య శైలిమ‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులు హుటాహుటిన ఆస్ప‌త్రికి వెళ్లారు.

అనంత‌రం హ‌రినాథ్‌రావు మృత‌దేహాన్ని రాయ‌దుర్గంలోని ఓరియ‌న్ విల్లాస్‌లో ఉన్న ఆయ‌న నివాసానికి త‌ర‌లించారు. గురువారం సాయంత్రం హ‌రినాథ్ అంత్య‌క్రియ‌లు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement