
అంగారకుడిపై ధూళి తుపాను!
బెంగళూరు: అరుణగ్రహం ఉత్తరార్ధగోళంపై ఆదివారం భారీ ధూళి తుపాను చెలరేగింది. ప్రాంతీయ స్థాయిలో ఏర్పడిన ఈ తుపానును మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్) ఉపగ్రహం తన కలర్ కెమెరాలో బంధించింది. ధూళి తుపాను సంభవించినప్పుడు అంగారకుడికి 74,500 కి.మీ. ఎత్తులో ఉన్న మామ్ ఈ ఫొటోను తీసిందని పేర్కొంటూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన ఫేస్‌బుక్ పేజీలో వెల్లడించింది. గత బుధవారమే అంగారకుడి కక్ష్యలోకి చేరి చరిత్ర సృష్టించిన మామ్.. గురువారం మార్స్ తొలి ఫొటోను పంపిన విషయం తెలిసిందే.