భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహ ప్రయోగం నవంబర్ 5న మధ్యాహ్నం 2.36 గంటలకు నిర్వహించనున్నారు.
సూళ్లూరుపేట, న్యూస్‌లైన్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహ ప్రయోగం నవంబర్ 5న మధ్యాహ్నం 2.36 గంటలకు నిర్వహించనున్నారు. మంగళవారం బెంగళూరు నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ప్రయోగ తేదీని ప్రకటించారు. ఈ ప్రయోగానికి సంబంధించి 56.30 గంటల ముందు అంటే నవంబర్ 3న ఉదయం 6 గంటలకు కౌంట్‌డౌన్ మొదలవుతుంది.
నవంబర్ 5న ప్రయాణం మొదలు పెట్టే ఎంవోఎం వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలలో అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే ఈ నెల 19న లాంచింగ్ తేదీ ప్రకటించాల్సి ఉన్నా పసిఫిక్ మహా సముద్రంలో వాతావరణం అనుకూలించలేదని వాయిదా వేశారు. దానిని ఇప్పుడు ప్రకటించారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికపై నుంచి అత్యాధునిక ఎక్స్‌ఎల్ సాంకేతికతతో కూడిన పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌకద్వారా 1,350 కిలోల బరువు, రూ. 450 కోట్ల విలువైన ఎంవోఎం ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేశారు.